ఆన్లైన్ రొమాన్స్

ఆన్లైన్ రొమాన్స్

 

టింగ్ అని మెసేజ్ వచ్చింది చూస్తే  

చాట్ లో ఒక అభిమాని: హాయ్ అని పలకరింపు  

నేను:  హాయ్ అని రిప్లై  

వెధవ : ఎక్కడ ఉంటారు? 

తింగరి : హైద్రాబాద్ 

వెధవ : ఓ అవునా 

తింగరి : మీరెక్కడ ఉంటారు?

వెధవ : విజయవాడ 

తింగరి : ఓహ్ ఓకే 

వెధవ : లంచ్ చేశారా 

తింగరి :  లేదండీ 

వెధవ : ఏంటి లేట్ తొందరగా తినండి. హెల్త్ ముఖ్యం కదా.. (వాళ్ళ అమ్మ ను కూడా అలాడుగుతాడో లేదో తెలియదు వెధవ..)

తింగరి : హా వెళ్లి చేస్తాను 

వెధవ : ఓకే నేను ఎదురుచూస్తారు మీ మెసేజ్ కోసం 

తింగరి :   హా హా హా  

వెధవ: వెళ్లి తినండి 

తింగరి : అయిపోయింది 

వెధవ : ఓహ్ గుడ్

తింగరి : ఇంకేంటి? 

వెధవ: మీ నంబర్ ఇవ్వరా? 

తింగరి :  నేనా నా నంబర్ ఎందుకు ? 

వెధవ : మూడేళ్ల నుండి చాటింగ్ చేస్తున్నాం కదా. ఇస్తే ఏమవుతుంది? అప్పుడప్పుడు మాట్లాడొచ్చు, నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

తింగరి : అవును. కానీ, నంబర్ వద్దులే ఇక్కడే మాట్లాడు ఏదైనా… 

వెధవ :  అది కాదు నాకు మీ కథలు అంటే చాలా ఇష్టం. వాటి గురించి డిస్కస్ చేయాలి అని నా కోరిక ఇవ్వండి ప్లీజ్. 

తింగరి :  అమ్మా, నా కథలు అంటే ఇష్టం అంటున్నాడు కదా, అతని వల్ల ఇంకా కొందరికి నా కథలు చేరతాయి కావచ్చు ఇస్తే ఏమవుతుంది? మూడేళ్ల నుండి ఏమీ తప్పుగా బిహేవ్ చేయలేదు కదా, సో ఇద్దామా హా ఇద్దాము లే..  ఏదైనా అయితే నంబర్ బ్లాక్ చేయొచ్చు, మంచివాడు లాగానే ఉన్నాడుగా… 

వెధవ:  ఏమైంది అండి ఇవ్వరా? నా పైన నమ్మకం లేదా? మూడేళ్ల నుండి మాట్లాడుతున్నాను. ఆ మాత్రం నమ్మకం లేదా? దయచేసి నంబర్ ఇవ్వండి.

తింగరి :  హా సరే లే ఇస్తున్నా తీసుకో  ********** ఇదే నా నంబర్ 

వెధవ :  థాంక్యూ మేడం చాలా థాంక్స్, మెసేజ్ చేశాను చూడండి 

తింగరి : హా చూశాను 

వెధవ :  ఇక మెసేజ్ లో మాట్లాడడం మొదలు పెట్టాడు

తింగరి :  నా రచనలు చదవండి అంటూ షేర్ చేయండి అంటూ రోజు మెసేజెస్ చేస్తూ ఉంటుంది..

****కొన్ని రోజులు గడిచాయి****

ఆన్లైన్ రొమాన్స్
ఆన్లైన్ రొమాన్స్

పరిచయం పెరిగింది తన రచనలు చదివి షేర్ చేశాడు అనుకుందా తింగరి. ఒక రోజు…

 వెధవ : హాయ్ 

 తింగరి : హా చెప్పండి 

 వెధవ : మీరు అంటే నాకు ఇష్టం మీ ఫోటో ఒకటి పంపుతారా 

 తింగరి : హా సరే పంపించను. కానీ, స్టేటస్ లో పెడతా చూడు 

 వెధవ :  హా అదేంటి నాకు పంపవా

తింగరి : లేదు పంపను

వెధవ : అబ్బా ప్లీజ్ 

తింగరి :  నో 

వెధవ : సరే పెట్టు చూస్తా ఎక్కడో ఒక దగ్గర 

తింగరి : హా పెట్టాను చూసావా 

వెధవ :  హా చూశాను చాలా బాగున్నావు 

తింగరి : హొ అవునా థాంక్స్  

వెధవ : నిన్ను ఒకటి అడగనా? 

తింగరి : ఎంటి మేడం నుండి నిన్ను వరకు వెళ్లింది, సరే అడుగు 

వెధవ :  నువ్వు చాలా బాగున్నావు  

తింగరి : ఏదో అడుగుతా అంటున్నావు? 

వెధవ : హా అవును నాకు గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా?

తింగరి :  ఏ ఏం మాట్లాడుతున్నావు? అంత లేదు. 

వెధవ :  ఎవవుతుంది ఉండొచ్చు కదా 

తింగరి : పిచ్చి పిచ్చి గా ఉందా ఏం? 

వెధవ :  ఏం లేదు ఉంటే ఏంటి హాయిగా వీడియో కాల్ చేసుకుందాం మాట్లాడుకుందాం ప్రేమించుకుందాం. 

తింగరి : అంటే నన్ను ప్రేమిస్తున్నావా?

వెధవ : ప్రేమంటే హా అంతే అనుకో 

తింగరి : అంటే నన్ను పెళ్లి చేసుకుంటావా? 

వెధవ :  హా చేసుకుందాం అంటే చేసుకుందాం. 

తింగరి :  మీ వాళ్ళు ఒప్పుకోక పోతే?

వెధవ : ఎందుకు ఒప్పుకోరు? నీకు ఎందుకు నేను చూసుకుంటా కదా, ఇంతకీ నీకు ఆన్లైన్ రొమాన్స్ అంటే తెలుసా? 

తింగరి : తెలియదు అంటే ఏమిటి? 

వెధవ :  అంటే మనం బట్టలు లేకుండా వీడియో కాల్ మాట్లాడుతూ ఉండాలి అన్న మాట 

తింగరి :  ఛీ ఛీ నేను అలా చేయను 

వెధవ : అబ్బా ప్లీజ్ 

తింగరి : ఛీ ఛీ నువ్వు ఇలా మాట్లాడతావని అసలు అనుకోలేదు 

వెధవ :  నీకు నిజంగా తెలివి లేదు అసలు నువ్వు ఆడదానివేనా, నీకసలు రొమాన్స్ తెలియదు. 

తింగరి :  అవును తెలియదు 

వెధవ :  నీ నడుం చూడాలని ఉంది పిక్ పెట్టావా? 

తింగరి :  నో పెట్టను 

వెధవ : ఏం చేసుకుoటావు అంతా అందాన్ని నాకు కాస్త పంచొచ్చు కదా 

తింగరి : నాకు ఇదంతా ఇష్టం ఉండదు 

వెధవ :  పెళ్లి చేసుకుంటా చూపించు అబ్బా 

తింగరి :  మీ వాళ్ళు ఒప్పుకోక పోతే ఏం చేస్తావు? 

వెధవ :  వాళ్ళు ఒప్పుకోకపోతే మనిద్దరం చేసుకుందాం 

తింగరి : నీకు జాబ్ లేదు గా ఎలా బ్రతుకుతాము? 

వెధవ :  నీకు సొంత ఇల్లు, అస్తి లేదా దాంతో బ్రతుకుడాం 

తింగరి :  అది మా అమ్మా వాళ్ళది కదా వాళ్ళు రానివ్వక పోతే అప్పుడు ఎలా? 

వెధవ :  ఏమీ కాదు రాణిస్తారులే. వాళ్లే మీ ఇంట్లో, నీ అస్తి ఉండగా ఇంకా భయం ఎందుకు? అవును ఒక మంచి ఊపు ఉన్నాయి నీ బత్తాయిలు. ఫోటో పెట్టావా?   

తింగరి : సారీ నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. నేను ఫోటోలు పంపను, ఏమీ పంపను నాకు అవసరం లేదు. 

వెధవ : ఛీ నువ్వు ఆడపిల్లవి కాదు. నీకు రొమాన్స్ తెలియదు. నాలాంటి వాడు నీకు దొరకడం అదృష్టం. నాలాంటి వాడిని పోగొట్టుకుంటే, నీ జీవితంలో నువ్వు చాలా బాధ పడల్సి వస్తది చూడు. నాకు ఎన్ని                  బహుమతులు వచ్చాయి. నా లాంటి వాడు ఎంత గొప్పనో నీకు అర్థం కావడం లేదు. ఛీ, ఛీ నీలాంటి పిచ్చిది ప్రపంచంలో ఉండదు.

తింగరి : అవును నువ్వు చాలా గొప్ప వాడివి. అభిమానం అంటూ నంబర్ తీసుకుని, తెలియని వాళ్ళతో వీడియో కాల్ చేసి బట్టలు ఇప్పి మాట్లాడు అని అడిగే వాడివి, నువ్వు గొప్ప వాడివి. ప్రేమించిన అమ్మాయి               ఆస్తి మీద కన్నేసి ఆ అస్తితో బ్రతకాలి అనే ఆలోచనలు చేసిన వాడివి. నువ్వు గొప్ప వాడివి. అన్నిటికీ మించి నిన్ను నమ్మిన అమ్మాయితో మిస్ బిహేవ్ చేసే వాడివి నువ్వు గొప్ప వాడివి. నీకు ఎన్ని                         బహుమతులు వస్తె నాకేంటి? నువ్వు ఎంత గొప్ప వాడివి అయితే నాకేంటి? పది మందికి చెప్పే స్థితిలో ఉన్న నువ్వు ఇలాంటి చిల్లర వేషాలు వెస్తావు అని నేను అనుకోలేదు. నీ మనసు ఇంత నిచమైనది               అని తెలిస్తే నీకు విలువ ఎవరు ఇవ్వరు. ఈ విషయం సమూహంలో చెప్తే నీ పరువు ఏమవుతుందో ఆలోచించు. ఇంత నీచమైన ఆలోచనలు ఉన్నాయని తెలిసిన క్షణం నీకు విలువ గౌరవం ఇచ్చిన వారే               ఉమ్ముతారు అని గుర్తుంచుకో.. నికు నంబర్ ఇవ్వడం తప్పే కానీ, ఇలాంటి వాడివి అనుకోలేదు. నిన్ను బ్లాక్ చేస్తున్నా… 

వెధవ : నన్ను పోగొట్టుకున్న నీకు ఏం లాభం ఉండదులే కానీ, ఎవరికీ చెప్పకు సరేనా ప్లెజ్ 

తింగరి :  ఛీ నువ్వు ఒక రచయితనా? ఇంకొక రచయితతో ఇలాగేనా మాట్లాడేది? దానికి వేరే వాళ్లను చూసుకో ..

తింగరి నంబర్ బ్లాక్ చేసింది.. ఈ సంఘటన నిజంగా ఒక సమూహంలో జరిగింది. ఇలాంటి ముసుగు మనుషులు మన మధ్యే ఉన్నారు… జాగ్రత్తగా ఉండండి…

– భవ్య చారు

Related Posts

3 Comments

  1. ఇలాంటి సంఘటనలు మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి.
    మనమే అప్రమత్తంగా ఉండాలి.

  2. మీ కథ చాలా బాగుంది.పాత్రల పేర్లు ఈ కథకు మరింత బలాన్ని ఇచ్చాయి.వాస్తవాన్ని సూటిగా చెప్పారు.అందరూ చదవాల్సిన కథ.

  3. ఈ విషయం రాధ అనే ఒక స్నేహితురాలు నాతో చెప్పింది.
    అతను ఎవరో కానీ చాలా బాధపెట్టాడు,
    అందుకే జాగ్రత్తగా ఉండాలి.

Comments are closed.