ఓ అమ్మాయి ప్రేమ కథ

ఓ అమ్మాయి ప్రేమ కథ

హలో…. గుడ్ ఈవినింగ్ ఆల్…. అయ్యో ఈ అమ్మాయ్ ఏంటి లవ్ స్టోరీ చెప్పే ముందు ఇలా గుడ్ ఈవెనింగ్ అంటుంది అనుకోండి నాకు కొంచెం పిచ్చి… అంటే రాత్రులు, సాయంత్రాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక నా కథ మొదలు పెడదాం…

నా పేరు అదితి మరియు వాడి పేరు కొంచెం కొత గా చెప్తా… కాబట్టి అదితి – త్ + య = ఆదిత్య తన పేరు ఆదిత్య….

ఈ కథ కొంచెం డ్రమాటిక్ ఉంది….

ఒక రోజు నేను మా ఇంట్లో మా తముడితో గొడవ పడుతుంటే ఆదిత్య మా ఇంటికి వచ్చాడు. అప్పుడు చూసా వాడిని మొదటి సారి చూడగానే అట్రాక్ట్ అయ్యాను….. ఇక్కడొక విషయం ఏంటంటే, నేను ఆదిత్య ని చూసా కానీ ఆదిత్య నన్ను చూడలేదు…. నేను దాన్ని ఆకర్షణ అనుకున్నా కాబట్టి తొందరగానే మర్చిపోయాను తనని…

కానీ మళ్ళీ వాడు నాకు గణేష్ చతుర్ధి అప్పుడు కనిపించాడు. కుర్తి ఇంకా పైజామా వేసుకున్నాడు.. ఎంత బాగున్నాడో అనిపించింది. నా అదృష్టం కాకపోతే, అదే రోజు ఆదిత్య నా కళ్ళు మాత్రమే ఉన్న ఫోటో మా అన్నయ్య ఫోన్లో చూశాడు. మా అన్నయ ని అడిగాడు ఏవరి కళ్ళు ఇవి అని మా అన్నయ నా చెల్లి కళ్ళు అని రిప్లై ఇచ్చాడు… అన్నయ్య రిప్లై ఇచ్చి ఫోన్ నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆదిత్య నా కళ్ళు బాగున్నాయి అని మెసేజ్ చేసాడు.. నాకు చాలా హ్యాప్పీగా అనిపించింది.

మరుసటి రోజు నేను ఆదిత్య కి ఇన్‌స్టాలో హాయ్ అని మెసేజ్ చేసా…. వెంటనే హలో… ఎవరు నువ్వు? అని రిప్లై ఇచ్చాడు… నేను నా కళ్ళ పిక్ పెట్టాను.. వాడు మా అన్నయ పేరు చెప్పి ఆ… అన్నా వాళ్ళ సిస్ కళ్ళు కదా ఇవి అని అన్నాడు… అపుడు నువ్వు హా అవును…. నేనే ఆ… అన్న సిస్ ని అని రిప్లై ఇచ్చాను… తను నా ఫుల్ ఫోటో అడిగాడు కానీ నేను, ఎందుకు అంత తొందర పడతావు కొన్ని రోజులు ఈ… సీక్రెట్ ఫ్రెండ్ తో ట్రావెల్ చెయ్ అని రిప్లై ఇచ్చా…

అపుడు వాడు నా అన్నయ్యని అడుగుతా అని వెళ్ళాడు… అసలు నేను చాలా స్మార్ట్ కాబటి మా అన్నయ్యకి ముందే చెప్పాను ఎవరైనా నా పిక్ అడిగితే పెట్టకు అని.. కాబట్టి మా అన్నయ్య పెట్టలేదు మళ్ళీ నా దగ్గరికి వచ్చి నేను మీ అన్నని నీ పిక్ అడిగాను కానీ తను పెట్టలేదు అని చెప్పాడు… సరే నీ ఇష్టం ఉన్నప్పుడే పెట్టు అని అన్నాడు.

తరువాత మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాము అలా మేము ఫ్రెండ్స్ లా కొన్ని రోజులు మా చట్ నడిచింది. ఆదిత్య చాలా సార్లు నీ కళ్ళు బాగుంటాయి అని చెప్పేవాడు…. వాడు నాతో అయిన కొన్ని రోజుల పరిచయానికే చాలా కేర్ చెయ్యడం స్టార్ట్ చేసాడు. ఎప్పుడూ నాతో తన లిమిట్స్ దాటి మాట్లాడలేదు. నేను ఏది చెప్పినా చెప్పక పోయినా వాడు నాతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు….

వాడిలో ఈ విషయం నాకు చాలా నచ్చింది. నాకు అలవాటు అయ్యాడు. ఎందుకో నాకు తెలీదు కానీ వాడి తో మాట్లాడిన ప్రతీ సారి లేదా వాడి గురించి ఆలోచించినప్పుడు నాకు ఏదో విచిత్రమైన ఫీలింగ్ ఆ…. ఫీలింగ్ ఏంటో నాకు అప్పుడు అర్ధం కాలేదు. ఆ తర్వాత కొని రోజులకి తెలియకుండా నేను, ఆదిత్య సేమ్ ఫంక్షన్ కి వెళ్ళాము…. ఆదిత్య కి నేను ఎలా ఉన్నానో తెలీదు కాబట్టి వాడితో కొంచెంసేపు అడుకుందామా అనుకొని వాడికి మెసేజ్ చేసాను.

నేను కూడా నువ్వు ఉన్న ఫంక్షన్ లోనే ఉన్నా నేను ఎవరో కనిపెట్టడానికి ప్రయత్నించు అన్నాను. అప్పుడు నేను ఎవరో తెలుసుకుందాం అని నన్ను వెతకడం మొదలు పెట్టాడు. అప్పుడు నాకు చాలా సరదాగా అనిపించింది. కానీ సడన్గా బై మిస్టేక్ నేను తన ముందుకి వెళ్లాను… నన్ను గుర్తు పడతాడేమో అనుకున్నా కానీ దేవుడున్నాడు నన్ను గుర్తు పట్టకుండా చూసి వెళ్ళిపోయాడు… 

కొద్దిసేపు అయ్యాక తను నా దగ్గరికి వచ్చి, ఈ దాగుడుమూతలు ఇంకా ఎన్నిరోజులు ఆడుతారు అదితి గారు…! అని అన్నాడు… నేను షాక్ లో అలా చూస్తూ ఉండిపోయా.. అలా ఏలా గుర్తు పట్టావు అని అడిగాను….. అలా వాడు….నీ కళ్ళు చాలు నిన్ను గుర్తు పట్టడానికి అని చెప్పాడు.. ఇందాక నువ్వు నా ముందు నుండి వెళ్ళినప్పుడు నీ కళ్ళు చూసాను సో ఈజీగా గుర్తు పట్టేసా అని చెప్పాడు. అలా చెప్పి ఊపిరి తీసుకొని నాకు ఐ లవ్ యూ అని చెప్పాడు.. కానీ నాకు ఏదోలా అనిపించింది కోపంగా అక్కడినుండి వెళ్ళిపోయా… 

తరువాత ఆదిత్య నాకు చాలా సార్లు మెసేజ్ చేసాడు కానీ నేను రిప్లై ఇవ్వలేదు. తను నాకు అలా చెప్పినప్పుడు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్ధం కాలేదు.. నాకు ఎం చెయ్యాలో తెలియక ఒకరోజు, నాకు ఓక సీనియర్ అక్క చాలా క్లోజ్ సో తనతో ఈ విషయం అంతా చెప్పాను. అలాగే తను నాకు ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఎదో ఒక విచిత్రమైన ఫీలింగ్ వచ్చింది అని చెప్పాను.. ఎం చెయ్యాలి అని అడిగాను.. అప్పుడు తను, నువ్వు తనని లవ్ చేస్తున్నావు అని చెప్పింది లవ్ అంటే ఏంటో కూడా చెప్పింది… తను అలా చెప్పగానే నేను చాలా సార్లు ఆలోచించాను నాకు కూడా నిజమే అని అనిపించింది ఇక ఆదిత్య లవ్ యాక్సెప్ట్ చేసా…. ఇలా మొదలైంది మా లవ్ స్టొరీ… 

ఒక మా లవ్ స్టొరీ మొదలయ్యాక ఆదిత్య నన్ను చాలా కేరింగ్ గా చూసుకున్నాడు… ముఖ్యంగా నా పీరియడ్ టైమ్ లో నాతో ఉండడం… నా నొప్పి తగ్గడానికి చాక్లెట్స్ ఇవ్వడం నాకు చాలా నచ్చింది.

