ఒక అమ్మాయి కథ

ఒక అమ్మాయి కథ

ఒక అమ్మాయి కథ

భరద్వాజ్ గారు రాసిన ఒక అమ్మాయి కథ. చిన్న వయసులోనే తేజస్విని అనే అమ్మాయికి ప్రకృతి గురించి ఎన్నో విషయాలు చెబుతూ వాళ్ళ నాన్నమ్మ చెప్పే  కథలు చెప్పడం వల్ల ఆ అమ్మాయి కలలో దేవదూత రావడం తేజస్వి, దేవదూత లు కలిసి పక్షులు, చెట్లను బాధలు తెలుసుకొని వాటిని తీర్చడానికి ప్రయత్నించింది తేజస్విని.

తేజస్విని పుట్టినరోజు తను చెట్లు నాటడమే కాక తన స్నేహితులతో మొక్కలు నాటించింది. ఇంట్లో జరుపుకునే పుట్టినరోజులు , పెళ్లిరోజులకు ఇంట్లో వాళ్ళందరూ మొక్కలు నాటితే కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం.

మన పిల్లల కూడా మొక్కలు నాటమని చెప్పాలి.ప్లాస్టిక్ కవర్లు వాడకుండా  బట్టతో కుట్టిన బ్యాగులు వాడడం వల్ల ప్లాస్టిక్ కవర్లు వాడకం తగ్గించవచ్చు. వాళ్ళ తాతయ్య ప్రకృతి గురించి చెప్పిన విషయాలు వాళ్ళ నాన్నమ్మ చెప్పిన కథలు.

తేజస్విని కలలో వచ్చిన విషయానికి తను గ్రహించి చెట్లు బందీ అయిన పక్షులు బాధపడుతున్న తీరు చూసి తను నిజజీవితంలో పక్షులను స్వేచ్ఛగా వదిలేసింది.

పుట్టినరోజు నాడు మొక్కలు నాటింది. తనే కాకుండా అందరికీ చాటి చెప్తుంది. ఈ బాధ్యత ఆ అమ్మాయి ఒక్కదాన్నే కాదు మన అందరిదీ కూడా.

అది తెలుసుకొని మనం కూడా చెట్లు ఎందుకు నరికేస్తున్నామో , చెట్లు మళ్లీ పెంచడం వల్ల కాలుష్యం తగ్గుతుందని తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది.

ఒక కల వల్ల తేజస్విని కలెక్టర్ అయ్యి ఒక ఊరిని మార్చింది. అదే మనం మారితే దేశమే మారుతుంది. మొక్కలను నాటి బాధ్యతగా పెంచితే కాలుష్యం తగ్గే అవకాశాలు ఉన్నాయి.

భరద్వాజ్ గారు ఈ కథలో చెప్పినట్టుగా మనం కూడా ప్రయత్నిస్తే ఇంకా బాగుంటుంది.

నేను ఈ కథ చదువుతూ ఉంటే నాకు ఈ ప్రయత్నం నేను చేయాలి అనుకుంటున్నాను.
చాలా బాగా రాశారు భరద్వాజ్ గారు…

 

సమీక్షకులు :⁠- మాధవి కాళ్ల

తేజస్విని కథా సమీక్ష Previous post తేజస్విని కథా సమీక్ష
విశ్వశాంతి Next post విశ్వశాంతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close