నువ్వే నువ్వే

నువ్వే నువ్వే

నువ్వే నువ్వే

అసలు నేను బ్రతికి ఉన్నాను అంటే కారణం నువ్వు, నువ్వు లేకపోతే నేనెప్పుడో చనిపోయేదాన్ని. ఎవరెన్ని మాటలు అంటున్నా,ఎవరెంత తిడుతున్నా నేను నీ కోసం ఎదురు చూసాను. నువ్వే కావాలి అనుకున్నాను.

అందుకోసం చెయ్యని పూజ లేదు.మొక్కని దేవుడు లేడు. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను.ఎన్నోసార్లు ఒంటరిగా ఏడ్చాను. ఎవరేమి చెప్పినా చేశాను. ఎవరెన్ని మాటలు అన్నా పడ్డాను. కేవలం నీ కోసం నీ కోసం మాత్రమే.

నువ్వు వస్తావని, ఎప్పుడో ఏ క్షణమైనా రావచ్చు అని తినకుండా ,పడుకోకుండా వేల రాత్రుళ్లు వేచి చూసాను. ఎన్నో కలలు కన్నాను నీ రాక కోసం ,ఎంతో ఎదురు చూసాను. నువ్వు వచ్చాక నీతో ఎన్నో ఆటలు ఆడుకోవాలని అనుకున్నాను.

చివరికి నా కల నిజం అయ్యింది.నువ్వు వచ్చావు.అందరి నోళ్లు మూయించావు, అందరూ నీ రాక చూసి కుళ్ళీ కున్నారు. అందరూ నిన్ను ముద్దు చేస్తుంటే నాకు కుళ్ళు మొదలైంది. నా చేతిలో ఒక్క క్షణం లేకుండా అందరూ నిన్ను పంచుకున్నారు.

అయినా వారి నుండి నిన్ను లాక్కున్నాను,నువ్వే నా లోకంగా బతికాను.నిన్నే నా లోకంగా చేసుకున్నాను. ఇప్పుడు నా సర్వస్వం నువ్వే , నా జీవితానికి నువ్వే ఆలంబన. నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. నా ఈ ప్రేమ నీకు అర్దం అవుతుందని భావిస్తున్నాను.

కన్నా ,బంగారం నా జీవితం నీకే అంకితం. నువ్వే నా ప్రాణం ,నువ్వే నా ద్యాస,అస,శ్వాస అన్ని నువ్వెరా బంగారు కొండ…

 

– భవ్య చారు

అర్థరాత్రి మద్దెల దరువు Previous post అర్థరాత్రి మద్దెల దరువు
విలువైన ప్రేమ Next post విలువైన ప్రేమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close