నేను మా పేరెంట్స్ కి ఒక్కగానొక్క కూతురిని అందువల్ల ఆ అన్నయ్య మా పిన్ని వాళ్ళ కొడుకు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాళ్ళు, తనకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు.. నేను ఒకే కూతురు ఉండడం వల్ల మా పేరెంట్స్ నాకు చాలా ఫ్రీడం ఇచ్చారు. కానీ వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీగా ఉండడం వల్ల నన్ను సరిగ్గా పట్టించుకోలేదు నాతో వాళ్ళు టైం స్పెండ్ చేసేవారు కాదు.

అంతేకాకుండా మా పేరెంట్స్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అందువల్ల బంధువులు కూడా మా ఇంటికి తక్కువగా వచ్చేవారు. కాబట్టి నేను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నాకు మాట్లాడడానికి ఎవరూ లేరు… అలాగే నా జీవితంలో నేను ఎక్కువగా ఎప్పుడూ సంతోషంగా లేను, నా స్పెషల్ డేస్ లో, అంటే ముఖ్యంగా బర్త్ డేస్ లలో ఎక్కువగా ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని ఎందుకంటే మా పేరెంట్స్ నాకు గిఫ్ట్స్ కొనిచ్చేవారు కానీ నాతో ఉండేవారు కాదు..  కానీ ఆదిత్య నాకు ఎప్పుడూ ఒంటరి అనే ఫీలింగ్ రానివ్వలేదు…

ఆదిత్య విషయానికి వచ్చేసారికి నా పుట్టినరోజు నేను ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని అని తెల్పోసుకొని ఆ ఫీలింగ్ పోగొట్టడానికి నా బర్త్ డే ని కొంచెం స్పెషల్ చేసాడు. ఒక అనాథ శరణాలయంలో చాలా మంది పిల్లల మధ్యలో కేక్ కట్ చేయించాడు… నేను చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను. నా 25వ పుట్టినరోజు నాకు చాలా మేమోరియబుల్ గా చేసాడు. ఇలా పుట్టినరోజులు అనాథ శరణాలయంలో చేసుకోవటం మీకు కమన్ ఎమో కానీ నా లైఫ్ లో ఇది కొత్త విషయం….

సో… ఇలా సాగుతున్న మా లవ్ స్టోరీలో హఠాత్తుగా ఓక సమస్య వచ్చింది. ఎందుకో తెలియదు కానీ ఆదిత్య నాతో మాట్లాడడం తాగించాడు… నన్ను పట్టించుకోకుండా ఉండడం స్టార్ట్ చేసాడు… ఎంత మెసేజ్ చేసినా చాలా తక్కువ రిప్లిస్ ఇవ్వడం చేసేవాడు. మదినిండా ఏవేవో ఆలోచనలు, అన్నిటినీ పక్కన పెట్టి తనపై నమ్మకంతో ఒపికపట్టాను.. కానీ కోపాన్ని ఆపుకోలేక తనని ఒకసారి కలిసి నిలదీసాను. 

ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు దూరం పెడుతున్నావు అని అడిగితే అప్పుడు చెప్పాడు, వాళ్ళ ఇంట్లో ఎదో సమస్య వచ్చింది, గొడవలు అవుతున్నాయి, అందువల్ల ఎక్కువ మాట్లాడలేదు క్షమించమని అడిగాడు.. అయ్యో నాకు తెలియదు అని చెప్పి తనతో కొంచం టైం స్పెండ్ చేసాను అన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు అన్నిటికీ సర్ది చెప్పి ఒక ధైర్యం ఇచ్చాను.. కొన్ని రోజులకి తను సెట్ అయ్యి ఎప్పటిలా మారాడు… చాలా సంతోషంగా అనిపించింది. 

కొన్ని రోజుల తర్వాత నేను తనని అడిగాను, నేను నీకు ఎందుకు ఇష్టం అని.. అప్పుడు తను, నువ్వు నన్ను చాలా బాగా అర్ధం చేసుకుంటావు…. నా ప్రాబ్లమ్స్ లో నాతో ఉంటావు, ముఖ్యంగా నేను ఎప్పుడు కాల్ చేసినా ఆన్సర్ చేస్తావు….. అలాగే నేను నీతోనే మాట్లాడాలి అని, వేరే అమ్మాయిలతో మాట్లాడొద్దు అని ఎలాంటి రూల్స్ పెట్టలేదు, ఇంకా నేను ఎవరెవరితో చాట్ చేస్తున్నానో చూడడానికి నా ఇన్ స్తాగ్రామ్ అకౌంట్ అడగలేదు అంత నమ్మావు నన్ను… ఒక అబ్బాయికి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు… అని అన్నాడు నాకు ఎంతో సంతోషంగా అనిపించింది, తనపై ప్రేమ ఇంకా పెరిగిపోయింది…. 

ఇలా సాగిపోతున్న మా లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది…. ఆదిత్యకి కాలేజ్ ప్లేస్మెంట్స్ లో జాబ్ వచ్చింది హైదరాబాద్ లోనే కానీ జాబ్ పైనా పని పడి ఔట్ ఆఫ్ స్టేషన్ పోవాల్సివచ్చింది….. అలా ఆదిత్య ఔట్ స్టేషన్ వెళ్ళిన నెక్స్ట్ డే మరుసటి రోజు నాకు ఒక యాక్సిడెంట్ అయ్యింది.

ఈ ఒక్క యాక్సిడెంట్ వల్ల నా మోస్ట్ హ్యాపీయెస్ట్ లైఫ్ ఓక అనుకోని యూటర్న్ తీసుకుంది. ఈ యాక్సిడెంట్లో నేను నా కళ్ళు పోగొట్టుకున్నా…. నేను హాస్పిటల్ లో నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే ఆదిత్యని కలిసి మొత్తం చెప్పాలని అనుకున్నా కానీ ఆదిత్య కి నాలో ఎక్కువ నచ్చింది నా కళ్ళు… అవే లేకుండా వాడిని కలవాలి అని అనిపించలేదు. ఇక నా కళ్ళు పోయాయి అని తెలిస్తే వాడు చాలా బాధ పాడుతాడు.

వాడిని బాధ పెట్టడం ఇష్టం లేక వాడిని దూరం పెట్టాను… వాడితో అర్ధం లేకుండా గొడవ పెట్టుకున్నా… వాడికి బ్రేకప్ చెపాను…. కానీ కొంతమంది అంటారు ప్రేమలో మనుషుల శరీరాలు వేరైనా మనసు ఒక్కటే అని… అలానే ఆదిత్యకి అయ్యి, నాకు ఎదో అయింది అని అందుకే దూరం పెడుతున్నా అని…

సో నాకు ఏం అయిందో తెలుసుకుందా అని ఆదిత్య నా ఫ్రెండ్స్ ని కలిసి నాకు ఏం అయింది ఎందుకు బ్రేకప్ చెప్తున్నానో తెలుసుకున్నాడు. అప్పుడు తను, ఒక ప్రమాదంలో నా కళ్ళు పోయాయి అని… ఆ తరువాత నా ఫ్రండ్ హెల్ప్ తో నన్ను డైరెక్ట్ గా కలిసాడు…. వాడు నాతో చెప్పాడు, నేను నీ కళ్ళు మాత్రమే కాదు నిన్ను కూడా ప్రేమించాను అని….. ఇది విన్నాక నాకు చాలా ఏడుపు వచ్చింది… గాటిగా ఆదిత్య ని కౌగిలించుకొని I LOVE YOU అని చెప్పాను

అలా మళ్ళీ మేము కలిసిపోయాము… ఆదిత్య నా కళ్ళు పోవడంతో నన్ను ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటున్నాడు….. ఎప్పుడూ నాతో ఉంటాడు అయితే నాకు ఇంకో హ్యాప్పీ న్యూస్ తెలిసింది అదేంటంటే, నాకు సరిసమానంగా సరిపోయే కళ్ళు దొరికాయి అని…  ఆ క్షణం నుండి నాకు కళ్ళు ఇచ్చిన వాళ్ళకి నేను చాల థాంక్ఫుల్ గా ఉంటాను అని ప్రామిస్ చేశా, వాళ్ళకి మనసులోనే ఎన్నోసార్లు వేల వేల కృతజ్ఞతలు చెప్పుకున్నా… ఆ తర్వాత మళ్ళీ నేనూ ఆదిత్య కలిసిపోయాము పెళ్లి చేసుకొని హ్యాప్పీగా ఉన్నాము…

“ఒకడు నిజం గా మనల్ని ప్రేమిస్తే వాడు చచ్చేవరకు కూడా మనల్ని వదిలేయడు”…….

– జాహ్నవి

Related Posts