ఒకసారి ఏమైందంటె..

ఒకసారి ఏమైందంటె..

అది ఎప్పుడో నా పెళ్లైన కొత్తలో!
నాకీ విషయం చెప్పారు..
మా వారు సింగరేణి లో జాబ్ చేసేవారు అయితే వాళ్లకు మూడు షిఫ్ట్ లు ఉంటాయి దాంట్లో సెకండ్
షిఫ్ట్ కి వెళ్లారొకరోజు..
సెకండ్ అంటే మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి పదకొండు వరకు అన్నమాట..
ఒక రోజు ఆ సెకండ్ షిఫ్ట్ కి వెళ్లారు మా ఊరు నుండి
తన ఉధ్యోగం చేసే దగ్గరకు వెళ్లే సరికి గంట పడుతుంది
అందుకే రెండు గంటలకే బయలు దేరి వెళ్లేవారు మళ్లీ
తిరిగి రావడానికి కూడా గంట పైనే పడుతుంది..

ఆ మధ్యలో అంతా నిర్మానుష్యం, చెట్లతో కూడి చీకటిగా ఉంటుంది దాంతో భయం భయంగా వచ్చేవారు..

అయితే ఇంతకీ ఆ రోజు వచ్చేటప్పటి సంగతేంటంటే
ఆ రోజు ఇంకా కొంచం లేట్ అయిందట..
నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్ పైన సైకిల్ తొక్కుకుంటూ
వస్తున్నారట పక్కన ఒక తెల్ల చీర కట్టుకుని జుట్టు విరబోసుకున్నావిడ కనిపించి రెండు చేతులు చాచి వికృతంగా రా రా అంటుందట..
మా వారు కొంచం సేపు అలాగే చూసి..
అమ్మెా! దయ్యంలా ఉందని అనిపించి సైకిల్ ఇంకా ఇంకా స్పీడ్ గా తొక్కుతూ నేను రాను నేను రాను అంటూ భయంగా గబ గబా తొక్కుకుంటూ మా ఊరి
దగ్గరకు వచ్చారట..
మళ్లీ అక్కడ కూడా అలాంటావిడే కనిపించి అలాగే అంటుందట..
మళ్లీ అదే ధైర్యంతో రాను రాను అని గట్టిగా అరుచుకుంటూ సైకిల్ తొక్కుతూనే ఉన్నారట..
ఇంతలో మా మామగారు ఇంకా కొడుకు రాలేదని ఎదురుగా వచ్చారట..
బాపూ! వచ్చావారా! అంటూ ఎదురుగా వచ్చారట
( మా మామగారు తనని ముద్దుగా బాపూ అని పిలుచుకునే వారు )
తనేమెా ఇంకా రాను రాను అంటూనే ఉన్నారట..

ఏందిరా? ఏమైంది? సురీ!( మా వారి పేరు సురేందర్ రాజు సురీ అని కూడా పిలిచే వారు ) అని పిలిచేసరికి సైకిల్ ఆపి అక్కడ దయ్యం కనిపించిందని చెప్పారట.

అయ్యెా! నాన అది దయ్యం కాదు పెద్ద రాయికి సున్నం వేసారు రా! అని చెప్పి భయం పోగొట్టారట ఆంజనేయ
దండకం చదువుకో మన్నారట..
చదువుకున్నాక ఆ భయం కొంత పోయిందట కానీ
తెల్లవారి అది కనపడిన చోట చూస్తే రాయేమీ లేదట..

అలా కొన్ని సార్లు మాత్రమే జరిగిందట..

మరి అది నిజంగా దయ్యమేనా?
ఏమెా మరి!!.
మాకు అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు చెప్తుండే వారు..
భలేగా అనిపించేవి..

ఉమాదేవి ఎర్రం

kids telugu stories

telugu stories for kids

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *