నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు

నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు

(పాబ్లో నెరూడా: స్పానిష్ కవి)

నువ్వు పర్యటించకపోతే,
నువ్వు చదవకపోతే,
నువ్వు జీవిత ధ్వనులను వినకపోతే,
నిన్ను నువ్వు అభిమానించకపోతే,
నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు

నీ ఆత్మ గౌరవాన్ని నువ్వు చంపుకున్నప్పుడు,
సహాయం చేసే చెయ్యి అందుకోనప్పుడు,
నువ్వు మెల్లగా మరణించడం మొదలు పెడతావు

నీ అలవాట్లకు నువ్వు బానిస అయినప్పుడు,
అదే దారిలో రోజూ నడుస్తున్నప్పుడు,
నువ్వు అలవాటుగా చేసే పని మార్చనప్పుడు,
నువ్వు వివిధ రంగులు ధరించనప్పుడు,
లేదా అపరిచయస్తులతో మాట్లాడనప్పుడు,
నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు

ఆవేశాన్నీ, ఆవేశం సృష్టించే అల్లకల్లోల భావాల్నీ,
నీ కళ్ళను చెమ్మగిల్లేలా,
నీ గుండె వేగంగా కొట్టుకునేటట్లు చేసే సంఘటనలనూ,
నువ్వు తప్పించుకు తిరుగుతున్నప్పుడు,
నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు

నీ భద్రతను వదలి అనిశ్చితిలోకి నువ్వు అడుగు పెట్టనప్పుడు,
నువ్వు ఒక కల వెనుక పరిగెట్టనప్పుడు,
జీవితంలో కనీసం ఒక్కసారి,
నువ్వు పరిగెట్టనప్పుడు…
నువ్వు మెల్లగా మరణించడం మొదలుపెడతావు

నీ జీవితాన్ని ప్రేమించు,
నిన్ను నువ్వు ప్రేమించు…..

******

– విశ్వనాధ్

Related Posts