నిస్సహాయత

నిస్సహాయత

మధ్యతరగతి చిక్కుల్లో
నిరాశ, నిస్సహాయతలో
అలల్లా ఎగసే ఆలోచనలలో
అణుగారిన బతుకుల్లో
మిగిలే అంతరంగ మథనం
వృద్దాప్యంలో ఆదరించని
పుత్రుని ఆదయవ్యయాలను
ఆకలింపుచేసే మనసులో
మిగిలే అంతరంగ మథనం
కని, పెంచి పోషించి
స్కూల్ కి పంపడానికి
వెనుకాడే ఆడపిల్లని
మెట్టినింటికి వెళ్ళినప్పుడు
కలిగే అంతరంగ మథనం
బాధ్యతలు ఎరుగని తండ్రి
బిడ్డ రోడ్డున పడ్డపుడు
చుట్టాలు చీదరించినపుడు
కలిగే అంతరంగ మథనం
చదువుకునే రోజుల్లో శ్రద్దలేక
పనిచేసే వయస్సులో బాధ్యతలేక
ఇబ్బంది కలిగినపుడు అమ్మనాన గుర్తొస్తే
కలిగే అంతరంగ మథనం

– హనుమంత

Related Posts