ఓ వేశ్య

ఓ వేశ్య

 

ఓ వేశ్య సమాజానికి,

నువ్వో రోత ”

కానీ ఎవరికి తెలుసు..?

నీ కడుపు కేక

నీ ఆకలి బాధ

నీ బ్రతుకు ఆట

జానెడు పొట్ట కోసం

మూరెడు మల్లెలు

కొప్పులో పెట్టి,

తెలియని విషాద రంగు

మొఖానికి అందంగా అదిమి’

మెరుపు లాంటి ఎరువు చీర

ఒకటి కట్టి బిగుతూ లాంటి

రవిక ముడి ఒకటి విప్పి

‘తళుక్కుమంటూ

తాజాగా మెరుస్తూ ‘

కలవరంతో కాటుక కనుల-

కన్నీళ్లను ఇంపుగా చేసి

సొంపుగా అందాలను పరిచేస్తూ

చిరునవ్వులు చిందిస్తూ,

విషాదాన్ని గుండెల్లో దాచేస్తూ

ఆనందాన్ని పంచి

విటులకు విందు భోజనంలా

నీ శరీరాని అప్పజెప్పి,

కటిక చీకటి నీ బ్రతుకులో

వెన్నెల వసంతం కురిపించి

కామము పురుష లోకాన్ని

నీ తనువు కన్నీళ్ళ

చల్లదనంతో చల్లార్చి –

అతిధి విటుడికి కామమర్యాద చేసి,

నొప్పులతో పొట్లతో

అలసి తోలసి —

సర్దుకుంటూ మనసులేని,

మట్టిబొమ్మల పగిలిన గాజు బొమ్మల

ఎండిన దేహం జారిన అకృతి సౌష్టంతో

కనులు వాల్చి –

ప్రతి వేకువ ఉదయం

నాది అని ”

భ్రమ పడి తలుస్తూ

కలలతో కన్నీళ్లతో ఆవేదనతో

కునుకు తీసి సేదతీరుతూ నిద్రిస్తున్న

ఓ వేశ్య నువ్వు కాదు వేశ్య

నిన్ను ఇలా వలచిన ఈ సమాజం ఓవేశ్య

నువ్వు ఓ సమాజ సేవకురాలే ”

ఓ వేశ్య నీకు వందనం

ఎందరో కామపు మృగాలా కామం తీర్చి

ఎందరో ఆడపిల్లల మానం పరువు

కాపాడుతునందుకు నీశరీరం( పై..)

బరువు మోస్తునందుకు….🙏🙏

– Saidachary Mandoju

Related Posts

2 Comments

Leave a Reply to Saidachary mandoju Cancel reply

Your email address will not be published. Required fields are marked *