ఓ మనిషీ.!

ఓ మనిషీ.!

*ప్రపంచాన్ని కూలదోసి ఎక్కడుందామనుకున్నావ్.? విలవిల్లాడుతున్నావిప్పటికే, సత్యం తెలుసుకో..

*జనం‌ చస్తుంటే జగత్తు మెరిసిపోతోంది..నీదీ అనుకున్న‌ ప్రదేశంలో నిశ్శబ్దం‌ అలుముకుంది..

*నీవైపే మృత్యువు పరుగుదీస్తుంటే.. ప్రాణం మోక్షమార్గం చేరుకుందని అంటావో.. బతికి బట్టకడితే నీవే పరమాత్ముడననుకుంటావో..నీ ఇష్టం కానీ..

*కనిపించని దైవమేదో పసి బిడ్డవలే ఈ ప్రపంచాన్ని మళ్లీ నీ చేతిలో పెడుతోంది.. కాపాడుకుంటావా.?

*నీటిని స్వచ్ఛం చేసి.. గాలిని శుద్ధి చేసి.. నీ మనసునే ఒక గుడి చేసి మళ్లీ నిన్ను నమ్మి నీకందిస్తోంది.. రక్షించుకుంటావా.?

*ఎక్కడేది ఉంచాలో దానిని అక్కడే ఉంచి ప్రకృతిని ఆస్వాదించు.. ప్రపంచాన్ని ఆనందించు. ప్రకృతిని, ప్రపంచాన్ని భావితరానికి కాస్తైనా మిగిల్చు.

– ది పెన్

Related Posts