ఒక పేజీ

ఒక పేజీ

ఒక పేజీ

 

చరిత్రలో ఒక పేజీలో నిలవాలని రంగడికి చాలా కోరికకానీ ఎలా నిలుస్తాడు?తనకేమెా చదువు రాదు చిన్నప్పుడు తండ్రి ఎంత చదువుకోమన్నా చదువుకోలేదు..పైగా తనది పల్లెటూరు అక్కడ అయిదు వరకే చదువుపట్నం పోరా? అని తండ్రి కోప్పడితే అమ్మను వదిలివెళ్లనని మారాం చేసాడు..

ఇప్పుడేమెా అరటి పండ్ల వ్యాపారం చేస్తున్నాడు పొట్టకూటి కోసం ..ఆ వ్యాపారం చేస్తూ భార్యా పిల్లలను పోషిస్తున్నాడు
కానీ చరిత్రలో ఎలా నిలవాలి? అని తెగ ఆలోచించాడు

తన పిల్లలు పెద్దవుతున్నారు..కానీ పల్లె ఏ మాత్రం మారలేదు అలాగె ఉంది పిల్లలనుపై చదువులు చదివించాలంటె మళ్లీ పట్నం పంపించాల్సిందే!తనే పట్నం వెళ్లలేక చదువు రాలేదు పిల్లల కోసమయినా ఏదో చేయాలి ఎలా? ఎలా? ఎలా?
ఆలోచనలు రంగయ్య మనసును వేధిస్తున్నాయి..

ఆ ఊరి సర్పంచ్ ను వెళ్లి కలిసాడు ఎలాగయినా మనఊరికి బడి రప్పిద్దామని..ఆ సర్పంచ్ నవ్వేసాడు..నీకే చదువు లేదు నువ్వు బడి రప్పిస్తావా? అంటూఎగతాళి చేసాడు .దాంతో నిరాశ చెందిన రంగయ్య ఆ జిల్లా కలెక్టరును
కలిసాడు ఏదన్నా ప్రయెాజనం ఉంటుందేమెానని..

ఆయన కొంచం ఆలోచించినట్టు చేసి..ఆలోచన మంచిదే కానీ మీ ఊరి జనాభా ఎంత? అని అడిగాడు..
చెప్పాడు తోచినట్టుగా!అంత తక్కువ జనాభాకు ఇవ్వదు గవర్నమెంట్ అన్నాడు కలెక్టర్..
మళ్లీ నిరాశే తోడయింది..

ఇంట్లో భార్య కూడా నీ పిల్లల కోసం వాళ్లెందుకిస్తారు?ఊరుకో నీ ప్రయత్నం అంది..రంగయ్యకు పట్టుదల పెరిగింది..
తనకున్న ఆస్తిలో కొంత అమ్మేసి స్కూల్ కట్టించాడు.ఆ కలెక్టరు కొంచం పాజిటివ్ గా కనపడడంతో తననే మళ్లీ మళ్లీ కలిసి టీచర్లను పెట్టించాడు..

ఆ స్కూలు బ్రహ్మాంఢంగా నడుస్తుంది.ప్రైమరరీ విజయంతో హై స్కూలు కట్టించాడు ఆ తరువాత ఇంటర్ కాలేజ్ ఆ తరువాత డిగ్రీ కాలేజ్కట్టించాడు..అన్నీ విజయాలు సాధించాయి ఆ ఊరికే పెద్ద పేరు వచ్చింది..

ఆ ఊర్లో అంతారంగయ్య వల్లవిధ్యాధికులయ్యారిప్పుడు రంగయ్య చరిత్రలో ఒక పేజీని సాధించాడు చదువుకోక పోయినా!!

 

-ఉమాదేవి ఎర్రం

గెలిచినట్టే Previous post గెలిచినట్టే
చరిత్ర సృష్టించు Next post చరిత్ర సృష్టించు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close