ఒక రాంగ్ కాల్ వల్ల పుట్టిన ఒక ప్రేమ కథ

ఒక రాంగ్ కాల్ వల్ల పుట్టిన ఒక ప్రేమ కథ 

ఒక రాంగ్ కాల్ వల్ల పుట్టిన ఒక ప్రేమ కథ 

 

మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండాలి అంటే ఉండరు. అలాగే కాలం కూడా దానికి తగ్గట్టుగా ఎప్పుడు మారుతూ ఉంటుంది. అలా మారుతూ ఉండే కాలం లో అనుకోకుండా చేసిన ఒక్క రాంగ్ కాల్ నా జీవితాన్నే మార్చేసింది. నాలో నాకు తెలియని విషయాలని తెలిసేలా చేసింది. ప్రేమంటే మనల్ని ఒకరు అర్ధం చేసుకోవడమే కాదు. మనం ఒకరిని అర్ధం చేసుకోవడం కుడా అని తెలుసుకున్నాను..

నా పేరు రమ్యశ్రీ. ..

నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది తను ఎప్పటి నుండో ఒకతనితో ప్రేమలో ఉంది కాకపోతే వాళ్లిద్దరూ ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారూ ……
అలానే ఒకరోజు ఇద్దరికి గొడవ అయ్యింది ఆ అబ్బాయి నా ఫ్రెండ్ తో ఇంకా మాట్లాడాను అని అన్నడంట తను ఏడుస్తూ ఉంది నేను ఎం కాదలే మాట్లాడతాడు లే అని చెప్తున్న వినడం లేదు సరే నేను కాల్ చేసి మాట్లాడతా అని చెప్పి తన ఫోన్ లో ఉన్న నంబర్ చూసి డైల్ చేసాను ఒక్క నంబర్ తప్పు అవ్వడం తో అది మరొకరికి వెళ్లింది కాని అప్పుడు తెలియలేదు అది ఎవరు కాల్ లిఫ్ చెయ్యలేదు సరే నేను తరవాత మల్లి కాల్ చేసి మాట్లాడతా అని చెప్పి అక్కడి ఇంటికి వచ్చేసాను.

మల్లి కాల్ చేసాను ఒకతను కాల్ లిఫ్ చేసి ఎవరు అని అడిగాడు నేను ఏమి చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాను అలా ఎలా మోసం చేస్తారు ప్రేమించిన వాళ్ళని జీవితం అంతా తోడుంటా అని చప్పి ప్రేమ పోగానే వదిలి వెళ్ళిపోతారు మీ అబ్బాయిలు అని అన్నాను ఆ మాటకు అతను ఎవరు ఎప్పుడు ఎవరితో ఉండాలో ఎవర్ని వదిలెయ్యాలో అంతా ఆ దేవుడి రాత అన్నాడు ఇంకా నేను కోపంతో ప్రేమించే అప్పుడు తెలియలేదా అది ఇప్పుడు రాతలు గీతలు అంటూ సోది చెళ్తున్నావు అని తిట్టి కోపం గా కాల్ కట్ చేసాను..

తరవాత రోజు ఉదయం నా ఫ్రెండ్ కాల్ చేసి ఎంతో ఆనందం గా మేము కలిసిపోయాము తనే క్షమించమని చెప్పాడు అని అంది నేను నాలో నేనే పొంగిపోయాను సరే అని చేప్పి కాల్ కట్ చేసి హ్యాపీ గా ఫీల్ అవుతున్నాను తరవాత కాసేపటికి నా ఫ్రెండ్ ప్రేమిస్తున్న అబ్బాయి నాకు కాల్ చేసి సిస్టర్ నిన్న కాల్ చేసావు అంట కదా నాకు రాలేదు మీ కాల్ అన్నాడు.

అంతె ఇంకా మాటలు లేవు నేను ఎం చెప్పకుండా నీకు మల్లి చేస్తా అని చెప్పి కాల్ కట్ చేసేసాను అయితే నిన్న వేరే వాళ్ళకి వెళ్లిందా ఆ కాల్ అయ్యో అనుకుని మల్లి వాళ్ళకి కాల్ చేసి క్షమించమని అడుగుదాం అని కాల్ చేసాను కాల్ కట్ చేశారు మల్లి చేసాను కట్ చేశారు నాలుగవ సారి లిఫ్ చేశారు క్షమించమని అడిగి రాంగ్ నంబర్ అని చెప్పాను అతను ఓ అవునా సరే అండీ అన్నాడు నేను ఇప్పుడు కాల్ ఎందుకు కట్ చేశారు అని అడిగాను అతను ఇలా చెప్పాడు

మీరు మొదటి సారి చేసినప్పుడూ మీ మాటలు విన్నాక మీరు పిచ్చివాల్మేమొ ఎవరో మోసం చేశారేమో అనుకున్న అన్నాడు ఆ మాటలు విని నాకు ఇంక మాటలు రాలేదు ఏమి చెప్పకుండా కాల్ కట్ చేసేసాను ఐదు నిమిషాల తరవాత మల్లి చేసి నేనేం పిచ్చి దాన్ని కాదు అని నా ఫ్రెండ్ గురించి చెప్పి కాల్ కట్ చేసాను కోపం గా

అతను మల్లి భాద పడుతున్నానేమో అని కాల్ చేసి క్షమించమని అడిగి కొంచం బుజ్జగించాడు ఆ క్షణం నాకది నచ్చింది..నేను సరే అని చెప్పి అతని పేరు అడిగాను అతని పేరు కిరణ్ అన్నాడు కాసేపు అలా మాట్లాడుకున్నాం.

అలా రోజూ కాలిగా ఉన్న టైం లో కాల్ చేసి మాట్లాడుకుంటూ ఉన్నాము అతనితొ మాట్లాడుతూ రోజూ నాలో ఏదో ఒక మార్పు నాకు నచ్చుతుంది అది తనతో మాట్లాడాలి అన్న ఆరాటం ఎంత సేపు మాట్లాడిన ఇంకా మాట్లాడాలి అనిపించడం కొన్ని రోజులకి ఇది ఒకవేళ ప్రేమ ఏమో అనుకున్నను సందేహం ఏమి లేదు ఇది ఖచ్చితం గా ప్రేమే అనుకుని ఆ రోజు తనకి ఆ విషయం చెపుదాం అనుకున్న తనకి కాల్ చేస్తుంటే తనే చేసాడు.

ఆ విషయం చెప్పబోతుంటే తనే ఇలా అన్నాడు వచ్చే వారం లో నా పెళ్లి నువ్వు తప్పకుండా రావాలి అని నాకు ఇంకా నోట మాట రాలేదు ఎంతో బాధాని దిగామింగుకుని ఎవరు ఆ అమ్మాయి అని అడిగాను తను నా మరదలు చిన్నప్పటి నుండి నేనంటే ఎంతో ఇష్టం అని అన్నాడు నేను ఏమి మాట్లాడలేక నాలో నేనే క్రుంగిపోయాను ..

కాని తరవాత అర్ధం చేసుకున్నాను ఈ కొన్ని రోజుల పరిచయానికే నేను ఇంతలా ప్రేమిస్తే చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్న తన మరదలు ఇంకెంత ప్రేమిస్తుంది అని ఇంకా నాకు నేనే సర్ది చెప్పుకుని కిరణ్ కి తప్పకుండా మీ పెళ్లి కి వస్తాను అని చెప్పాను

తను అప్పుడు ఇలా అన్నాడు నా మరదలు చాలా మంచిది నేనంటే చాలా ఇష్టం నన్ను బాగా అర్ధం చేసుకుంటుంది తనకి నీ గురించి కూడా చెప్పాను ఒక అమ్మాయి రాంగ్ కాల్ లో పరిచయం అయ్యింది. ఇప్పుడు మంచి ఫ్రెండ్ అయ్యింది అని అన్నాడు ఆ మాటతో నేను చిన్న చిరునవ్వుతో సరే అని చెప్పి మీ ఇద్దరు ఎప్పటికి ఇలానె కలుసుండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా ఉంటా అని చెప్పి కాల్ కట్ చేసాను.

అప్పుడే అర్ధం అయ్యింది ప్రేమంటే ఒకరు మన ప్రేమని అర్ధం చేసుకోవాలి అనుకోవడమే కాదు. మరొకరి ప్రేమని కూడా మనం అర్ధం చేసుకోవాలి కిరణ్ మరదలి ప్రేమ నేను అర్ధం చేసుకున్న..

-రమ్య 

ముందడుగు Previous post ముందడుగు
ఛాయ్ Next post ఛాయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close