ఓ చెలీ కథాకలి

ఓ చెలీ కథాకలి

ఓ చెలీ కథాకలి

పల్లవి :—

ఉన్నదంతా నీవెలే
మనసున కొలువైనదంతా నీకెలే
ఓ చెలీ కథాకలి ఎవరికని నీకౌగిలి…

చరణం : —

మరుపురానిది నీరూపం
మధురమైనది ఆ స్వప్నం
నింగి చూస్తున్నది ఈ విశాల హృదయం…

చరణం :—

కనులకది కమనీయమైనది
మనస్సుకేమో నవనీతమైనది…
నీకై ఎదురు చూస్తున్నది
దేనికో తెలియని ఈ విరహపు ఆవేదనా…

చరణం :—

ఈ ఎడబాటులో తెరచాటునా
దాగిన భావాల కర్థమెన్నడో
నీకై దారి తెన్నులు కాస్తున్నది…
మురిపించి మరుగున తోయక
కలలరూపం నిజమయ్యేదెన్నడో
ఓచెలీ ఎవరికని నీకౌగిలి ఎవరికని..‌‌.

 

కలంపేరు :—- నేరాపు
(నేను!రాసుకున్న పుస్తకం)
దేరంగుల భైరవ

వాలుజడ Previous post వాలుజడ
అందంగానే ఉంది Next post అందంగానే ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close