ఒక చీకటి రాత్రి పార్ట్ 2

ఒక చీకటి రాత్రి పార్ట్ 2

ఒక చీకటి రాత్రి పార్ట్ 2

అయినా చేతన్ తలుపులు తీసే పని మానుకోలేదు, అలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు కాని తలుపులు ఎంతకీ తెరుచుకోవడం లేదు. ఇంతలో ఆ ఆకారం చేతన్ వైపు నడక సాగిస్తూ వస్తుంది.

చేతన్ తలుపులు తెరవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ తలుపులు ఎంత తీసిన రావడం లేదు దాంతో ఇక విసుగు వచ్చి మళ్ళీ చేతన్ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.

వెనక్కి తిరిగిన ఆకారం తలుపుల దగ్గరికి వచ్చి నిలిచింది. చేతన్ కి అర్థమైపోయింది అది తనని వదలదు అని. దాంతో, ఫోన్ తీసి చార్జింగ్ పెట్టాలి అని అనుకున్నాడు.

కానీ చార్జర్ తీసుకు రాలేదు అని గుర్తుకు వచ్చి ఫోన్ టేబుల్ మీద పెట్టాడు తనని తాను తిట్టుకుంటూ కనీసం రూమ్ లో అయినా ఏవైనా చార్జర్ లు ఉన్నాయేమోనని ఒకసారి చుట్టూ చూడాలని అనుకున్నాడు. కానీ భయం వల్ల తల ఎత్త లేకపోయాడు.

కుర్చీలో కూర్చుని తల కిందికి వేసుకుని అలాగే కూర్చున్నాడు. ఇంకా ఎంత సేపు అలా ఉండాలో అర్థం కాలేదు ఓ వైపు మెడ నొప్పి అవుతుంది. ఆ ఆకారం మాత్రం తలుపుల దగ్గర నుంచి కదలడం లేదు.

ఏం చేయాలి అని అర్థం కాలేదు చేతన్ కి. అలా ఎంతసేపు కుర్చీలో కూర్చో వాలో అని అనుకుంటూ టేబుల్ పై ఉన్న ఫోన్ తీసుకొని దాన్ని అటు ఇటు తిప్పుతూ కూర్చుండిపోయాడు.

ఇంతలో ఆకారం మళ్లీ కిచెన్ వైపు అడుగులు వేసింది. దాంతో చేతన్ గబుక్కున బెడ్ పైకి వచ్చాడు. కనీసం కప్పుకొని పడుకుందామని అనుకుంటూ….

చేతన్ బెడ్ పైకి రావడంతో ఆ ఆకారం బెడ్ దగ్గరగా వచ్చి చేతన్ పక్కనే కూర్చుంది. దాంతో వెన్నులోంచి వణుకు పుట్టి కాళ్లు చేతులు మనసంత వణికిపోతున్నాడు చేతన్. అయినా కప్పు తీయకుండా అలాగే పడుకున్నాడు.

లేచి కనీసం బయటకు వెళ్లాలన్నా తలుపు రావడం లేదు. ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఎవరైనా వస్తే బాగుండు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు.

కానీ ఈ టైం లో ఎవరు వస్తారు? ఎవరూ రారు. కిందికి వెళ్లి ఎవరినైనా పిలవాలన్నా కూడా ఈ సమయంలో ఎవరు మాత్రం వస్తారు.

అనవసరంగా ఈ రూమ్ లోకి వచ్చాను. మా ఇంట్లో ఉన్నా బాగుండు నా టైం బాగాలేదు ఈ రోజు ఈ దయ్యానికి నేను బలి అవ్వాల్సిందే అయినా ఇది ఏంటి ఒక మాట, పలుకు లేకుండా నా వెనక పడింది.

అసలు ఇది నిజమేనా లేదంటే నా ఊహా? అయినా ఊహైతే ఆకారం ఎందుకు కనిపించాలి? ఎందుకు నడవాలి? అటు ఇటు నడుస్తుంది కానీ ఏమి అనడం లేదు. ఇదేంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను నన్ను అది ఏమైనా చేయాలని కోరుకుంటున్నాన్నా .

వామ్మో వద్దు వద్దు అది నన్ను ఏం చేయకూడదు భగవంతుడా దేవుడా అయ్యో ఏమైనా దేవుని మంత్రాలు అయినా చదువుకుందాం అంటే నాకు రావే….

ఇప్పుడు ఎలా ఏం చేయాలి? బయటకు వెళ్లాలన్నా తలుపులు రావడం లేదు ఇక నా పని అవుట్ మా అమ్మ నాన్న చెల్లి అందరూ రేపొద్దున నన్ను చూసి ఏడుస్తారు ఏమో వాళ్లకు ఎలా తెలుస్తుంది.

నా ఫ్రెండ్స్ ఇద్దరు ఊరికి వెళ్ళారు వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. నేను ఈ గది లో ఉన్నట్టు కూడా ఎవరికీ తెలియదు ఒకవేళ నేను చనిపోతే ఎవరు వచ్చి చూస్తారు? నందు గాడు ఎప్పుడు వస్తాడు? నా ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తారు?

మా ఊరి నుంచి వచ్చేసరికి నేను చనిపోయి కుళ్ళి పోయి ఉంటానేమో, నేను చనిపోయిన విషయం ఎవరికీ తెలియదు. నా స్నేహితులు వచ్చేవరకు ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా తలుపు లోపలి నుంచి గడియ పెట్టాను.

కాబట్టి తలుపులు పగలగొడతారేమో, అప్పుడు వాళ్లు నా శవాన్ని చూసి బాధపడతారు అసహ్యించుకుంటారు కావచ్చు, అమ్మో అందరూ నా శవాన్ని చూసి నేను ఆత్మహత్య చేసుకున్నాను అనుకుంటారేమో అవును అంతే అనుకుంటారు.

ఎందుకంటే బ్యాక్ లాక్స్ ఉన్నాయి కాబట్టి పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాను అనుకుంటారు. కానీ ఒక దయ్యం చంపేసిందని ఎవరికి తెలియదు. లేదు అలా కాదు నన్ను దయ్యం చంపేసిందని అందరికీ తెలియాలి అంటే నేను సూసైడ్ నాట్ రాయాలి అవును ఖచ్చితంగా అది రాస్తేనే అందరికీ తెలుస్తుంది.

అవును అంతే నేను సూసైడ్ నోట్ రాస్తాను. అని అనుకుంటూ మెల్లిగా కప్పు తీసి చూశాడు కానీ మళ్లీ గబుక్కున మళ్ళి దుప్పటి కప్పుకున్నాడు. తన పరువు ముందే తననే చూస్తూ ఆ ఆకారం అలాగే కూర్చొని ఉంది.

వామ్మో ఏంటిది నన్నే చూస్తుంది. నా చావు తప్పదు నేను ఇలా చావాల్సిందే కనీసం సూసైడ్ నోట్ కూడా నేను రాయలేను వామ్మో భగవంతుడ నన్ను కాపాడే వారు ఎవరూ లేరా….

అయ్యో భగవాన్ కావాలని వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను. ఛీ నా బతుకు. ఇంత బతుకు బతికి ఒక దెయ్యం చేతిలో చావాలా…. అయ్యో నా కోరికలు ఆశలు ఇంకా తీరలేదే మంచి ఉద్యోగం చేసుకోవాలనుకున్నాను లవ్ చేసి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను.

ఇద్దరు పిల్లలతో హాయిగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఒక సొంత ఇల్లు తీసుకొని అందులో సంతోషంగా గడపాలని అనుకున్నాను ఒక మంచి బైక్ కొనుక్కోవాలి అనుకున్నాను. అమెరికా వెళ్ళాలని అనుకున్నాను.

అమ్మ నాన్నను బాగా చూసుకోవాలి అనుకున్నాను. చెల్లెలి పెళ్లి చేయాలని అనుకున్నాను అయినా ఇవన్నీ అనుకున్నవన్నీ జరగవు, అనుకోని వన్నీ జరుగుతాయి అంటే ఇదేనేమో… అందుకే ఆ పాటలు రాసారేమో. దేవుడా నన్ను కాపాడు నేను ఎన్నిరోజులు దేవుని నమ్మలేదు.

కానీ ఇప్పుడు దేవుని నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది దేవుడా నన్ను కాపాడు… దేవుడా, నువ్వు నన్ను కాపాడితే నేను చిలుకూరులో 108 ప్రదక్షిణాలు చేస్తాను. పెద్దమ్మ గుడి లో బోనమెత్తుతాను. ఎల్లమ్మకు మేకపోతును బలి ఇస్తాను. కాపాడు దేవుడా అని అనుకుంటూ ఈరోజు ఇక నా పని అయిపోయింది అని అనుకున్నాడు.

పోనీ ఇలా అడగనా, అసలు నువ్వు ఎవరు? ఏం చేస్తావ్? ఎందుకు ఇలా వచ్చావ్? అని అడగాలన్నా కూడా గొంతు పెగలడం లేదు భయంతో. ప్యాంటు తడిసింది ఏమో అని సమానంగా కూడా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అయ్యో భగవంతుడా అని అనుకుంటూ నిండా దుప్పటి కప్పుకొని వణికిపోతూ ఉన్నాడు.

మెల్లిగా కప్పు తీసి ఓకే కన్నుతో చూశాడు అది అక్కడే కూర్చుంది తననే చూస్తూ, ఆ ఆకారం తనని చూస్తుంది ఇదేంటి ఏమీ మాట్లాడకుండా ఏమీ అడగకుండా ఎందుకిలా చూస్తోంది మాటలు రావా? మూగ దయ్యమా? కనీసం నేను అడగాలా అనుకున్న కూడా నా గొంతు పెగలడం లేదు గొంతు తడారిపోతుంది దాహంగా ఉంది.

లేచి నీళ్లు తాగాలన్న కూడా భయమేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ అలాగే నిండా కప్పుకుని మనసులోనే మాట్లాడుకుంటున్నాడు చేతన్.

నేను మా అమ్మానాన్నలను పదేపదే చాలా విసిగించను. బైక్ కొని ఇవ్వమని, డబ్బులు ఇవ్వమని ఎన్నోసార్లు వాళ్ళని కష్ట పెట్టాను. పాపం అమ్మ తను దాచుకున్న డబ్బులు కూడా ఇచ్చేది నా పాకెట్ మనీ కోసం.

మరి నాన్న ఏమైనా తక్కువ, ఏది కావాలో అడగకముందే అన్ని సమకూర్చి పెట్టేవారు. అయినా కూడా నాకు ఎప్పుడూ అశాంతి గానే ఉండేది. ఫ్రెండ్స్ దగ్గర ఉన్న బైకులు, ఫోన్ లాంటివి కొనివ్వమని చాలా సార్లు అడిగాను.

దాని కోసం నాన్నగారు ఎన్ని అప్పులు చేశారు, పాపం చెల్లి కూడా తనకు ఇచ్చిన పాకెట్ మనీ కూడా నాకే ఇచ్చేది. అలాగే నేను దొంగతనంగా సిగరెట్లు తాగుతున్న అనే విషయం కూడా ఇప్పటికీ అమ్మానాన్నలకి చెప్పకుండా ఉంది.

నా కోసం ఇన్ని త్యాగాలు చేసిన అమ్మానాన్నలను, చెల్లిని బాగా చూసుకోకుండా ఏదైనా కొనివ్వకపోతే చస్తాను అంటూ బెదిరించే వాడిని.

అప్పటికీ అమ్మ అలా అనకు రా, కోరికలు తీరకపోతే దెయ్యాలు అవుతారు అంటూ భయపెట్టినా కూడా అమ్మ కు ఎదురు చెప్పే వాడిని.

సమయం సందర్భం లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని నాన్నగారు ఎంత చెప్పినా అలాంటి మాటలు మాట్లాడి నేను అనుకున్నది సాధించుకునే వాడిని. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది.

ఇలా కోరికలు తీరకుండా చనిపోయి దయ్యాలు అవుతే ఎవరితోనూ మాట్లాడలేము, ఏది ముట్టుకోలేము, ఏది తినలేము అప్పుడు బైకులు ఫోన్లు ఏవీ ఉండవు.

చస్తాను అనే మాట కూడా అసలు మాట్లాడకూడదు అంటారు. పైన తథాస్తు దేవతలు ఉండి తధాస్తు అంటే ఆ మాటలు నిజమవుతాయని అంటారు పెద్దలు. అమ్మో అసలు సూసైడ్ చేసుకోకూడదు.

ఆత్మహత్య మహాపాపం అని కూడా అంటారు. అలా అలా చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకుంటే ఇదిగో ఇలాంటి దెయ్యాలే అవుతారు.

తాము ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాను తమకు కూడా తెలియని స్థితిలో చనిపోయిన వారు ఇలా మాట పలుకు లేకుండా ఏం అడగాలో తెలియక ఎలాంటి కోరికలు కొరలో అర్థం కాక, అసలు తమ కోరికలు ఏంటో కూడా తమకు తెలియని స్థితిలో ఇలా వచ్చి కూర్చుంటాయని చిన్నప్పుడు నాన్నమ్మ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమై అని అనిపిస్తుంది.

అమ్మో నేను ఇంకెప్పుడూ సూసైడ్ చేసుకుంటా అని అనుకో అనను. ఇంకెప్పుడూ అమ్మానాన్నను, చెల్లిని కష్ట పెట్టను. ఈ గండం నుంచి బయటపడితే చాలు ఇంకెవరిని ఏమీ అనకుండా బాగా చదువుకొని పరీక్షల్లో పాస్ అయ్యి ఉద్యోగం తెచ్చుకుని అమ్మానాన్న, చెల్లిని బాగా చూసుకుంటాను. అవును దేవుడా నన్ను రక్షించు

నాకు ఈ గండం తప్పితే హృదయం వెళ్ళిపోతే బ్రతుకుజీవుడా అనుకుంటూ నేను ఇక్కడి నుంచి వెళ్లిపోయి ఇక ఇప్పటి నుంచి మంచిగా ఉంటాను అని అనుకుంటూ దుప్పటి ఇంకా గట్టిగా బిగించేసాడు.

కానీ ఇంతలో దుప్పటి లాగసాగింది ఆకారం. ఇంకా గట్టిగా బిగించాడు. అయినా గట్టిగా లాగుతుంది ఏదో శబ్దం చేస్తోంది. ఇంకా గట్టిగా బిగించాడు. లే…. లే… లే… అంటున్న శబ్దం వినిపించింది చేతనకి.

వామ్మో ఇది, ఇది నన్ను లేవమని అంటుంది ఏంటి అని భయపడ్డాడు చేతన్. లే….. లే….. లే…. అన్న శబ్దం ఇంకా గట్టిగా వినిపించ సాగింది.

ఇంతకీ ఆ దయ్యం ఎవరు? చెతన్ ని ఎందుకు లేపుతుంది? చేతన్ ని ఎం చెయ్యాలని అనుకుంటుంది. చేతన్ బ్రతికి బయట పడతాడా? అసలు ఎం జరగబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు ఆగాల్సిందే…

 

అద్భుతమైన వరం బ్రహ్మముహూర్తం Previous post అద్భుతమైన వరం బ్రహ్మముహూర్తం
గొప్ప "జీవిత సత్యం" Next post వివేకానందుడు చెప్పిన గొప్ప “జీవిత సత్యం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close