నిరాశ నిస్పృహలకు – జై ?

నిరాశ నిస్పృహలకు – జై ?

ఏంటో ఏమో ఏంటో ఏమో అంతా అగాధం జగన్నాధం ఉన్నది. ఏమీ తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాము ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా చేస్తే బాగుంటుంది నాకు ఎవరు చెప్పేవారు లేరు కదా ఎలా ముందుకు వెళ్ళేది ఇలా చేస్తే నేను అనుకున్న పని సాధిస్తానా? ఎలా ఎలా ఎలా ఎలా ఎలా నా మెదడులో ఎన్నో ప్రశ్నలు?

మాట మాట్లాడడానికి ఒక మనిషి కూడా లేరు. అసలు ఈ ప్రపంచంలో మనుషులే కరవయ్యారు లేకపోతే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారా అసలు ఏమిటి ఇదంతా అంటే ఈ కారణాల వల్ల అందరూ జీవితాల్లో బిజీ అయ్యారా పొద్దున లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవితాలు అంతా పిచ్చిపిచ్చిగా బ్రతికేస్తున్నారు డబ్బు సంపాదన మీద పడ్డారు.

నాకేమో ఇంట్లో ఉండాలంటే పిచ్చి లేస్తుంది ఎటు వెళ్లాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరైనా రానిస్తారా అయినా ఈ రోజుల్లో ఒకరికి భోజనం పెట్టడమే చాలా కష్టంగా మారింది. నీకేం కష్టం వచ్చింది అని అడిగి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి ఊరడింపు మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకైతే డౌటే ఎవరిని ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు.

ఎవరు ఎవరికి వారే సంపాదన మీద పడ్డారు. ఈరోజుకి ఇంత సంపాదించుకుంటే రేపటికి మళ్లీ ఇంకా ఎక్కువగా సంపాదించాలని ఆలోచనలోనే ఉన్నారు అయ్యో మీకు ఏమైంది మీరు ఎలా ఉన్నారు అని అడిగే వాడు ఎవడు లేడు ఇదంతా చూస్తుంటే నాకు చాలా చిత్రంగా అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద కుటుంబంలో పుట్టి పెద్ద కుటుంబంలో నుండి భర్తని పెళ్లి చేసుకుని అత్తవారింట్లో కూడా చాలామంది ఉండేవారు.

అంత పెద్ద కుటుంబం లో బతికిన నేను ఇప్పుడు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. ఎందుకో ఏమిటో తెలియదు కానీ నాకు ముగ్గురు పిల్లలు ఎవరికైనా నా బాధ చెప్పుకుందాం అనుకుంటే వినే వారే లేరు అయినా నీకు ఏంటమ్మా ముగ్గురు పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు బాగున్నారు కదా మూడు పూటలా తింటున్నారు కదా అంటారు.

కానీ నీకేం కష్టం వచ్చింది ఎందుకు అలా ఉన్నారు అని ఏ ఒక్కరు అడగడం లేదు అయినా నా పిచ్చి గానీ నా పిల్లలే నాకు కాకుండా పోయినాక ఇంకా వాళ్ళు ఎవరు? వీళ్ళు ఎవరు? చుట్టుపక్కల వాళ్ళు నా సొంత చుట్టాలు బంధువులు అవుతారా? నా బంధువులు నాకు దూరం అయ్యారు.

తల్లి లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు, ఎవరూ లేరు నేను ఒంటరిగా మిగిలాను అని అలా అనుకుంటే పొరపాటే ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా నీకు ఏమిటి నువ్వు బాగానే ఉన్నావు కదా వాళ్ళని చూసుకుంటూ బ్రతికేయొచ్చు కదా అని అందరూ అనే మాటే ఇది కానీ నాకంటూ ఒక మనసు ఉందని అది ఎవరితోనైనా పంచుకోవాలని నా కష్టసుఖాలు చెప్పుకోవాలని నాతోపాటు ముచ్చట పెట్టాలని అయ్యో ఏమిటమ్మా నీ బాధ అని అడిగి నన్ను ఓదార్చే వారు కావాలని కోరుకుంటున్నా ఎవరు దొరకట్లేదు.

అలా నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి నా కష్టసుఖాలను పంచుకునే నన్ను ఓదార్చే మనిషి కావాలి అని ఎదురు చూస్తున్నాను ఇన్ని రోజులైనా అని నవ్వుతూ పలకరింపుగా మాట్లాడే వారు ఎవరూ లేరు వాళ్లని చూస్తూ పలకరింపుగా మాట్లాడించిన ఎవరు ఎందుకు నేనేమైనా తప్పు చేశానా వాళ్లతో తప్పుగా ప్రవర్తించానా?

కనీసం తలుపు తీసుకొని వారి ముఖం చూస్తే కూడా వారు పలకరింపుగా నా ముఖం చూడలేదు ముఖం పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతారు అదే నా బాధ ఎందుకు నాతో తమాట్లాడలేరు? ఏమిటో ఈ వింత జీవితం నాకైతే చాలా బాధగా ఉంది మరి మీరు కూడా మీ చుట్టుపక్కల వాళ్లతో ఇలాగే ఉంటారా లేక అందరితో సరదాగా మాట్లాడుతారా?

లేదా మీతో వాళ్ళు సరదాగా మాట్లాడుతారా లేదా తలుపులు మూసుకొని ఇంట్లో కూర్చుంటారా? అయితే నాకు అర్థం కాని విషయం ఒకటి, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కష్టసుఖాలు పంచుకుంటూ ఉంటె ఒకరిలో ఉన్న బాధ తీరుతుంది కదా ఈ విషయం వాళ్లకు తెలియదా లేదా అర్థం కాదా లేదా పనిలో పడ్డారు లేదా డబ్బు సంపాదన చేస్తున్నారా ఎందుకంత పిచ్చి?

డబ్బు ఉంటే ఈరోజు ఉంటుంది రేపు పోతుంది ఏవండీ బాగున్నారా? వంట అయిందా? భోజనం చేశారా? ఏం కూర చేశారు అంటూ నవ్వుతూ రెండు మాటలు పలకరింపుగా మాట్లాడితే వాళ్ల సొమ్మేం పోతుంది? ఎందుకు అంత బింకమా లేదా గర్వమా రెండు మాటలు మాట్లాడితే తప్పేమిటి?

మొఖాలు చూస్తూ వెళతారు కానీ పలకరింపుగా చూసింది లేదు మాట్లాడేది లేదు నేను ఎంతగా తల బద్దలు కొట్టుకున్నా నాకు అర్థం కాని విషయం ఇది. ఇది ఒకటేనా? అయినా నాకంటూ స్నేహితులు కూడా ఎవరు లేరు నేను పలకరింపుగా ఎవరితో మాట్లాడినా కానీ నా విషయాలు తెలుసుకుంటారు గాని వాళ్ళ విషయాలు ఎవరు చెప్పరు.

అదేమిటో వాళ్ల పిచ్చి, అయిపోయింది ఇంకా ఎవరు మాట్లాడారు. నా విషయాలన్నీ తెలుసుకున్నారు కదా ఇంకా వాళ్లకు ఏం పని నాతో ఏమైనా వాళ్లకు పెట్టడం కావాలి ఇంట్లో కూరలు పెట్టాలి, పప్పులు పెట్టాలి, అన్నం పెట్టాలి, ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి, టిఫిన్ పెట్టాలి అప్పుడప్పుడు డబ్బులు ఇవ్వాలి.

ఏమండీ ఇలా రండి కూర్చోండి అనాలి, టీ పోయాలి, కాఫీ పొయ్యాలి. ఇలాంటివి చిన్న చిన్న ఈ గిఫ్ట్ లాగా ఇస్తే వాళ్ళకి లంచం నా దృష్టిలో లంచాలు పెడితే గాని మాట్లాడారు ఎందుకో ఈ లంచాల గొడవ. నాకు ఇష్టం ఉండదు అందుకేనేమో ఎవరు మాట్లాడారు. అలాంటి వాళ్ళని చూస్తే చాలా కోపం వస్తుంది అరే మనకేం పెట్టినా పెట్టకున్నా వాళ్ళతో మాట్లాడితే మన సొమ్మేం పోతుంది మాట్లాడదాం అని ఏ ఒక్కరు అనుకోరు.

ఏదో ఒకరి ఇద్దరు మాట్లాడినా కానీ మొహానికి నవ్వును పులుముకొని మాట్లాడే వాళ్ళంటే నాకు ఇంకా అసహ్యం అలాంటి వాళ్లతో మాట్లాడాలి అంటేనే కంపరం పుట్టుకొస్తుంది ఎందుకు? ఇవన్నీ చూస్తూ నాకు బ్రతకాలని లేదు నాకంటూ ఒక మంచి మనిషి కావాలని నాతో ముచ్చట్లు పెట్టాలని నేను కూడ మరి నేను కూడా మనిషిగా గుర్తించి నాతో మంచిగా మాట్లాడాలని కోరుకున్న నాకు ఎవరు దొరకట్లేదు.

ఎవరూ ముందుకు రావట్లేదు అలా నేను కూడా ఒక మనిషిని కదా ఒంటరిగా ఫీలవుతూ నాలో నేనే కుమిలిపోతూ ఉంటాను. ఇక సెలవు అయిపోయింది. నన్ను కన్న నా తల్లిదండ్రులకు నా అత్తమామలకు నా శతకోటి నమస్కారాలు ఇక ఉంటాను సెలవు మళ్లీ జన్మంటూ ఉంటే వంద మందిలో నేనొక్కదానిగా పుట్టాలి.

ఆ ఇంటిలో అమ్మలు, అమ్మమ్మలు, బాబాయిలు, చిన్నమ్మలు, చిన్ననాన్నలు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, అత్తలు, మామలు, అక్కలు, చెల్లెళ్లు, అన్నలు, తమ్ముళ్లు అందరూ ఉండాలి అలాంటి ఇంట్లో పుట్టాలి ఈ ఒంటరి జీవితం నాకొద్దు ఇక సెలవు. 

– రాధ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *