ఒక చీకటి రాత్రి పార్ట్ 7

ఒక చీకటి రాత్రి పార్ట్ 7

ఒక చీకటి రాత్రి పార్ట్ 7

 

హాల్ లోనే ఉన్నా లక్ష్మి అతని చూస్తూనే భర్త లో వచ్చిన మార్పులు చూసి ఏంటండీ ఏమైంది పద్మ కనిపించిందా ఎక్కడ ఉంది ఏది అంటూ అతని వెనక వస్తుందేమో అనుకుంటూ చూసింది..

అందుకు సమాధానంగా బాలయ్య ఆమె చేతిలో ఉత్తరాన్ని ఉంచాడు. పిల్ల గురించి అడుగుతుంటే ఉత్తరం ఏంటి అంటూ అడిగితే ముందు ఆ ఉత్తరం చదువు అన్నాడు బాలయ్య.

లక్ష్మీ ఉత్తరాన్ని చదవడం మొదలు పెట్టింది. ఆమె మొహం లో మారుతున్న రంగులను చూస్తూ అలాగే నిలబడ్డాడు బాలయ్య.

మొత్తం చదివాక లక్ష్మి అయ్యో నా బిడ్డ అంటూ ఏడుస్తూ కూలబడిపోయింది. తల్లి ఏడుపులు విన్న కిరణ్మయి లోపల్నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది ఏమైంది అమ్మ ఏంటి ఎందుకు ఏడుస్తున్నావ్ అంటూ తల్లి ని అడిగి అక్కడే నిలబడి చూస్తూ ఏంటి నాన్న ఏమైంది అమ్మ ఎందుకిలా ఏడుస్తుంది , పద్మ ఎక్కడ పద్మ ఏదైనా అన్న పదం తీసుకొచ్చావా తను ఎక్కడికి వెళ్ళింది అంటూ అడిగింది కంగారుపడుతూ.

దానికి లక్ష్మి ఇంకెక్కడి పద్మం ఏ నా కూతురు ఎత్తుకెళ్లారు తల్లి నా కూతుర్ని చంపేస్తా అంటూ శోకాలు తీయసాగింది.

ఏంటమ్మా నువ్వు మాట్లాడేది పద్మ ని చంపేస్తారా ఎవరు చంపేశారు ఎందుకు చంపేస్తారు ఏంటి నాన్న అమ్మ ఏదో అంటుంది . మాట్లాడుతుంటే సమాధానం చెప్పాలి ఏంటి అంది కిరణ్మయి కొంచెం చిరాకు పడుతూ.

ఇదిగో నీ అమ్మ ఆయనను చెప్తారు ఇది చదువు అంటూ తను చదివిన ఉత్తరాన్ని లక్ష్మీ కిరణ్ మై చేతికి ఇచ్చింది. ఏంటి ఏమో తలమీది ఎవరు రాశారు ఎవరికి రాశారు ఇది ఎందుకు చదవాలి అంటూనే ఆ ఉత్తరాన్ని తెరిచింది కిరణ్మయి అందులో ఉన్న అక్షరాల వెంట కళ్ళు పరుగులు తీశాయి.

కూతురు మొహం లో మారుతున్న రంగులను చూస్తూ ఏం చేయాలో తెలియక అలాగే నిలబడ్డాడు బాలయ్య.

మొత్తం చదివాక ఇంత నీచానికి దిగజారుడు తార అయినా పొద్దున వెళ్ళినా మీరు నాకు ఏ విషయం చెప్పలేదు ఎందుకు ఇంతకీ ఏం జరిగింది అంటూ అడిగింది కిరణ్మయి. అప్పుడే లోపలికి వస్తున్న వెంకటేశం నేను చెప్తాను అమ్మ ఏం జరిగిందో అంటూ ప్రొద్దున ఇంటికి వెళ్లిన దగ్గర్నుంచి అతను ఏం మాట్లాడాడో ఇలాంటి పదాలు ఉపయోగించాడు అనే వివరాలు అన్నీ చెప్పాడు.

అంతా విన్న తర్వాత కిరణ్మయి చి అమరేందర్ తండ్రి ఇంట నీచుడా. నేను ఇప్పుడే వెళ్లి అమరేంద్ర చెప్తాను ఈ విషయాలు తెలిస్తే అతను తండ్రి ని అసహ్యించుకుంటారు ఇద్దరు ఇష్టపడితే పెళ్లి చేయాల్సింది పోయి ఇలా బెదిరిస్తారా అని ఇప్పుడు వెళ్తున్నాను అంటూ రెండు అడుగులు ముందుకు వేసింది కిరణ్మయి.

అంతవరకు మౌనంగా ఉన్న బాలయ్య ఆగమ అంటూ నోరు తెరిచాడు. ముందుకు పడుతున్న అడవులు చటుక్కున ఆగాయి. బాలయ్య మళ్లీ నువ్వు ఇప్పుడు వెళ్లి అతనికి చెప్తావు ఆ తర్వాత అతను వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ నాన్న అని అడుగుతాడు ఈ విషయం మనం అమరేంద్ర కు చెప్తే నీ చెల్లిని పొట్టన పెట్టుకుంటాడు .

అ నీచుడు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది పద్మ గురించి మాత్రమే వాడు అక్కడ ఎన్ని హింసలు పెడుతున్నాడో , ఏమేం చేస్తున్నాడో ఇప్పుడు మనం ఏది చేయాలన్నా కొంచెం ఆలోచించి చేయాలి. ఇక్కడ ముఖ్యంగా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే ఎందుకంటే ఇది నీ జీవితం. నువ్వు ఇప్పుడు వెళ్లి అమరేంద్ర చెప్తే ఆ విషయం తెలిసిన చలపతి మనం అందరినీ చంపవచ్చు వాడికి అంత శక్తి ఉంది. మన గురించి చాలా నీచంగా మాట్లాడాడు.

చలపతి అతని తట్టుకునే ధైర్యం మనకు లేదు. అంగబలం అర్థబలం మనకు లేవు ఉన్నంతలో ఏదో గుట్టుగా బతికే వాళ్ళం. కాబట్టి ఇ ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో ఎందుకంటే ఇది నీ జీవితానికి మన కుటుంబానికి సంబంధించిన విషయం అందువల్ల నేను నిన్ను అడుగుతున్నాను కాస్త నిదానంగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మనం ముందుకు అడుగు వేయవచ్చు అన్నాడు కూతురు తో బాలయ్య స్థిరంగా.

అవునమ్మా ఆ నీచుడు ఎంతకైనా తెగించేలా ఉన్నాడు అందుకే పద్మ ను తీసుకువెళ్లి నిన్ను తన కొడుకు నుంచి విడదీయాలని అనుకుంటున్నాడు. అయినా నేను నీకు ముందే చెప్పాను కదా మనకు ఈ ప్రేమలు దోమలు పనిచేయవని నేను చెప్తే మీరు విన్నారా. ఇప్పుడు చూడండి వాడు ఎంత పని చేస్తాడు నా కడుపును కాలుస్తున్నాడు.

వెల్లమ్మ వెళ్ళు నీ ప్రేమను బతికించుకో, నా బిడ్డ ఏమైతే నీకు ఎందుకు మేమ్ ఏమైపోతే నీకెందుకు. వెళ్లి నువ్వు వాడితో కులుకు, వాడితో నీ జీవితాన్ని పంచుకో నీ చెల్లెల్ని మింగేస్తున్నారు కదే. అంటూ తల్లి లక్ష్మి మీ కిరణ్ మై ని తిట్టడం మొదలు పెట్టింది.

ఆపు లక్ష్మి ఎందుకు అమ్మాయిని అంటున్నావ్ ప్రేమించడం తప్పు కాదు. ఆ ప్రేమని సార్థకం చేసుకోవాలి అనుకోవడం తప్పు కాదు. ప్రేమించిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలి అని అనుకోవడం తప్పు కాదు కానీ అంతా మంచిగా జరిగితే అందరికీ మంచిదే కానీ ఇలా జరగడం వల్ల అందరం బాధపడాల్సి వస్తుంది.

అమ్మ కిరణ్మయి నువ్వు మీ అమ్మ అన్నది అని కాకుండా బాగా ఆలోచించుకో ఇప్పుడు మేమందరం నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉన్నామని గుర్తుపెట్టుకో. ఆ చలపతి నీ ప్రేమని చంపుకుంటూ అలాగే నువ్వు ప్రేమించిన వాడికి కూడా నీ మీద విరక్తి కలిగేలా చేయమని అంటున్నాడు. ఇప్పుడు నీ మీద రెండు బాధ్యతలు ఉన్నాయి. ఒకటి నీ చెల్లెల్ని కాపాడడం మరొకటి నీ ప్రేమని బతికించు కుంటావో చంపకు ఉంటావో అనేది. ఆ రెండింటిని సమర్ధవంతంగా నిర్వహించేలా నిర్ణయం తీసుకో , అన్నాడు తండ్రి బాలయ్య.

అంతా చూస్తున్న అందరి మాటలు వింటున్న కిరణ్మయి. ఇంకా ఆలోచించడానికి ఏముంది నాన్న నా ప్రేమను సమాధి చేయవలసిందే. నేను ప్రేమించిన వాడి ముందు నన్ను నేను ఒక మోసగత్తె లా నటించాల్సి o దే , నాకు నేను ప్రేమించిన వారి కన్నా నా చెల్లెలు ముఖ్యం దానికి ఎంతో జీవితం ఉంది అర్ధాంతరంగా నా సుఖం కోసం దాన్ని జీవితాన్ని పణంగా పెట్టలేను.

నా సుఖం కోసం నేను చూసుకోవడం లేదు నాన్న నాకు మీరు అందరూ కావాలి అందుకే నా ప్రేమ విషయం మీకు చెప్పి ఒప్పించి కొన్ని మీ సమ్మతితో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే ఉంటే నేను ఖచ్చితంగా ఈ పెళ్ళి చేసుకునేదాన్ని కాదు.

మీతో నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అన్న మాటలు అబద్ధం నాన్న. మీరు ఒప్పుకోకపోతే ఇలాగే జీవితాంతం పెళ్లి కాకుండా ఉండేదాన్ని అంతే తప్ప ఇంట్లో నుంచి వెళ్లిపోయే దాన్ని కాదు అంది కిరణ్మయి.

అవును నాకు నీ సంగతి నాకు తెలియదా అమ్మ. ఏదో మా ముందు మేకపోతు గాంభీర్యం వహించారు కానీ నీకు ప్రేమ అంటే ఎంతో ప్రేమ అని నాకు తెలుసు. అందుకనే నిర్ణయాన్ని గౌరవించి నువ్వు ప్రేమించిన వాడి తో మాట్లాడే పిల్లి చేద్దాం అనుకున్నాం కానీ ఇలా జరుగుతుందని మేము అసలు అనుకోలేదు.

అసలు చలపతి వచ్చింది చూసినప్పుడే మాకు అనుమానం వచ్చింది ఇలా మాట్లాడుతున్నాడు అని కానీ ఇంత పని చేస్తాడని మాత్రం అస్సలు అనుకోలేదు. ఈ నీచుడి కడుపు నా అంత మంచి కొడుకు ఎలా పుట్టాడో నాకు అర్థం కావడం లేదు. అయినా ఇప్పుడు మనం ముందు ఏం చేయాలి చెప్పమ్మా నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను అన్నాడు బాలయ్య.

మీరు ఏమైనా చేసుకోండి ముందు మాత్రం నా కూతుర్ని నా కళ్ళ ముందు ఉంచండి అంది లక్ష్మి ఏడుస్తూ.. అమ్మ అ పద్మను నేను తీసుకు వస్తాను. నేనే వెళ్తాను అంది కిరణ్మయి.

వద్దమ్మా వద్దు నువ్వు వెళ్తే అ నీచుడు నిన్ను ఏమైనా చేయగలడు. మన మామయ్య ని పంపిద్దాం అన్నాడు బాలయ్య.

సరే నేను వెళ్తాను నా మేనకోడలు మీ నిర్ణయానికి ఒప్పుకుంది అని చెప్పి పద్మ ను విడిపించు చూపించకు వస్తాను అన్నాడు వెంకటేశం.

సరే మామయ్య వెళ్ళు కానీ జాగ్రత్త అంది కిరణ్మయి. అలాగే నేను కూడా నీతో పాటు వస్తాను అన్నాడు బాలయ్య.. వద్దులే బావ నువ్వు ఎందుకు నేను వెళ్లి వస్తాను అంటూ వెంకటేశం బయలుదేరాడు…

******

చలపతి ఇంటికి వెళ్ళిన వెంకటేశం తలుపులు తట్టాడు. కాసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. చీకట్లో ఎవరూ అంటూ చలపతి అడిగాడు. నేను బాలయ్య బామ్మర్దిని. మీతో ఒక విషయం చెప్పి రమ్మన్నాడు మా బావ అన్నాడు వెంకటేశం.

లైట్ వేసి అతన్ని చూసిన చలపతి ఓ పొద్దున నువ్వు వచ్చావు కదా. ఏమిటి ఏం నిర్ణయించుకున్నారు అంటూ అడిగాడు చలపతి. దానికి వెంకటేశం మీ షరతుకు మాకు సమ్మతమే. మా మేనకోడలు ను మా ఇంటికి పంపించండి అన్నాడు. వెంకటేశం.
ఇంత తొందరగా నిర్ణయం తీసుకున్నారా అవునులే ప్రాణాల కన్నా ప్రేమ ముఖ్యం కాదు కదా, ఏదో చేయాలనుకున్నారు కానీ ఏదో అయింది. మొత్తానికి తోవకు వచ్చారు . మరి చలపతి అంటే ఏమిటి అనుకున్నారు చలపతి ఆ మజాకా మీలాంటి వాళ్లను ఎంతమంది చూసి ఉంటే నేను ఇక్కడకు వచ్చాను. రేయ్ రంగా అంటూ కేక వేశారు. ఆ వస్తున్నా అయ్యా అంటూ రంగ వచ్చాడు. ఆ గదిలో ఉన్న అమ్మాయి ని తీసుకుని రా చెప్పాడు చలపతి. అట్టాగే అయ్యా అంటూ రంగవల్లి చీకటి గదిలో బంధించి ఉన్న పద్మ ని తీసుకొని వచ్చాడు.

చీకట్లోంచి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పద్మ తన మావయ్య వెంకటేష్ అన్ని చూసి మామయ్య అంటూ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏం మా వీళ్లు నిన్ను ఏమీ చేయలేదు కదా అన్నారు వెంకటేశం. ఏం చేస్తాం అయ్యా ఆడపిల్ల అంటే మాకు కూడా అభిమానమే ఆకలవుతుంది ఏమో అని అన్నం కూడా పెట్టాను కానీ ఆ అమ్మాయి తినకుండా కూర్చుంది. ఇంటికి తీసుకువెళ్లి అన్నం పెట్టు. అన్నాడు చలపతి.

ఆ మాట మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు విసురుగా అంటూ పద్మ వెళ్ళిపోదాం అని పద్మ ని తీసుకుని రెండు అడుగులు ముందుకు వేశాడు వెంకటేశం.

ఇది కూడా బాగానే ఉంది దీన్ని కూడా ఎవడి నైనా అయినా వలలో వేసుకోమని చెప్పు , నా దగ్గర మీ ఆటలు సాగలేదు కానీ వేరే వాళ్ల దగ్గర బాగానే సాగుతాయి. మంచి డబ్బున్న వాడిని చూసి పట్టుకో తల్లి అన్నాడు చలపతి వెటకారంగా…
రేయ్ నిన్ను అంటూ వెంకటేశం కొట్టడానికి వెళ్ళాడు. కానీ రంగా ముందుకు వచ్చి అతని చేతులు రెండు పట్టి మెడ మీద చేతులు వేసి ముందుకు లాక్కొచ్చి నెట్టేశాడు.
నామీద చేయడానికి ప్రయత్నిస్తా వా నీకు ఎంత ధైర్యం రా, పో అవతలకి ఎంగిలి మెతుకులు తిని బతికే కుక్క అంటూ చలపతి ఇంకో నాలుగు బూతులు మాట్లాడాడు.

చెప్పింది గుర్తుందిగా నీ మేనకోడలు నా కొడుకును ప్రేమించకూడదు వాడికి దూరం కావాలి దూరమయ్యేలా తన ప్రవర్తించాలి. అలా చేయలేదు అంటే ఈసారి అమ్మాయి ని తీసుకు వెళ్తున్నావ్ కానీ అలా చేయకపోతే మాత్రం శవాన్ని తీసుకొని వెళ్లాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ బెదిరించాడు.

ఆ వెంకటేశం మాటలు విన్న ఆవేశంగా పళ్ళు పటపటా కొరికిన ఏమీ చేయలేని స్థితిలో పద్మ ని తీసుకొని ముందుకు కదిలాడు.

*******

అర్ధరాత్రి కావస్తున్నా కూడా ఆ ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. వెంకటేశం వెళ్ళి దాదాపు గంట అవుతున్నా కూడా ఇంకా ఎలాంటి సమాచారం లేకపోవడంతో మిగిలిన ముగ్గురు కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నారు. లక్ష్మీ మాటిమాటికి తలుపు వైపు చూస్తోంది ఆమె కళ్ళ తో పాటు మిగిలిన నాలుగు రోజులు కూడా తలుపు వైపు వెళ్తున్నాయి.

కాలం గడుస్తున్న వాళ్ళు రాకపోవడంతో అక్కడ ఏం జరిగిందో ఏమో నేను వెళ్తాను అంటూ రెండు అడుగులు వేశాడు బాలయ్య. వద్దు నాన్న మీరు ఒక్కరే వద్దు నేను కూడా వస్తాను అంటూ తను కూడా ముందుకు రెండడుగులు వేసింది కిరణ్మయి. అంతలో తలుపు చప్పుడు వినిపించింది.

ఒకే ఒక్క అడుగు లో తలుపు ముందుకు వెళ్లి గబుక్కున తలుపులు తెరిచింది లక్ష్మి. అక్కడ తలుపు బయట తన తమ్ముడితో పాటు తన కూతుర్ని కూడా చూసి సంతోషంగా అమ్మ పద్మావతి తల్లి నీకు ఎంత భయం తప్పింది ప్రాణాలతో ఉంటావని అనుకోలేదు. ఈరోజు లేచిన వేళా విశేషం మంచిది కాదు అన్నట్టు ఉంది. అమ్మ నా తల్లి రావమ్మా అంటూ నా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొని వచ్చింది లక్ష్మి చెల్లెలు రావడంతో గుండెల మీద చేతులువేసుకుని కిరణ్ మై. బాలయ్య గట్టిగా నిట్టూర్చాడు.

లక్ష్మీ పద్మ మొహాన్ని చేతులను నడుముతో వాళ్ళు నిన్ను ఏమీ చేయలేదు కదా ఏమైనా తిన్నావా లేదా అంటూ అడిగింది. ఏం లేదు అమ్మా వాళ్ళు నన్ను ఏమీ చేయలేదు అన్నం కూడా పెట్టారు కానీ నేనే భయంతో తినలేక పోయాను అంది పద్మ.

నా తల్లే ఇప్పుడే తీసుకు వస్తాను ఆగు అంటూ గబుక్కున కూతుర్ని వదిలి వంటింట్లోకి వెళ్ళింది లక్ష్మి. అవును అక్క ఇంతకీ వాళ్ళు ఎవరు నన్ను ఎందుకు తీసుకొనివెళ్ళారు ఏం చేయాలని తీసుకొని వెళ్లారు మామయ్య తో అతను ఏదో అన్నాడు. ప్రేమ కొడుకు బెదిరింపు అని ఏమో మాట్లాడాడు ఏమైంది అక్క ఇంతకీ నాన్న మీరైనా చెప్పండి ఏమైంది అంటూ అడిగింది పద్మ.

ఏదో చెప్పబోతున్న కిరణ్మయి నీ నువ్వు ఆగమ్మ కిరణ్ మై నేను చెప్తాను అంటూ బాలయ్య పద్మ ఏం లేదమ్మా మన శత్రువులు మనల్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా నిన్ను తీసుకుని వెళ్లారు. ఇప్పుడు ఇంకేం భయం లేదమ్మా నేను వాళ్ళతో మాట్లాడాను. కానీ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అంతే ఇంతకు మించి ఇంకా వేరే ఎక్కువ ఏమి అడగకు. చిన్న పిల్లవి ఇంతకన్నా నువ్వు ఎక్కువ తెలుసుకుంటే మంచిది కాదు అంటూ చెప్పాడు బాలయ్య.

సరే నాన్న అలాగే మీరు చెప్పినట్టే వింటాను అంది పద్మ. ఇంతలో లక్ష్మీ ప్లేట్లో అన్నం తీసుకొనివచ్చి కలిపి పద్మావతి అనిపించసాగింది.

వాడు ఏమన్నాడు అంటూ బావమరిది అడిగాడు బాలయ్య. బావను కొంచెం పక్కకు తీసుకొని వెళ్లి చలపతి అన్న మాటలను యథాతథంగా చెప్పాడు వెంకటేశం. అన్ని మాటలు విన్న తర్వాత సరే ఈ రాత్రి ఇలా గడిచి పోయి రేపు ఏం చేయాలో ఆలోచిద్దాం బాలయ్య. అమ్మ కిరణ్ మై నువ్వేమీ బాధపడకు అతని మర్చిపోవడానికి ప్రయత్నం చెయ్ అంటూ కూతురు తల నిమిరి తన గదిలోకి వెళ్ళిపోయాడు.

పద్మ అన్నం తినేసి తల్లి పద్మ కిరణ్మయి మరొక గదిలో పడుకున్నారు. వెంకటేశం హాల్లో ఉన్న సోఫాలో పడుకున్నాడు. అందరూ పడుకున్నారు కానీ ఎవరు నిద్రపోవడం లేదు మనసులో ఆలోచనలు వాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి.

ఇక కిరణ్మయి మనసైతే చాలా బాధతో నిండిపోయింది. దాదాపు మూడేళ్ళ పరిచయం ప్రేమ ఒక్కసారిగా అది తన నుంచి దూరం అవుతుంది అంటే మనసుకు ఎంతో బాధ గా ఉంది. తన ప్రాణాలను ఎవరో తోడేస్ ఉన్నట్లు గా అనిపించసాగింది. తన శరీరంలో సగభాగం కోరుతున్నట్లుగా మనసు రంపపు కోత గా ఉంది. ప్రేమించిన ప్రేమించిన వాడిని తన వాడు అనుకునేవాడిని వదిలేయాలంటే ఏ ఆడపిల్లయినా ఎంతో కష్టంగా ఉంటుంది. పైగా అతనికి ఏదీ తెలియకుండా దాచి అతని మనసుని వీర కొట్టారట ఎంత సులువుగా అన్నారు.

ఆ మాటను , అసలు ఈ పెద్దవాళ్లకు మనసుంటే ప్రేమంటే మాట అంటే ఏవీ తెలియవు వాళ్ళు అనుకున్న సాధించుకోవాలని అనుకుంటారు. కానీ పిల్లలు ప్రేమని అర్థం చేసుకోరు. తాము ప్రేమించిన వారికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎంత బాగుంటుంది వాళ్ల జీవితం అని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వాళ్ల పరువు ప్రతిష్టల కోసం కులం కోసం మతం కోసం ప్రేమ జంటలను విడదీస్తారు. ఎందుకు ఇంత కు సంస్కారములు వీళ్ళు. ప్రేమించుకునే వాళ్ళు విడిపోవాలంటే ఎంత బాధగా ఉంటుందో వారికి అర్థం కాదు. ఇంతకీ అతను చేసిన తప్పేంటి ప్రేమించడమే నా మేము చేసిన తప్పు ప్రేమించిన వాడి తో జీవితాంతం ఉండాలి అనుకోవడం తప్పు.

ప్రేమించిన వాడు తన తోడుగా ఉండాలని కోవడమే నా నేను చేసిన తప్పు ఎందుకిలా ప్రవర్తిస్తారో ఈ పెద్దవాళ్ళు. పైగా అతని మనసు విరగ్గొట్టాడు కాకపోతే నా చెల్లి ని చంపేస్తాను అన్న అంటాడా. వాడికి ఎంత ధైర్యం ఒకవేళ నేను ఈ విషయాలన్నీ అమరేంద్ర కు చెప్పి తనను తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది. అవును నిజమే తన ని తీసుకొని తనకు అన్ని విషయాలు చెప్పి ఇకనుంచి వీళ్ళందరికీ దూరంగా వెళ్లి పోయి సంతోషంగా ఎక్కడో ఒక చోట ఉండటం మంచిది. అనే ఆలోచన ఓవైపు రాగా పెదవుల మీద నవ్వు విరిసింది ఆ వెంటనే మళ్లీ అమ్మో నేను అమరేంద్ర కీ విషయాలన్నీ చెప్పి వేరే ఎక్కడికైనా తీసుకొని వెళితే ఆ చలపతి ఊరుకుంటాడా అమ్మను నాన్నను మామయ్యను చెల్లిని చంపేస్తాడు ఏమో. ఈ విషయం అతనికి తెలిసిన మరుక్షణం ఈ పనులు చేస్తాడు.

సశేషం

-భవ్యచారు

కరోనా..(ఆటవెలదులు) Previous post కరోనా..(ఆటవెలదులు)
భార్య Next post భార్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close