ఓ యోగం

ఓ యోగం

ఓ యోగం

నిన్ను ఆశ్రయిస్తే చాలు వేల వేల లాభాలు చేకూరుస్తావు‌…
నువ్వు తోడుంటే చాలు బంధాలు అలవోకగా బలపడతాయి…
నీ సహచర్యంలో నేర్చుకునే పాఠాలెన్నో….
నిన్ను ఆశ్రయించిన చాలు సమస్యలు పరిష్కారమగును…
సరికొత్త సమస్యలు పుట్టుకురాకుండా….
ఉన్న సమస్యలు అధికం కాకుండా…
ఒత్తిడి నిండిన మనసుకి ఊరటని ఇస్తావు…
ఒంటరితనంలో తోడుగా ఉంటావు…
పదుగురిలో కీర్తిని పెంచి సంతసింపచేస్తావు…
పెద్దలయెడ క్రమశిక్షణని నేర్పుతావు…
పగిలి హృదయ రోధనను భరిస్తావు‌…
ఓదారుస్తూ‌…దిక్సూచిగా నిలబడతావు…
అలిగిన వేళ ఆలుమగల మధ్య చోటుచేసుకుంటావు…
మాటరాక గుండె పగిలిన వేళ నేనున్నానంటావు….
వేదన రోదన కాని రోజున లోలోపల దాగుంటావు…
ఎందరిలో ఉన్నా నిన్నాశ్రయిస్తే చాలు…ఏకాకవుతారు‌…
నువ్వు మాకు దొరికిన ఓ గొప్ప ఆభరణం….
మాకు లభించిన ఓ అదృష్ట యోగం….
నువ్వే లోలోపల దాగిన భావాలకిలా అక్షర రూపాన్నిస్తూ..
ఒంటరైన హృదయానికి ఓదార్పవుతూ తోడైన మౌనానివి….

– ఉమామహేశ్వరి యాళ్ళ

చిలిపి Previous post చిలిపి
మౌనమే మిగిలిందిక.! Next post మౌనమే మిగిలిందిక.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *