ఒంటరి ప్రయాణం
చిన్నప్పటి నుండీ నేను ఒంటరి గానే ఉన్నాను అవును మా అమ్మ నన్ను ఒక్కదాన్నే కన్నది నాకు తోబుట్టువులు ఎవరూ లేరు నాన్న గారు ఏదో ఆఫీస్ లో పని చేసేవారు కొన్నాళ్లకు ఆయన చనిపోయారు అంటే నాకు ఊహ తెలిసే సరికే ఆయన పోయారు నాన్నను ఫోటో లో తప్ప వేరే ఎప్పుడూ చూడలేదు. నాన్న పోయినప్పటి నుండి అమ్మ నన్ను పెంచింది.
నాన్న జాబ్ అమ్మకు రావడం తో నేను ఎప్పుడూ ఒంటరిగానే ఉండేదాన్ని ఒంటరిగా ఉండడం, ఒంటరిగా తినడం, ఒంటరిగా స్కూల్ కు వెళ్ళడం, ఒక్క దాన్నే రావడం, ఒంటరిగా పడుకోవడం ఇలా అన్ని ఒంటరిగానే చేశాను, అమ్మ ఎప్పుడూ నాతో కలిసి లేదు అమ్మా ఆఫీస్ నుండి వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉండేదాన్ని కానీ అమ్మతో పాటూ గా ఇంటికి ఎవరో ఒకరు వచ్చేవారు వాళ్లకు నన్ను చూపించి నా కూతురు అని పరిచయం చేసి వెళ్ళి ఆడుకో అంటూ బయటకు పంపేది. కానీ నాకు ఆడుకోవడానికి ఎవరూ స్నేహితులు లేరు అవును ఎలా ఉంటారు నేను ఎవరితోనూ పెద్దగా కలిసే దాన్ని కాదుగా దాంతో నా గది లోకి వెళ్లి ఒంటరిగా బయటకు చూస్తూ గడిపే దాన్ని..
అమ్మ గది లోంచి మాటలు నవ్వులూ వినిపించేవి అలా చాలా సేపు అయిన తర్వాత అమ్మ తో వచ్చిన అతనికి అమ్మ వంట చేసి పెట్టేది అందులో ఎక్కువగా మాంసం కూరలే వండేది అదే నాకు ప్లేట్ లో పెట్టీ ఇచ్చేది గది లోకి వెళ్లి తిను అంటూ చెప్పి తాను మళ్లీ గది లోకి వెళ్లి పోయేది.అమ్మ ఎప్పుడూ నన్ను దగ్గరికి తీసుకోలేదు నాతో మనసు విప్పి మాట్లాడలేదు నాతో ఆడుకొలేదు నాకు కథలు చెప్తూ నిద్ర పుచ్చ లేదు, నా విషయాలు ఏవి పట్టించుకోలేదు.
అవును తాను ఎందుకు అలా చేసేదో కొంత వయసు వచ్చాక నాకు అర్దం అయ్యింది. డబ్బు డబ్బు సంపాదిస్తే అన్ని అవసరాలు తీరతాయి అందరూ మన దగ్గరికి వస్తారు జీవితం లో డబ్బుకు చాలా విలువ ఉంది డబ్బుంటే ఎన్ని తప్పులు చేసినా ఎవరు పట్టించుకోరు. అందుకే అమ్మా డబ్బు సంపాదించి పెట్టింది నాకు ఆ డబ్బు తో బాగానే చదివించింది నేనూ కూడా బాగానే చదువుకున్నాను .
ఇంత చదువుకున్నా నాకు స్నేహితులు ఎవరు లేరు నా దగ్గరికి ఎవరూ వచ్చ్చేవారు కాదు ఎందుకంటే నేను నా చుట్టూ గిరి గీసుకుని ఉన్నాను ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే దాన్ని కాదు ఎందుకంటే నాకు భయం వాళ్ళు నా తల్లి గురించి ఏదైనా అంటారేమో అనే భయం నన్ను నిలదీస్తారని భయం ,భయంవల్ల నేను ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు మా అమ్మ అలా ప్రవర్తించేది ఎవరెవరో ఇంటికి వచ్చే వాళ్ళు వాళ్ళతో ఆఫీస్ పని అంటూ గంటలు గంటలు గది లో ఉండిపోయేది.
నాకు ఒక వయసు వచ్చాక తాను ఏం చేస్తుందో అర్దం అయ్యి, అమ్మకు దూరంగా వెళ్లాలి అని నిర్ణయించుకున్నాను అలాగే అమ్మ తో చెప్పాను ధైర్యం చేసి అమ్మ నన్ను ఒకసారి చూసి అలాగే అంటూ డబ్బు ఇచ్చింది దాంతో నేను వేరే ఊర్లో చదువుకోవడం మొదలు పెట్టాను.
ఒంటరి ప్రయాణం
అక్కడే నాకు రమేష్ పరిచయం అయ్యాడు చాలా మంచి వాడు కావడం తో మేము తొందరగానే కలిసి పోయి ప్రేమలో పడిపోయాను అతనితో , అతనికి తల్లి తప్ప ఎవరూ లేరు దాంతో మా పెళ్ళికి పెద్ద సమస్య రాలేదు నేను రమేష్ విషయం అమ్మకు చెప్పగానే అమ్మ ఏమి మాట్లాడకుండా ఓహ్ నాకు వెతికే బాధ తప్పించావు అంటూ సంతోషించి నవ్వుతూ వాళ్లను కలిసింది అంటే రమేష్ ను అతని తల్లిని కలిసి బాగా మాట్లాడి కొంత కట్నం ఇచ్చి నా పెళ్లిని గ్రాండ్ గా చేసింది అందర్నీ పిలిచింది అప్పుడూ నాకు అర్దం అయ్యింది అమ్మ ఇంతలా నన్ను చూడకుండా దూరం పెట్టి మరి ఇంత డబ్బు ఎందుకు సంపాదించింది.
అమ్మ నాన్న ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకుంటే ఎవరూ వారిని రానివ్వలేదు అంట పైగా అమ్మ మంచిది కాదని నాన్న కు నూరి పోశారు అని , దాంతో నాన్న వారికి దూరంగా వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటూ ఉండగా నాన్నకు యాక్సిడెంట్ అయ్యిందట అప్పుడు అమ్మా వెళ్లి అందర్నీ సహాయం అడిగితే ఎవరు సహాయం చేయకపోగా తనను అవమానించారు అని అందుకే డబ్బు కోసం పెద్ద పెద్ద వాళ్ళ తో సంభందాలు పెట్టుకుని సంపాదించింది భర్త చనిపోయాక అందరూ తనను చులకనగా చూడడం అసలు నాన్న చనిపోయాడు అని తెలిసినా ఎవరు రాలేదు అంట చిన్న పిల్లలను అయినా నన్ను పట్టుకుని అమ్మ ఎన్నో రాత్రుళ్ళు ఏడుస్తూ నిద్ర లేకుండా గడిపిందట అందరికన్నా ఎక్కువగా డబ్బు సంపాదించి అందర్నీ తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలని అనుకుని ఇప్పుడు అది సాధించింది.
అవును నిజమే నా పెళ్లి కి అందర్నీ పిలిచిన అమ్మ ఎలా చేస్తుందో చూడాలని అవసరం అయితే అవమానించాలని వచ్చిన చుట్టాలు అమ్మ చాలా ఎత్తులో ఉండడం పెళ్ళికి పెద్ద పెద్ద వాళ్ళు రావడం చూసి బెల్లం చుట్టూ మూగిన ఈగల్లా అమ్మ చుట్టూ చేరడం చూసి పొగడడం చూసి నేను ఆశ్చర్య పోయాను పెళ్లి అయిపోయింది నన్ను అత్తారింటికి సాగనంపుతూ నాతో అమ్మా నిన్ను నేను సరిగ్గా చూడలేదు అని నాకు తెలుసు కానీ ఇదిగో వీళ్ళందరి ముందు తలెత్తుకోవాలని నిన్ను నిర్లక్ష్యము చేసిన మాట నిజం కానీ ఇదంతా చేసింది నీ కోసమే డబ్బు ఎంత పని అయినా చేయిస్తుంది.
కాబట్టి నువ్వు జీవితం లో విసిగి పోయాక ఇదిగో ఈ అడ్రస్ కు వెళ్ళు ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే పెళ్లి పిల్లలు వాళ్ళ అలనా పాలనా చూశాక ఒక వయస్సు వచ్చాక నీకు ఇదేనా జీవితం అని అనిపిస్తుంది ఎందుకు నేను ఇంకా బ్రతికి ఉన్నాను అనే అనుమానం కలుగుతుంది ఇది ప్రతి ఆడదానికి ఎదురయ్యే సమస్య కానీ అందరూ ఏదోలా జీవితం సాగిస్తారు. కానీ నా కూతురు అలా మౌనంగా ఒంటరి జీవితం గడప కూడదు అందుకే ఈ అడ్రస్ ఇచ్చాను నీకు జీవితం లో ఎప్పుడు విసుగు వచ్చినా ఇక్కడికి రా అంటూ అడ్రస్ చేతిలో పెట్టింది అమ్మ మరి వీళ్ళు అని అడిగాను నేను వాళ్లను నేను నా దగ్గరికి కూడా రానివ్వను నువ్వేం భయపడకు అంటూ రమేష్ చేతిలో నన్ను పెట్టీ పంపింది.
ఆ తర్వాత నేనెప్పుడూ అమ్మ దగ్గరికి వెళ్ళలేదు ఇద్దరు పిల్లలు వారి జీవితం తీర్చిదిద్దాను రమేష్ నన్ను పిల్లలను బాగానే చూసుకున్నాడు పిల్లలు పెద్దగా అయ్యారు, అత్త గారు పోయారు అయినా నేను చలించ లేదు పిల్లలు పుట్టినప్పుడు కూడా అమ్మ రాలేదు దానికి నేను ఏమి బాధ పడలేదు. ఇదిగో ఇప్పుడు రమేష్ పోయాక పిల్లలకు రెక్కలు వచ్చాక నాకు ఇంతేనా జీవితం అని అనిపించింది ఎప్పుడో పాతికేళ్ళ క్రితం అమ్మ ఇచ్చిన అడ్రస్ వెతికి పట్టుకొని ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా…
మేడం మీరు దిగే స్టేజి ఇదే కండక్టర్ మాటలతో ఆలోచనల్లోంచి ఉల్లిక్కి పడి చుట్టూ చూస్తూ లేచి నిలబడ్డాను బస్ నన్ను దించి దుమ్ము రేపుతు వెళ్ళిపోయింది..
ఒంటరి ప్రయాణం
చుట్టూ చూసాను ఒక చిన్న పల్లె ఎదురుగా సన్నని బాట చుట్టూ పచ్చని పంట పొలాలతో నిశ్శబ్దంగా ఉంది అంతటి ప్రశాంతత ఒక్కసారిగా చూసేసరికి నాకు కాస్త భయం వేసింది అయినా ముందుకు కదిలాను.ముందుకు కాస్త దూరం వెళ్ళగానే చిన్న పర్ణశాల లాంటి ఇల్లు రకరకాల మొక్కలు వాటిలో చిన్న చిన్న గుడిసెలు, చిన్న పెద్దా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు పెద్ద బోర్డ్ మీద విశ్వశాంతి నిలయం అంటూ నా పేరును చదివి ఆశ్చర్య పోయాను లోపలికి వెళ్లేసరికి తెల్లని కాటన్ చీర లో జుట్టు ముడి వేసుకుని పెద్ద కళ్లద్దాలు పెట్టుకున్న నా తల్లి ఆ పిల్లలను చుట్టూ కూర్చో బెట్టుకుని ఎదో చెప్తుంది నా రాక గమనించినట్టుగా రా తల్లీ అంటూ లేచి నిలబడి చేతులు చాచింది ఇన్ని రోజులు ఎన్నో సమస్యలకు తలొగ్గి పిల్లల కోసం ఎన్నో కోల్పోయిన నేను అమ్మ చేతులు చాచగనే వెళ్లి ఒళ్ళో వాలిపోయాను …
అమ్మా మీరు విశ్వశాంతి అమ్మగారా ! అంటూ పిలిచిన పిలుపు కు ఉలిక్కి పడి కళ్ళు తెరిచి చూసాను కానీ అమ్మ లేదు అది అచ్చు అమ్మ లాంటి విగ్రహం దాని చుట్టూ పిల్లలు కూడా విగ్రహాలే అంటే అమ్మ నన్ను ఇక్కడే ఉండి చూసుకో అని చెప్పిందా అని నేను లేచి నన్ను పిలిచిన వైపు చూసాను ఆమె కూడా దాదాపు అమ్మ వయసు లోనే ఉంది నేను చూడడం గమనించి అమ్మా మీరు వస్తారని ఇన్ని రోజుల నుండి చూస్తున్నాం ఇదిగో మీరు రాగానే ఈ ఉత్తరం మీకు ఇవ్వమని అన్నారు పెద్దమ్మ గారు అంటూ నా చేతిలో ఒక లెటర్ పెట్టింది
నేను దాన్ని తెరిచి చూశాను ఒకే ఒక్క వాక్యం ఉంది అందులో ఒంటరి ప్రయాణం అపేసి వీరికి దారి చూపించు అదే నీ జన్మకు సార్థకత. అంటూ నా బాధ్యతను గుర్తు చేసింది నేను నవ్వుతూ నా బాధ్యతను చేతిలోకి తీసుకున్నాను ఇప్పుడు నేను కొన్ని వేల మందికి దారి చూపే విశ్వశాంతి ని అయ్యాను … ..
-అనురాధ