నిర్మలమైన ఆకాశం

నిర్మలమైన ఆకాశం

నీటి ఒడ్డున పెరిగిన చెట్లు..
నిర్మలమైన ఆకాశం..
ప్రశాంతమైన వాతావరణం..
మనసుకిస్తుందది పరవశం..
ఆకాశాన విహరించే మనసు..
ఆనందంతో అక్కడే ఆగిపోయింది..
స్వఛ్చమైన నీటిలో నీడను చూసుకుని మురిసి పోయింది..
నీటిలోని చేపపిల్ల చూసి నవ్విపోయింది..
చేపా చేపా ఎందుకు నవ్వావంటే..
మనుషుల మధ్యలో ఉండే నువ్వు..
ఇక్కడికి వచ్చి మాతో ఉన్నావని నీతో స్నేహం కోసం నవ్వానంది..
చేపమ్మ ఎంత మంచిదో కదా!

– ఉమాదేవి ఎర్రం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *