ఒక చీకటి రాత్రి పార్ట్ 4

ఒక చీకటి రాత్రి పార్ట్ 4

చేతన్ బిటెక్ చదివే అబ్బాయి. చదువుకోడానికి స్నేహితుల రూమ్ లోకి వెళ్ళిన అతనికి ఒక ఆత్మ కనిపిస్తుంది. దాంతో అతను చాలా భయపడతాడు కానీ స్నేహితులు మాత్రం ఆత్మ ఏమీ చేయదు చాలా మంచిది అని చెప్తారు. స్నేహితుల ద్వారా ఆత్మ గురించి కొన్ని నిజాలు తెలుసుకొని అతను ఆత్మ తో మాట్లాడాలి అనుకుంటాడు కానీ ఇంతలోనే అతని స్నేహితులు ఆ గదిని ఖాళీ చేస్తారు.

ఆ విషయం తెలియని చేతన్ ఆ గది దగ్గరికి వస్తాడు వాళ్లు ఖాళీ చేశారు అని తెలుస్తోంది. చేతన్ బాధపడుతున్న సమయంలో అక్కడికి ఆత్మ వచ్చి మాట్లాడుతుంది. తన కథ మొత్తం అతనికి చెప్తుంది ఆ తర్వాత ఆత్మ కోరిక ప్రకారం గా చేతన్ పుస్తకాలను వేస్తాడు అప్పుడు ఆత్మ చాలా సంతోషిస్తుంది.

అయితే చేతన్ ఇంకా తన గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు అప్పుడు ఆత్మ తన పేరు అమరేంద్ర అని చెప్తుంది. అమరేంద్ర ఎవరు అతనికి అతనికి సంబంధం ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

చేతన్ అతని పేరు అడగగానే నా పేరు అమరేంద్ర అని వినిపించింది. అవునా ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది అంటూ ఆలోచనలో పడ్డాడు చేతన్. ఆలోచించకు చేతన్ నువ్వు నా పేరు వినే ఉంటావు ఎందుకంటే మీ పెద్దమ్మ కొడుకు పేరు కూడా అమరేంద్ర.

ఆ మాట వినగానే చేతన్ అవును మా పెద్దమ్మ పేరు కొడుకు పేరు కూడా అమరేంద్ర అ అవును మీకు ఎలా తెలుసు అంటూ అడిగాడు చేతన్ గాల్లో వినిపిస్తున్న అమరేంద్ర ఆత్మని ఎక్కడుందో తెలియక చుట్టూ చూస్తూ….

నాకు అన్నీ తెలుసు చేతన్ అందరి పేర్లు అందరు విషయాలు తెలుసు అని బదులిచ్చింది అమరేంద్ర ఆత్మ. అవునా ఎలా తెలుసు అన్నాడు చేతన్. ఎందుకంటే నేను కూడా మీ కుటుంబంలో ఒక సభ్యుడిని,.

అవునా ఎలా ఎలా అయినా మీరు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు నాతోనే పుస్తకాలు ఎందుకు ముద్రించారు. ఎవరికీ కనిపించని మీరు నాకు ఎందుకు వినిపిస్తున్నారు? అంటూ తన మనసులో ఉన్న అనుమానాలు బయటపెట్టాడు చేతన్.

ఎందుకంటే చెప్పాను కదా నేను కూడా మీ కుటుంబ సభ్యుడినే అన్నది ఆ కంఠం. మీరు చెప్పేది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు ముందు అది ఏంటి చెప్పండి సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను అంటూ అడిగాడు చేతన్ బతిమాలుతున్న ధోరణిలో….

నేను నీకు అన్ని వివరంగా చెప్పాలి అంటే ముందు నువ్వు ఇక్కడ నుంచి మీ పెద్దమ్మ ఇంటికి వెళ్ళు నీతో పాటు నేను కూడా వస్తాను ఇద్దరం వెళ్దాం పద అంది ఆత్మ. ఇప్పటికిప్పుడు పెద్దమ్మ ఇంటికి ఎందుకు అన్నాడు చేతన్ లేదు వెళ్లాల్సిందే….

నీకు అన్నీ తెలియాలంటే మనం ఇద్దరం మీ పెద్దమ్మ ఇంటికి వెళ్దాం పద అంటూ కంఠం ఆగిపోయింది.. అమరేంద్ర గారు అమరేంద్ర గారు అంటూ పిలిచాడు చేతన్ ఎలాంటి శబ్దమూ వినిపించలేదు.

అయ్యో మీరు మాట్లాడకపోతే ఎలా సరే సరే మీరు చెప్పినట్టే చేద్దాం ఇంటికి వెళ్దాం. కానీ నేను మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి అన్నాడు. మళ్లీ చల్లని గాలి వీచింది.

ఈసారి ఆత్మ, ఈరోజు మీ పెద్దమ్మ పుట్టినరోజు వెళ్తున్న అని చెప్పు అన్నాడు అమరేంద్ర. అమ్మ బాబోయ్ మా పెద్దమ్మ పుట్టినరోజు నాకే గుర్తులేదు నీకు ఎలా గుర్తుంది అన్నాడు చేతన్. చెప్పాను కదా నేను మీ కుటుంబ సభ్యుడిని అని నాకు అన్నీ తెలుసు అంది అమరేంద్ర ఆత్మ.

ఏంటయ్యా మొత్తం ఫుల్ కన్ఫ్యూజన్ గా ఉంది నాకు అసలు విషయం ఏంటి అని అనగానే మీ పెద్దమ్మ ఇంటికి వెళితే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి పద వెళ్దాం ముందు.

మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు అంది అమరేంద్ర ఆత్మ. సరే చేస్తా అంటూ తల్లికి ఫోన్ కలిపి తల్లి ఫోన్ ఎత్తగానే అమ్మ నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అన్నాడు హడావిడిగా

ఇప్పుడు ఎందుకురా అంటూ అడిగింది తల్లి. అమ్మ మర్చిపోయావా? ఈరోజు పెద్దమ్మ పుట్టిన రోజు నేను వెళ్తున్నా అని అన్నాడు సరే కానీ జాగ్రత్త ఏమైనా డబ్బు కావాలా అంది తల్లి.

వద్దులేమ్మా నా దగ్గర ఉన్నాయి సరిపోతాయి మళ్లీ సాయంత్రం వరకు వచ్చేస్తాను అన్నాడు చేతన్ సాయంత్రం వరకు కాదులే మేము కూడా బయలుదేరి వచ్చేస్తాం అందరం కలిసి రేపు పొద్దున వచ్చేద్దాం నువ్వు పెద్దమ్మకు ఏమి చెప్పకు నేను సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నా అంది తల్లి పద్మ.

అవునా సరే అమ్మ నేను ఇప్పుడే వెళ్తున్నా అంటూ ఫోన్ కట్ చేశాడు. ఎలా వెళ్దాం అంటూ చుట్టూ చూస్తూ అడిగాడు. దగ్గరే కదా బైక్ పై వెళ్దాం అన్నాడు అమరేంద్ర సరే అంటూ బైక్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు…

బైక్ ముందుకు వెళ్తున్న అంతసేపు చల్లని గాలి చేతన్ వెంటే ఉంది. దాదాపు రెండు గంటలు అవుతుండగా చేతన పెద్దమ్మ ఇంటిని చేరుకున్నాడు.

**********

చేతన్ బైక్ దిగి తలుపులు కొట్టాలి అనుకునేంతలో ఆగు చేతన్ అన్నాడు అమరేంద్ర. టక్కున అగిన చేతన్ ఏమైంది అండి అంటూ అడిగాడు. ఏమీ కాలేదు ఒక్క నిమిషం నేను మీ శరీరంలోకి రాబోతున్నా నీకు ఏదో లా అనిపించినా నువ్వేం భయపడకు అన్నాడు అమరేంద్ర.

హేయ్ నిజమా ఇలా ఆత్మ శరీరం లోకి రావడం సినిమాల్లో నేను చూశాను నిజంగా ఇప్పుడు నువ్వు నా లోకి వస్తావా? నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఆత్మ శరీరం లోకి వస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అని నాకు చూడాలని ఉంది.

సినిమాల్లో అయితే ఆత్మ దూరగానే కుంభాలు కుంభాలు తినడం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం చేస్తారు. మరి నువ్వు కూడా నా శరీరం లోకి వస్తే అలాగే చేస్తావా? అన్నాడు చేతన్ ఉత్సాహంగా ..

హ హ హ అంటూ నవ్వింది అమరేంద్ర ఆత్మ. చేతన్ సినిమాల్లో చూపించినట్లుగా అంత ఉండదు. అది సినిమా ఇది జీవితం. సినిమాల్లో చూపించినట్లు నేను కుంభాలు కుంభాలు తినడం కానీ పిచ్చిగా ప్రవర్తించడం కానీ ఉండదు.

అయినా ఇప్పుడు చూస్తావు కదా ఒక పని చెయ్ నేను నీ శరీరం లోకి దూరినప్పుడు నేనేం చేస్తాను అనేది నువ్వు వీడియో తీస్తూ ఉండు నీ ఫోన్లో అన్నాడు అమరేంద్ర. అరే ఈ ఐడియా ఏదో బావుంది అంటూ తన ఫోన్ తీసి వీడియో ఆన్ చేశాడు.

ఇప్పుడు నా శరీరం లోకి రండి అన్నాడు ఆత్మతో చుట్టూ చూస్తూ. నేను ఆల్రెడీ నీ శరీరం లోనే ఉన్నాను. నీకు వినిపించడం లేదా. నేను నీ శరీరంలోకి వచ్చాను అని అనడానికి ఒకటే ఒక గుర్తు అదేంటంటే రెండు గొంతులు గా వినిపిస్తాయి అన్నాడు.

అవును నేను వీడియో తీసుకున్న కదా అంటూ రెండు గొంతులు వినిపించాయి. కాసేపు నువ్వు మాట్లాడకు చేతన్ అంది అమరేంద్ర ఆత్మ. హా సరే సరే అన్నాడు చేతన్ అవి రెండు గొంతులు వినిపించాయి.

చేతన్ శరీరంలోకి వెళ్లిన అమరేంద్ర ఆత్మ కిరణ్ కిరణ్ అంటూ పిలిచింది. ఆ మాటలు ప్రతిధ్వనించాయి ఆ ఇంట్లో. లోపల బెడ్ రూమ్ లో నిద్ర పోతున్న కిరణ్మయి ఉలిక్కి పది లేచింది.

కళ్ళు నులుముకుంటూ తనను కిరణ్ అని పిలిచారా ఎవరు పిలిచారు. అంత ధైర్యం ఎవరికీ ఉంటుంది. తనను అలా పిలిచే వారు ఒక్కరే వాళ్ళు కూడా చనిపోయారు.

ఇన్నాళ్లకు ఇప్పుడు అలా తనను పిలిచే ధైర్యం అసలు ఆ పేరు ఎవరు పిలుస్తారు. ఎవరికీ తెలుసు అది అని కొంచం భయం తో, కొంచం ఆసక్తి తో లేచి బయటకు వచ్చింది. బయట మళ్లీ కిరణ్ అంటూ వినిపించింది.

గుండెలు గుభగుభలాడుతూ ఉండగా అదిరే పెదవులతో, వణికే చేతులతో, భయపడుతూ తలుపులు తెరిచి చూసింది. అక్కడ చేతన్ నిలబడి ఉన్నాడు.

అది చూసి వీడికి ఆ పేరెలా తెలిసింది? అంటే నన్ను భయపెట్టడానికి ఇలా పిలిచాడా లేదా పద్మ నా గురించి అంతా చెప్పేసిందా అని అనుకుంటూ, అలాగే చేతన్ నీ చూస్తూ నిలబడి పోయింది.

కిరణ్ ఎలా ఉన్నావు బాగున్నావా అంటూ చేతన్ అడిగేసరికి ఇంకా బిత్తర పోయింది. చేతన్ తనని కిరణ్ అని పిలుస్తున్నాడు. కానీ, అది చేతన్ గొంతు కాదు. చేతను గొంతులో ఇంకేదో గొంతు వినిపిస్తుంది ఎందుకిలా వినిపిస్తోంది?

పైగా నన్ను పేరు పెట్టి పిలుస్తూ బాగున్నావా అని అడుగుతున్నాడు ఏమిటీ వింత? పద్మ నా గురించి చెప్పేసి ఉంటుందా లేదా వీడే తెలుసుకుని ఉంటాడా రకరకాల ఆలోచనలు ఒకే సారి కమ్ముకు పోగా, అలాగే నిలబడిపోయింది.

ఏంటి కిరణ్ బాగున్నావా అని అడిగితే ఒక్క మాట కూడా రావడం లేదు. అప్పుడే నన్ను మర్చిపోయావా అంటూ అడిగాడు. వెంటనే ఆ గొంతును గుర్తు పట్టిన కిరణ్మయి. నువ్వు నువ్వు చేతన్ కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ అంటూ అడిగింది.

కాదు కిరణ్ అతను చేతన్ కాదు నేను నీ అమరేంద్రను నన్ను ప్రేమించి నువ్వు మోసం చేశావు కదా నీ ద్వారా మోసపోయిన అమరేంద్రను నేను అంటూ పలికాడు. చేతన్ చేతిలో ఉన్న ఫోను తన పని తాను చేసుకుంటూ పోతుంది.

రేయ్ చైతన్ పిచ్చిపిచ్చిగా ఉందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ ఏం మాట్లాడుతున్నావ్? నీకు అసలు అర్థం అవుతుందా? ఏంటి అమరేంద్ర ఎవరు? అంటూ కాస్త కోపంగా అంది కిరణ్మయి.

లేదు కిరణ్ అతనినేమీ అనకు అతనిలో నేను ఉన్నాను నువ్వు కొంచెం సృహా లోకి వచ్చి మాట్లాడు. నేను నీతో మాట్లాడాలని అసలు జరిగింది ఏంటో తెలుసుకోవాలని వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాను అన్నాడు అమరేంద్ర.

కిరణ్మయి ఆ మాటలు వింటూనే బిత్తరపోయి ఏంటి నువ్వు అమరేంద్రవా? జోకులు వేస్తున్నావా? అయినా నేను ఎలా నమ్మాలి అన్ని విషయాలు తెలుసుకొని ఇలా మాట్లాడడం నీకు మంచిది కాదు చేతన్.

మీ అమ్మ నీకు అన్ని విషయాలు చెప్పే ఉంటుంది అందుకే ఇలా నన్ను ఆట పట్టించడానికి మాట్లాడుతున్నావా అంది కిరణ్మయి. అది కాదు నేను చెప్పేది విను ఇందులో చేతన్ తప్పేమీ లేదు అతనికి ఏమీ తెలియదు ఇప్పుడు మన ద్వారా తెలియబోతోంది.

అతని తల్లికి కూడా ఏమీ తెలియదు. నేనే అతన్ని ఆవహించాను. ఇప్పుడు అతని లో ఉన్నాను. నేను ఆత్మగా మారాను నన్ను నమ్ము అన్నాడు అమరేంద్ర.

ఏంటి నిజమా నువ్వు ఆత్మగా మారావా? ఇన్ని రోజుల తర్వాత ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నా కోసం వెతుక్కుంటూ వచ్చావా. ఇది నిజమేనా నమ్మాల్సిందేనా అంటూ అడిగింది కిరణ్మయి.

అవును నిజమే కిరణ్ ఇలా నిన్ను పిలిచే ధైర్యం చేయటానికి చేతన్ కి ఉంది అంటావా ఒక్కసారి ఆలోచించి చూడు. అసలు మన విషయాలు ఎవరికీ తెలియదు. ఇప్పుడు అసలు నిజం ఏమిటో తెలుసుకోవాలని అందరికీ చెప్పాలి అనే నేను కూడా చేతన్ తో వచ్చాను అని అనగానే…

ఏమో నాకు ఏమీ అర్థం కావడం లేదు సరే ముందు అయితే లోపలికి రండి అని పిలిచింది. చేతన్ లో ఉన్న అమరేంద్ర ఆత్మ లోనికి వచ్చింది చుట్టూ చూస్తూ మీ ఆయన బాగానే సంపాదిస్తున్నాడు అన్నాడు. ఆ అవును బాగానే సంపాదించాడు అందుకే హఠాత్తుగా పోయాడు అంది కిరణ్మయి కొంచెం బాధగా….

అయ్యో అవునా ఎందుకు ఏమైంది అంటూ అడిగాడు. తన ఉద్యోగంలో లంచాలు తీసుకున్నాడని అరెస్టు చేశారు. అందువల్ల బయట వారికి మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకున్నారు అంది కళ్ళు తుడుచుకుంటూ… నన్నే కాక ఇంకా అందర్నీ కూడా మోసం చేశారా మీరు ఇద్దరు కలిసి అన్నాడు నిష్టూరంగా అమరేంద్ర.

ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ అమరేంద్ర నిన్ను మోసం చేశారా ఎవరు మోసం చేశారు అంది కిరణ్మయి. ఎవరు అంటావ్ ఏంటి నువ్వే నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నాతో తిరిగి చివరికి నన్ను కాదని మోసం చేసి వెళ్లి పోయావు.

అదే అంటున్న నన్ను ఎలా మోసం చేయాలనిపించింది. అంత ప్రేమించిన నిన్ను మర్చిపోలేక నేను ఎంత బాధ అనుభవించాను నాకు మాత్రమే తెలుసు అన్ని అమరేంద్ర ఆత్మ. లేదు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావ్ అమరేంద్ర.

అసలు నిన్ను మోసం చేయాలని అనుకోలేదు నీతో నా జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నాను. నిన్ను మనసా వాచా ప్రేమించాను. నీతోనే ఎల్లకాలం ఉండాలని అనుకున్నాను అందుకే మా పెద్ద వాళ్లను కూడా నేను ఒప్పించాను కానీ జరిగింది వేరు అంది కిరణ్మయి.

హ హ హా ఏంటి నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించవా? నాతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నావా? ఆ మాటలు ఇప్పుడు చెప్తున్నావా అవన్నీ నేను నమ్మాలా. కథలు బాగానే చెప్తున్నావు అన్నాడు అమరేంద్ర.

కథలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అసలు అప్పుడు ఏం జరిగిందంటే అంటూ గతంలో కి వెళ్ళింది కిరణ్మయి.

కిరణ్మయి చెప్పే కథని అమరేంద్ర వింటాడా? అసలు ఎం అవుతుంది? అమరేంద్ర ఎం చెయ్యబోతున్నాడు? తనని మోసం చేశారని పగ తీర్చుకుంటాడా? అసలు ఎం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు ఆగాల్సిందే….

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *