నిరీక్షణలో

నిరీక్షణలో

తొలకరి చినుకు కోసం నోరుతెరిచే ఎండిన బీడుకి.
వసంతపు మావిచిగురు కోసం వేచిచూసే కోయిలమ్మకి.
గోమాత పొదుగు కోసం అర్రులుచాచే లేగదూడకి
గోపాలుని వేణుగానం కోసం  ఎదురుచూసే గోకులానికి.
మాధవుని ఆలింగనం కోసం విరహించే రాధమ్మకి
నారాయణుని ప్రత్యక్షం కోసం పరి తపించే నరుడికి.
నిరీక్షణలో క్షణం కూడా యుగమే ఆపై యుగం కూడా క్షణమే.
– శివ.KKR 

Related Posts