నీరిక్షణ

నీరిక్షణ

5 యేళ్లు అయింది తను నాకు పరిచయం అయ్యి.. కానీ ఇప్పటి వరకు మేము కలుసుకోలేదు… కానీ… వచ్చే సంవత్సరం అయన తనని కలవాలని…. మనసు ఆరాట పడుతుంది… అప్పుడే తను నాకు ఒక విషయము చెప్పాడు…. తనకి ఢిల్లీ లో జాబ్ వచ్చిందని.. ఇంకా మనం సరిగా మాట్లాడటం కుదరదు అని.. ఆ మాట విని నేను తట్టుకోలేక పోయాను…

కనీసం రోజుకి ఒక్కసారి అయినా మెసేజ్ కానీ కాల్ కానీ చేయమని అడిగాను… తను సరే అన్నాడు… అలా అలా రోజులు గడుస్తున్నాయి…. మా మధ్య మునపటిలా ఉన్నటువంటి మాటలు కూడా కరువు అయ్యాయి…. అయినా తనని ఏ రోజు ఏం అనలేదు… బిజీ ఉంటారు కదా అని లైట్ తీసుకున్న…. రోజులు కాస్త నెలలు అయ్యాయి…. నెలలు కాస్త సంవత్సరం అయ్యింది…. అయిన ఏ మార్పు లేదు….

సడెన్ గా ఒక రోజు నైట్ కాల్ చేసాడు… నేను వైజాగ్ వస్తున్నా అని… నా ఆనందానికి… హద్దులు లేవు మనసు మనసులో లేదు….. వెంటనే… నేను మా కాలేజ్ అడ్రస్ ఇచ్చి అక్కడకి పొద్దున్న 8 కీ రమ్మని చెప్పాను… తను అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేసాడు… నా సంతోషం అంతా నా మొహం లో స్పష్టంగా కనిపిస్తుంది…..

పొద్దున్నే లేచి ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయ్యి మా కాలేజ్ కి వెళ్ళాను…. కానీ తను ఇంకా రాలేదు…. 8 కాస్త 9 అయ్యింది… ఫోన్ చేస్తుంటే కలవలేదు…. అలా మధ్యాహ్నం వరకు ఉన్నాను అక్కడే…. ఇంకా రాడు అని నిర్ధారించుకుని… నేను ఇంటికి వెళ్ళిపోయాను…. మళ్ళీ సాయంత్రం తనకి ఫోన్ చేశాను బిజీ అని వచ్చింది…

సరే చేస్తాడు కదా అని… నేను వెయిట్ చేశా… అయినా తన నుండి ఎలాంటి ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ రాలేదు…. ఎన్ని సార్లు ఫోన్ చేసినా నో యూజ్… సరే అని నేను నా పనిలో నిమగ్నం అవ్వడం మొదలు పెట్టాను…. అందరి కంటే అన్నిటి కంటే బెస్ట్ అనిపించుకున్న…. కానీ… తను మాత్రం… నన్ను నా స్నేహాన్ని… అర్దం చేసుకోలేక పోయాడు…..

కానీ ఎప్పటికయిన తనని జీవితం లో ఒక్కసారి అయిన కలవాలి అని అనుకున్న……. అది ఎప్పుడు జరుగుతుందో తెలీదు అందుకే దేవుడి మీద బారంవేసి తనకై ఎదురు చూస్తున్నా……. దీన్ని ప్రేమ అని నేను అనను. ఎందుకంటే…. తనకి ఢిల్లీ లో జాబ్ వచ్చినప్పుడే…. తను వాళ్ల చుట్టాల అమ్మాయి తో పెళ్ళి మాటలు అవుతున్నాయి అని చెప్పాడు…. ఆ మాటకి నేను చాలా సంతోషించాను.. ప్రేమకీ స్నేహానికి ఉన్న వ్యత్యాసం నాకు బాగా తెలుసు…. అందుకే నా స్నేహం చాలా నిజమైనది అని నేను నమ్ముతున్నా… తన రాక కోసం ఎదురు చూస్తున్నా….

– మేఘమాల

Related Posts