ఓ రమ్య కథ
భారీగా కట్నం, నగలు ఇచ్చి రమ్య పెళ్లి చేశారు పెద్దలు వద్దన్నా వినకుండా, రమ్య డిగ్రీ చేసి, ఐ ఏ ఎస్ కావాలని అనుకుంది. కానీ పెద్దలు మాత్రం చదివిన డిగ్రీ చాలు అంటూ పెళ్లి చేశారు. రమ్య ముందుగానే నెమ్మది మనిషి దానికితోడు పెద్దలంటే గౌరవం కాబట్టి తు.చా తప్పకుండా వింటుంది వారి మాటలను. పెద్దలు తన గురించే చెప్తారు కాబట్టి తను అందుకు ఒప్పుకుంది..
పెళ్లి జరిగాక కానీ అసలు విషయం బోధపడలేదు రమ్యకి. భర్త, మామ ఇద్దరూ కలిసి కూర్చుని తాగడం, అత్త కిట్టీ పార్టీలు అంటూ బయట తిరగడం. ఆడపడుచులు ఏమి పట్టించుకోకుండా 24 గంటలు ఫోన్లలో తలదూర్చి చాటింగ్స్, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ ఉండడం గమనించింది. తాను ఉన్న వాతావరణం వేరు ఇప్పుడు ఈ వాతావరణం వేరు కాబట్టి ఎలాగైనా తనే సర్దుకుపోవాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది.
తాగుబోతు భర్తను, మామను మార్చాలని ప్రయత్నం చేసింది కానీ వాళ్ళు మారకపోగా పైగా రమ్య మీదనే నిందలు వేసి తనని తిట్టడంతో ఇక ఏమీ చేయలేక మీనాకుడిపోయింది. అత్తగారు కిట్టి పార్టీ లంటూ డబ్బులు ఖర్చు చేయడం చూసి అత్తగారిని కూడా మార్చాలని ప్రయత్నం చేసింది కానీ ఆమె కూడా అలాగే తనని తిట్టింది దాంతో తను కూడా ఏమీ చేయలేక ఊరుకుంది.
ఇక ఆడపడుచులను రీల్ చేయొద్దు అంటూ రేపు పెళ్లిలో ఎలా అవుతాయంటూ మార్చడానికి ప్రయత్నం చేస్తే, నీ పని నువ్వు చూసుకో మా జోలికి రాకు అంటూ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఇక ఏమి చేయలేనని గ్రహించిన రమ్య వంటింటి కుందేలుగా మారిపోయింది. పొద్దంతా వండింట్లో కష్టం చేస్తూ రాత్రి భర్తని సుఖ పెడుతూ ఇద్దరు పిల్లల్ని కూడా కన్నది.
అయితే ఇవన్నీ విషయాలు తల్లి గారి ఇంట్లో రమ్య చెప్పుకున్నా కూడా వాళ్ళు అందరూ అలాగే ఉంటారమ్మా నువ్వే సర్దుకోవాలి అని సలహాలు ఇవ్వడంతో ఎవరికి ఏం చెప్పాలో చెప్పినా కూడా నన్ను అర్థం చేసుకోరు అని భావించిన రమ్య ఇక ఎవరికి ఏమి చెప్పకుండా తన అత్తింట్లోనే చాకిరీ చేస్తూ ఉండ సాగింది. రోజులన్నీ ఒకేలా ఉండవు.. కాబట్టి తాగి తాగి రమ్య భర్త శేఖర్ కాలేయం దెబ్బతిన్నది. అప్పుడు గానీ అందరూ కళ్ళు తెరవలేదు. తనకి బాగా అంటే ఎవరైనా ఒకరు కాలేయం దానం చేయాలి కానీ తల్లిదండ్రులు అక్క చెల్లెలు ఎవరు ముందుకు రాకపోవడంతో రమ్యనే ఆ పనికి పూనుకుంది.
అతనికి కాలయ మార్పిడికి రమ్యకు సెట్ అవ్వడంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి రమ్య కాలయంలోని సగం కాలేయం అతనికి అమర్చారు దాంతో గండం గరిచింది. రమ్మ ఇలా చేసినా కూడా ఆ మొగుడి కోసం చేసింది మన కోసం ఏమైనా చేసిందా అంటూ అత్తమామలు, ఆడపడుచులు బుగ్గలు నొక్కుకున్నారు తప్ప తనకి సపోర్ట్ చేయలేదు తను ఆపరేషన్ అయినా కూడా అదే పరిస్థితిలో ఇంట్లో పనులన్నీ చేసుకోసాగింది ఒక్కరు కూడా సహాయానికి రాలేదు అయినా ఓపికగా ఎంతో సహనంగా ఇల్లుని, పిల్లలని అటు అత్తమామల్ని ఇటు భర్తని జాగ్రత్తగా చూసుకుంది.
అయితే ఈసారి తాగి మామగారికి కూడా అదే పరిస్థితి రావడం వల్ల హాస్పిటల్ లో జాయిన్ చేయాల్సి వచ్చింది. ఈసారి కాలయం ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. వేరే డోనర్స్ దగ్గర తీసుకుందాం అన్నా కూడా ఎవరిది మ్యాచ్ అవ్వకపోవడంతో డాక్టర్లు మీ ఇంటి వాళ్ళు ఎవరైనా ఇవ్వండి అంటూ అడిగారు. దానికి అత్తగారు అమ్మో నేను ఇస్తే నాకు ఈ పార్టీలు ఏమి గాను అంటూ తప్పుకుంది. ఆడపడుచులు రేపు మాకు పెళ్లిళ్లు అవుతాయి మేము పిల్లల్ని కనాలి కాబట్టి మేము ఇవ్వలేము అంటూ చేతులెత్తేశారు. ఈ విషయంమంతా రమ్య తన తల్లిదండ్రులకు చెప్పింది.
వెంటనే వాళ్లు రమ్య వాళ్ళ ఇంటికి వచ్చి డాక్టర్లతో సంప్రదింపులు జరిపి రమ్య నాన్నగారి కాలయంలో నుంచి కొంచెం కాలయం తీసి అమర్చవచ్చా లేదా అనేది టెస్ట్ చేయమని అడిగారు. దాంతో డాక్టర్లు టెస్ట్ చేసి మ్యాచ్ అవుతుందని చెప్పడంతో రమ్య తండ్రి రమ్య మామ గారికి కాలేయం ఇచ్చాడు.
రమ్మనే కాకుండా రమ్య తల్లిదండ్రుల మంచితనం చూసి వాళ్ల మామగారికి అత్తగారికి జ్ఞానోదయం అయింది. అతని హాస్పిటల్ ఖర్చులకి డబ్బంతా కరిగిపోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పక్షుల అయిపోయారు అందరూ…. పైగా ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్లు చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని మళ్ళీ ఒక సమస్యలో చిక్కుకున్నారు.
అప్పుడు మళ్ళీ రమ్మనే ముందుకు వచ్చి తమ చుట్టాలలో ఉన్న తమ కజిన్స్ కి తమ ఆడపడుచులను ఇచ్చి సింపుల్ గ్స్స్ పెళ్లి జరిపించింది.. కానీ కట్నం లేకుండా పెట్టిపోతలేమీ లేకుండా వదిన తమ పెళ్లి జరిపించడంతో వదిన అంటే ఏంటి అనేది ఆడపడుచులకు అర్థమై ఆమె గొప్పతనం వారికి అర్థమయ్యే వాళ్ళు ఆమెకి క్షమాపణలు చెప్పారు.
రమ్య వాళ్ళతో ఒకే మాట అంది ఇది నా ఇల్లు నా సంసారం నేను ఇంటికి వెళ్ళాలి అని కాబట్టి ఇవన్నీ నా బాధ్యతగా తీసుకొని చేశాను తప్ప ఇందులో నా స్వార్థం ఏమీ లేదు అంటూ వారిని అత్తారింటికి సాగానంపింది. మరి ఇల్లు ఎలా గడవాలి మామగారు చూస్తేనేమో అలా, అత్తగారికేమో ఏమీ తెలియదు భర్త కూడా ఆపరేషన్ వల్ల మంచం మీద పడ్డాడు.. ఇప్పుడు ఏం చేద్దాం అంటూ అందరూ ఆలోచిస్తున్న సమయంలో రమ్య తన డిగ్రీ సర్టిఫికెట్లతో ఒక చిన్న జాబ్ సంపాదించుకుంది.
ఆ ఉద్యోగంతో రమ్య తన భర్తను అత్తమామల్ని పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ వారికి కావాల్సిన మందులవి అని సమకూర్చు సాగింది. ఒకప్పుడు చీదరించుకున్న అత్తమామలు, భర్త, ఆడపడుచులు ఇప్పుడు రమ్యకి ఎంతో గౌరవం ఇస్తున్నారు ప్రతి విషయాన్ని రమ్యతో చర్చించి గానీ ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. ఇల్లాలు అంటే ఇలా ఉండాలి అని రమ్య అందరికీ ఆదర్శంగా నిలిచింది.
పెళ్లంటే అమ్మాయిలకి సవాలక్ష అనుమానాలు భయాలు ఉంటాయి. అక్కడికి వెళ్లిన తర్వాత వాతావరణం వేరుగా ఉంటుంది. తమ బాధలు చెప్పినా కూడా పెద్దలు సర్దుకుపోమని అంటారు తప్ప ఎవరు వాళ్ళకి సహాయం చేయరు. కాబట్టి అమ్మాయిలు పెళ్లి అనగానే అన్నిటికి సిద్ధపడి ఉండాలి. ఎలాంటి భయాలు లేకుండా వాళ్లు కూడా తన తల్లిదండ్రులు అని అనుకోవాలి అలాగే అబ్బాయి తరఫు వాళ్లు కూడా వాళ్లు కూడా ఒక ఇంటి ఆడపిల్లలే కదా అని ఆలోచించాలి. మన ఆడపిల్ల ఎలాగో వారి ఆడపిల్ల కూడా అలాగే అని ఆడపిల్లకి గౌరవము, స్వేచ్ఛ, స్వతంత్రము ఇవ్వాలి.
అలా ఇవ్వలేకపోబట్టే రమ్య కొన్నాళ్లు బాధపడ్డా కూడా తర్వాత తన సంసారాన్ని తానే సర్దుకుంది.. తన వాళ్లను తానే బాగు చేసుకుంది అనుకోని కష్టాల వల్ల వాళ్లు రమ్య ఆధారపడ్డారు కానీ ఒకవేళ ఇవేవీ జరగకపోతే రమ్య పరిస్థితి ఏమిటి? జీవితాంతం అలాగే వెట్టిచాకిరీ చేస్తూ ఇంట్లో పనిమనిషి బ్రతకాల్సిందేనా…. అని అనుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం లేదు అందుకని అవునని చెప్తారు కొందరు కాదని చెప్పవచ్చు.
కానీ నేను మాత్రం ఒకటే చెప్పదలుచుకున్నాను. పెళ్లయిన ప్రతి అమ్మాయికి కొంచెం స్వేచ్ఛా స్వతంత్రాలు గౌరవం ఇస్తే ఆమెను అర్థం చేసుకుంటే చాలు అనేది నా అభిప్రాయం.
– భవ్య చారు