ఓ నాన్న

ఓ నాన్న

భారమంతా మోస్తావు,
పైకి మాత్రం నవ్వుతూ ఉంటావు ,
నలుగురిలో ఒకరిగా కలుస్తావు
అందరికీ ప్రేమను పంచుతావు
అందరితో బాగుంటేనే మంచిదని అంటావు
అందరూ నా వాళ్ళే అనుకుంటావు కానీ
సొంతవారే మోసం చేశారని తెలిస్తే
ఓ నవ్వు నవ్వి నా వారే కదా, తెలియక
చేసారంటావు, బాధ్యతలన్నీ మోసి
కనపడకుండా వెళ్లావు
కన్నీళ్ళను గుండెల్లో దాచవు
కారు మబ్బులు కమ్ముతున్న
గుండె ధైర్యం తో బతికావు
ఇలాగే బ్రతకాలంటూ
దారి చూపుతూ, దాటి వెళ్ళావు…
ఓ నాన్న నీ జ్ఞాపకాలను నిన్నూ మరవగలమా..

 

– భవ్యచారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress