ఒక పర్వత సహనం…!!!

ఒక పర్వత సహనం…!!!

వందేమాతరం
వందేమాతరమంటు…
ఎవడో పాలనతో కన్నీటి దారలు
ఉప్పు కూటిని కలుపరాదని…!!
తెంచుకోలేని దాస్య శృంఖలాలు
భావితరాల మార్గదర్శకానికి
సమ్మెట పోటు కారాదని…
ఉప్పెనై కదిలేను ఒక పర్వత సహనం…

అహింసా పరమోత్తమ ధర్మమని…
శాంతి సహనాలే సమతా మమతలకు
ఆయుధమని…!!
పరాయి పాలనలో మగ్గిన బతుకు
కొమ్మలను పూయించుటకు సత్యాగ్రహ
సందేశాలతో పిడికిలెత్తిన ఉద్యమమై
సాగించేను మహాసంగ్రామాన్ని…

నైసర్గిక స్వరూపాలతో
విశాల సముదాయం భారతదేశంగా
స్వతంత్రించబడాలని…!!
పురుడోసుకొన్న ప్రతివాడు భరతమాత
ముద్దు బిడ్డడే నని…సర్వంతో ఏకమై
ఆశయాల సాధింపులతో మనస్సు
తేట తెల్లనై బతుకు సాయుదమై…
పూటను గెలిచిన ఆకలిని చేత బట్టుకొని
ప్రభాత భేరిని నడిపించేను…

ఆదిపత్యపు చలాయింపులు
నేల మట్టమై అందరి మనస్సుల
భావగీతం ఎగిరిన పథాకమై…!!
పిడికిలి బిగించిన ఐకమత్యం
ఉషోదయపు తేజమై…
సంసిద్ధతతో సాధించిన
స్వేచ్ఛావాయువుల స్వాతంత్ర్యాన్ని
ప్రతి యింటిన వేడుకగా జరపాలని
కోరెను గాంధీజీ…

– దేరంగుల భైరవ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *