ఒక చీకటి రాత్రి పార్ట్ 6

ఒక చీకటి రాత్రి పార్ట్ 6

ఒక చీకటి రాత్రి పార్ట్ 6

అనుకున్నట్టుగానే తెల్లారి బాలయ్య అతని భార్య లక్ష్మి బావమరిది వెంకటేశంతో కలిసి అమరేంద్ర తల్లిదండ్రులు కలవడానికి ఇంటికి వెళ్ళాడు. అయితే అనుకున్నట్టుగా అమరేంద్ర తల్లిదండ్రులు వాళ్లని ఆహ్వానించలేదు.

అమరేంద్ర ఇంటికి వెళ్లి తలుపు తట్టారు ముగ్గురు. తలుపు తీసిన అమరేంద్ర తండ్రి చలపతి ఎవరు మీరు అని ప్రశ్నార్ధకంగా అడిగాడు. అయ్యా నా పేరు బాలయ్య ఈ ఊర్లో కిరాణాకొట్టు నడుపుతున్నాను.

ఊర్లో అతిపెద్ద కొట్టు మాదే. మీతో కొంచెం మాట్లాడాలి అని వచ్చాను అంటూ అడిగాడు. కిరాణా కొట్టు వాడికి మాతో ఏం పని ఎందుకు మమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నావు అన్నాడు గంభీరంగా చలపతి.

మీతో కొంచం మాట్లాడాలి అందుకే కలవాలని అనుకుంటున్నాను అన్నాడు బాలయ్య. నాతో మీకేం పని అని అడిగాడు చలపతి. అతని మాటలు బాలయ్యకు అంతగా నచ్చలేదు. అయినా కూతురు కోరుకుంది కాబట్టి మాట్లాడక తప్పదు అనుకుంటూ.

అయ్యా మా అమ్మాయి గురించి మీతో కొంచెం మాట్లాడాలి. దయచేసి కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు కొంచెం అభ్యర్థన గా బాలయ్య. ఏమిటి మీ అమ్మాయి గురించి మాతో మాట్లాడతారా ఏంటి మీ అమ్మాయికి ఏమైనా సహాయం చేయాలా?

అలాంటి సహాయాలు కావాలంటే మా అమరేంద్ర కలెక్టర్ అయ్యాక చేస్తాము ఇప్పుడేం లేదు. ఒకవేళ మీ అమ్మాయి పెళ్లి గురించి అయితే అది కూడా అప్పుడే మేము అసలే జమిందార్లం మా కీర్తి నలుదిక్కుల చాటడానికి ఇలాంటి గుప్తదానాలు ఎన్నో చేస్తుంటాం.

అయినా ఇప్పుడు ఈ మధ్య దానాలు ఏవి చేయడం లేదు. అలాంటి దానాల గురించి అయితే మీరు మరలా రండి అన్నాడు తలుపులు వేసి.

అది కాదండి మా అమ్మాయి మీ అబ్బాయి గురించి మేము మాట్లాడాలి అనుకుంటున్నాను అందుకే కూర్చుని మాట్లాడదామని అంటున్నాం అన్నాడు బాలయ్య.

సరే అయితే మీరు అలా అరుగు మీద కూర్చొని నేను వస్తున్నాను అన్నాడు దర్భంగా చలపతి. వాళ్ళు ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

పిల్ల పెళ్లి గురించి మాట్లాడాలి అనుకుంటే ఇదేంటి ఇతను అరుగుల మీద కూర్చుని అంటున్నాడు అని అనుకుంటూ. సరే మీరు రండి అని చెప్పి పక్కనే ఉన్న అరుగుల మీద కూర్చున్నారు ముగ్గురు.

వాళ్లు కూర్చోవడం చూసి లోపలికి వెళ్ళిపోయాడు చలపతి. అతను వెళ్లడంతో లక్ష్మి ఏంటండీ అతను ఇలా అరుగుల మీద కూర్చుని మాట్లాడుతాను అంటున్నాడు అంది విసుగ్గా. అవును బావా ఇదేదో పెద్ద వ్యవహారం లాగే ఉంది మనం ఇక్కడ నుంచి వెళ్లిపోదాం అన్నాడు వెంకటేశం.

మీ ఇద్దరికీ తొందర ఎక్కువ కాస్త ఆగండి ఇది అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం మాట్లాడే వెళ్ళిపోదాం. మీరు నోరు మెదపకుండా కూర్చోండి అంటూ గద్దించాడు బాలయ్య వాళ్ళిద్దర్నీ. దాంతో వాళ్లు నోరు మూసుకున్నారు ఇంతలో చలపతి పట్టు బట్టలు వేసుకుని బయటకు వచ్చాడు.

వాళ్ళ ఇంట్లో పనిచేసే కుర్రాడు ఒకడు ఒక కుర్చీ తీసుకొచ్చి వాళ్ళముందు వేశాడు. చలపతి కుర్చీలో కూర్చుంటూ చెప్పండి ఇంతకీ ఏమిటి విషయం అంటూ అడిగాడు.

అందుకు బాలయ్య అయ్యా మా అమ్మాయి పేరు కిరణ్మయి. మా అమ్మాయి మీ అబ్బాయి ఇష్టపడింది. వారిద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. మీరు కూడా సహృదయంతో ఒప్పుకుంటే పిల్లల పెళ్లిళ్లు చేసి కృష్ణా రామా అనుకోవచ్చు అన్నాడు బాలయ్య.

ఆ మాటతో ఒక్కసారిగా చలపతి మొహం గంభీరంగా రకరకాల హావభావాలతో నిండిపోయింది. వెంటనే కుర్చీలోంచి లేచి నిలబడుతూ ఏమిటి మీరు మాట్లాడేది అసలు స్పృహ లో ఉండే మాట్లాడుతున్నారా? ఇలా మాట్లాడడానికి మీకు ఎంత ధైర్యం.

నా ఇంటికి వచ్చి నా కొడుకుని అడుగుతారా మీకు సిగ్గు ఉందా? మీ ఆస్తి ఏంటి నా ఆస్తి ఏంటి? మీ అంతస్తు ఎక్కడ నా అంతస్తు ఎక్కడ. అంటూ కోపంతో కుర్చీని ఒక్క తన్ను తన్నాడు చలపతి.

దాంతో భయంగా లేచి నిలబడ్డాడు ముగ్గురు. అది చూసిన చలపతి వెళ్లండి ఇక నుంచి ఇంకొకసారి గడపలో అడుగు పెట్టారో మీ అందు తేలుస్తా. అయినా మీకు ఇలా చెప్తే వినరు చెప్పే విధంగా చెప్తాను.

అప్పుడే మా వాడిని వలలో వేసుకొని కలెక్టర్ అల్లుని కొట్టేయాలి అనుకుంటున్నారా నీకు అసలు సిగ్గుందా అమ్మాయిలతో ఇలా చెప్తారు. లక్షలు పోసి మేము చదివిస్తే లడ్డు ఎత్తుక పోవడానికి మీరు ఆడపిల్లల్ని కంటారా.

ఎవడు ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు వలలో వేసుకుంటారు అని అని చూస్తూ ఉంటారు ఈ వగలాడి లో అంటూ చాలా అసహ్యంగా తిడుతున్నా చలపతిని బాలయ్య ఆపండి మేము అలాంటి అమ్మాయిలని కన లేదు అలాంటి వాళ్లు వేరుగా ఉంటారు.

అయినా ఇంటికి వచ్చిన వారిని ఇలా అరుగుల మీద కూర్చోబెట్టి మాట్లాడడం లోనే మీ సంస్కారం ఏంటో తెలుస్తుంది. మీరు మమ్మల్ని అన్న మాటలు అన్నీ మీకే వర్తిస్తాయి.

మీ అబ్బాయి అమ్మాయి వెంట పడి మరీ ప్రేమించాడు కాబట్టి వాళ్ళ ప్రేమను గౌరవిస్తూ మేము మీతో మాట్లాడాలని వచ్చాము మీరు ఇంత సంస్కారం హీనులు అని మాకు తెలియదు.

తెలిసి ఉంటే అసలు ఈ గడపలోకి వచ్చే వాళ్ళం కాదు. అంటూ పదండి వెళదాం అని ముందుకు నడిచారు. వెళ్తున్న వారిని చూసి పళ్ళు పటపట కొరికాడు చలపతి.

తన దగ్గర ఉన్న పాలేరాళ్ళను ఎవరక్కడ అంటూ పిలిచాడు. వాళ్ళంతా అంతా చేతులు కట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు.

వెళ్తున్న వారిని చూస్తున్నారు కదా మరి వాళ్ళ సంగతి ఏంటో ఒక చూపు చూడండి అని చెప్పి గంభీరంగా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు చలపతి.

**********

ఆ రోజు రాత్రి లెక్కల మాస్టారు ఇంటికి వెళ్లిన పద్మ ఎంతకీ తిరిగి రాకపోయేసరికి కిరణ్మయి మాస్టారు ఇంటికి వెళ్లింది తన చెల్లెలి కోసం. కానీ మాస్టారు గారు అసలు పద్మ మా ఇంటికి రాలేదు అమ్మా అంటూ చెప్పారు.

దాంతో కంగారు పడిన కిరణ్మయి తండ్రి ఉన్న కొట్టు దగ్గరికి వెళ్ళింది. ఏంటమ్మా ఇలా వచ్చావ్ అంటూ అడిగాడు బాలయ్య నాన్న చెల్లి కనిపించడం లేదు అంతటా వెతికాను అంది గాభరాగా.

అయ్యో అవునా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది వాళ్ళ స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది ఏమో లే అమ్మ కాసేపట్లో వస్తుంది కంగారుపడకు.

నువ్వు ఇంటికి వెళ్ళు నేను వస్తున్నా అంటూ చెప్పాడు ఏమో నాన్నా నాకు చాలా భయంగా ఉంది అంది కిరణ్మయి. భయమెందుకు అమ్మ తను ఏదో స్నేహితురాలి ఇంటికి వెళ్ళి ఉంటుంది.

నువ్వేం కంగారుపడకు ఇంటికి వెళ్ళు అమ్మకు తెలిస్తే అమ్మ కూడా కంగారు పడుతోంది నేను తనను తీసుకొని వస్తాను అన్నారు బాలయ్య.

సరే నాన్న నేను ఇంటికి వెళ్తున్నా. మీరు జాగ్రత్త అంది బయలుదేరుతూ అలాగే అమ్మ నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అంటూ కొట్టులో ఉన్న కుర్రాడిని పిలిచి ఒరేయ్ నువ్వు కాసేపు చూసుకో నేను అలా బయటకు వెళ్లి వస్తాను అని చెప్పిన బాలయ్య తన స్కూటర్ మీద పద్మని వెతకడానికి బయలుదేరాడు.

బాలయ్యల అందరి ఇళ్లకు వెళ్లి అడిగేసరికి పద్మ తన దగ్గరికి రాలేదు అంటే తమ దగ్గరికి రాలేదని అందరూ చెప్పారు అప్పటికి కాస్త చీకటి పడింది.

ఆడపిల్ల ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అనుకుంటూ నీరసంగా తిరిగి కొట్టుకు చేరాడు బాలయ్య. కొట్టు దగ్గరికి అడుగు పెట్టాడో లేదో అయ్యా ఎవరో వచ్చి ఉన్నారు అంటూ కోర్టులో ఉన్న అబ్బాయి ఒక లెటర్ తీసుకువచ్చి ఇచ్చాడు.

ఎవర్రా వాళ్ళు అంటూ అడిగాడు బాలయ్య ఏమో నాకు తెలియదు అన్నాడు ఆ అబ్బాయి. సరే ఎవరో అంటూ ఉత్తరం విప్పాడు. అందులో మీ చిన్నమ్మాయి గురించి వెతికి వెతికి అలసిపోయావా?

మీ అమ్మాయి నా దగ్గరే ఉంది మీ కూతురు నీకు కావాలంటే నేను చెప్పినట్లు నువ్వు వినాలి లేదంటే నీ కూతురు నీకు దొరకదు.

ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే, నీ పెద్దకూతురు ప్రేమించిన అమరేంద్రను మర్చిపో మని చెప్పు. వాడు నీ కూతుర్ని ప్రేమించాడు అని కదా చెప్పావు.

ఎలా వాడు దాన్ని ప్రేమించాడో అలాగే వాడి మనసు ముక్కలు అయ్యేలా నీ కూతురు ప్రవర్తించాలి. వాడి మనసు విరగోట్టాలి. వాడి కళ్ళముందే నీ కూతురు పెళ్లి జరగాలి. వాడి కళ్ళ ముందే నీ కూతురు ఇంకొకరితో తిరగాలి.

అది చూసి వాడు ఛీ ఇలాంటి దాన్నా నేను ప్రేమించింది అనుకుంటూ నీ కూతుర్ని మర్చిపోవాలి. ఇవన్నీ నువ్వు చేస్తేనే మీ చిన్నకూతురు నీకు దక్కుతుంది.

లేదా నీ కూతురు నీకు దొరకదు. పోలీస్ స్టేషన్లో కానీ నా కొడుకుకి కానీ చెప్పాలని అనుకున్నావో నీ కుటుంబం మొత్తం నాశనం చేస్తారు.

నేను ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా. జాగ్రత్త ఇదంతా వారం రోజుల్లో జరిగిపోవాలి. అని చదివి నిస్సత్తువగా కూలబడిపోయాడు బాలయ్య.

అసలు కిరణ్మయి కి పొద్దున జరిగిన విషయమే చెప్పలేదు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తను వెళ్లి వారి మొహం మీద అడిగేస్తుంది. వెళ్లి అమరేంద్రకు చెప్తుంది.

అలా జరగవద్దు తనకి నిదానంగా చెప్పాలి. అని అనుకుంటూ ఆ ఆలోచన లో పడిపోయిన బాలయ్య దగ్గరికి ఏమైంది అయ్యా ఎందుకు అలా కూలబడ్డారు అంటూ అడిగాడు కొట్టు అబ్బాయి.

ఏం లేదులే కానీ కొట్టు మూసేసి నువ్వు ఇంటికి వెళ్ళు రేపు రానవసరం లేదు. అని అతనికి చెప్పేసి తన ఇంటి వైపు బయలుదేరాడు.

ఇంటికి వెళ్తున్న బాలయ్య మనసులో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఈ విషయం తన కూతురుకు చెప్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది ఆలోచించినా కూడా చెప్పకుండా తను ఏమి చేయలేడు.

ఎందుకంటే ఉన్నది తనకు ఇద్దరు కూతుర్లు మాత్రమే ఇప్పుడు ఈ ప్రేమ గోల వల్ల ఒక కూతురు ప్రాణం పోతుంది అంటే తాను ఊరుకో లేడు. ఎలాగైనా తన కూతుర్ని రక్షించుకోవాలి.

ఎంత కష్టమైనా సరే ముందు పెద్ద కూతురికి ఈ విషయం చెప్పి తన నిర్ణయం తీసుకోవాలి ప్రేమ కన్నా ప్రాణం ముఖ్యం కాబట్టి తన కూతురు తన ప్రేమను వదులుకోవచ్చు.

లేదా తన ప్రేమనే ముఖ్యమని అనుకోవచ్చు. ఏది ఏమైనా ఈ విషయం అందరితో చెప్పి ముందడుగు ఏం వేయాలా అని కచ్చితంగా నిర్ణయించు కోవాలి అనుకుంటూ చాలా నీరసంగా ఇంట్లో అడుగుపెట్టాడు బాలయ్య.

బాలయ్య ఎం చెయ్యబోతున్నాడు? ఈ విషయం కిరణ్మయి కి చెప్తాడా? ఒకవేళ చెప్తే కిరణ్మయి ఎం చేస్తుంది? ప్రేమ కోసం చెల్లెలి ప్రాణం తీస్తుందా? లేదా ప్రాణం కోసం ప్రేమని త్యాగం చేస్తుందా? తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చెయ్యాల్సిందే….

-భవ్యచారు

Previous post ఒక చీకటి రాత్రి పార్ట్ 5
మంచి మాట Next post మంచి మాట

One thought on “ఒక చీకటి రాత్రి పార్ట్ 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *