ఓ రాధ కథ

ఓ రాధ కథ

ఇద్దరూ అక్క చెల్లెలు అక్క తనకంటే పొట్టిగా ఉన్న అక్క అంటే నాకు ప్రాణం మా అమ్మ బాపు. అంటే ఆ రోజుల్లో అమ్మను అమ్మా అని నాన్నను బాపు అని పిలిచేవాళ్ళం మా బాబు ఒక చిన్న గుమాస్తా అయితే అతనికి నలుగురు ఆడపిల్లలు ఒక కొడుకు ఒక ఊరిలో గుమస్తాగా పని చేస్తూ అదే ఊరిలో ఇల్లు కిరాయికి తీసుకొని అందులో భార్యతో పాటు అతను తన నలుగురు బిడ్డలు ఒక కొడుకు తో ఉండేవారు.

అదే తన కుటుంబం ఆ కుటుంబంతో కలిసి ఉండేవాడు పొద్దున లేచింది మొదలు 8 గంటల వరకు ఆఫీస్ కి వెళ్ళాలి సాయంకాలం ఐదు గంటలకు వచ్చే వాడు అలా సాగుతున్న రోజులలో పెద్దమ్మాయి పదవ తరగతి పాస్ అయింది. రెండో అమ్మాయి ఏడవ తరగతి తన వెనుక ఉన్న ఇద్దరు చెల్లెళ్ళు ఒకరు రెండో తరగతి ఇంకొకరు మూడవ తరగతి తమ్ముడు ఐదో తరగతి చదువుతున్నారు అంతా సర్కారు బడి లోనే చేర్పించాడు ఎందుకంటే తన ఆర్థిక స్తోమత సరిపోదని అందరిని సర్కారు బడిలో వేశాడు అలా రోజులు గడుస్తున్నాయి.

ఇంతలో పెద్ద అమ్మాయి పెళ్లి ఈడు కు వచ్చింది రెండో అమ్మాయి ఏడో తరగతి చదువుతుంది ప్రొద్దున లేవగానే జడ కూడా వేసుకోకుండా సద్ది అన్నం తిని స్కూల్ కి వెళ్ళే ది సరిగ్గా పుస్తకాలు కూడా ఉండేవి కావు రాసుకునేందుకు కాపీలు కూడా ఉండేవి కావు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు బాపు కొన్ని తెల్ల కాగితాల తో తెచ్చేవాడు. మొలలతో రంధ్రాలు చేసుకుని అందులో నుంచి దారాలు తీసి కాపీలుగా చేసుకునే వాళ్లం. అలా చేశాక అందులో మధ్యలో పేపర్ ని మడతపెట్టి. ఒకపక్క తెలుగు మరోపక్క ఇంగ్లీషు మరోపక్క సైన్సు మరోపక్క సాంఘిక వెనక పక్క లెక్కలు మరోపక్క హిందీ రాసుకునేవాళ్ళం.

బడిలో మా పరిస్థితి అంతా తెలిసిన టీచర్లు ఏమనేవారు కాదు మా పరిస్థితి తెలిసిన టీచర్లు బుక్కులు చూసి వాటి మీద సంతకాలు పెట్టిన పెట్టేవారు పరీక్షల సమయంలో టీచర్ల దగ్గర ఇళ్లకు వెళ్లి వాళ్ళ ఇంట్లో కూర్చొని చదువుకునేదాన్ని ఎందుకంటే నేను ఏడో తరగతి కదా నాకు కొంచెం లెక్కలు సరిగా రావు అందుకే టీచర్ నాకు లెక్కలు ఇంగ్లీషు చెప్పేది నేను వాళ్ళ ఇంట్లో పని చేసేదాన్ని కూరగాయలు తేవడం బట్టలు మడత పెట్టడం చేసేదాన్ని వాళ్లు ఏ పని చెప్పినా చేయనని చెప్పకుండా చేసేదాన్ని ఎందుకంటే నాకు చదువుకోవాలని ఉంది నేను ఏడో తరగతి పాస్ కావాలి అందుగురించి మా టీచర్లు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేదాన్ని చాలావరకు మా బడిలో మా టీచర్లు అందరూ నన్ను మెచ్చుకునేవారు.

రాధ చాలా మంచి అమ్మాయి మనము ఏ పని చెప్పినా చేస్తది ఇంత కూడా సిగ్గు పడదు అంటూ మా హెడ్మాస్టర్ ఇప్పుడు అప్పుడేమో హెచ్ఎం అనేవాళ్ళం మా హెచ్ఎం టీచర్ గంగామణి చాలా బాగుండేది విజయనిర్మల గా ఉండేది నాకు చాలా నచ్చేది ఆమెకు నేనంటే చాలా ఇష్టం నేను వాళ్ళింటికి కూడా వెళ్లి చిన్న చిన్న పనులు చేసే దాన్ని ఆమె నాకు ఏదైనా తినడానికి పెట్టేది కానీ నేను అక్కడ తినేదాన్ని కాదు ఇంటికి తీసుకు వెళితే ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముడు తింటారు కదా అని ఇంటికి పట్టుకుని వచ్చే దాన్ని ఇక్కడే తిను రాదా అని ఎన్నిసార్లు అన్నా తినే దాన్ని కాదు ఇంతలో పరీక్షలు దగ్గరికి వచ్చాయి నేను చాలా కష్టపడి చదివాను ఎందుకో ఏమో ఏమైందో తెలియదు కానీ ఇంగ్లీష్ లో ఫెయిల్ అయ్యాను చాలా ఏడ్చాను టీచర్లందరూ నన్ను బుజ్జగిస్తూ వచ్చే సంవత్సరం వరకు మంచిగా చదువుకొని రాస్తావు కదా ఎందుకు ఏడుస్తావ్ మేమంతా ఉన్నాం కదా అంటూ టీచర్లు నన్ను బుజ్జగించారు.

మేము కాదు కదా దిద్దేది ఇది కామన్ ఎగ్జామ్ నీతోనే స్టార్ట్ అయింది అందుకే హైదరాబాదులో దిద్దుతారు కదా మేమేం చేయలేము వచ్చే సంవత్సరం రాసి పాస్ అవుతావు అంటూ చెప్పారు ఇక ఇంట్లో అంతా తిట్టేవారు ఫెయిల్ అయినందుకు మా బాపు మాత్రం వచ్చే సంవత్సరం రాస్తాది పాస్ అవుతుంది అంటూ మా బాపు నన్ను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు మా అమ్మ మా అక్క నన్ను చాలా తిట్టారు ఇక నేను ఊరుకోక పట్టుబట్టి నాకెందుకు రాదు నేను ఎందుకు చదవలేను అని టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్లి టీచర్ నాకు ఇంగ్లీష్ చెప్పండి ఏ పనైనా చేస్తాను అంటూ బ్రతిమిలాడాను హంసా టీచర్ నాకు ఇంగ్లీషు చెప్పడం ప్రారంభించింది.

నేను ఇంగ్లీష్ లో బాగానే చదివేదాన్ని అది చూసి టీచర్ నువ్వు తప్పకుండా పాస్ అవుతావ్ రాధా అంది టీచర్ కొన్ని నెలల తర్వాత మళ్లీ పరీక్షలు వచ్చాయి ఈసారి బాగా రాశారు రెండో క్లాస్ లో పాస్ అయ్యాను అప్పుడు బడిలో టీచర్లు అంతా మెచ్చుకున్నారు రాధా చాలా పట్టుదల పిల్ల ఈసారి రెండో క్లాస్ లో పాస్ అయింది ఇంకా ముందు ముందు మంచిగా చదువు కుంటే భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదించగలదు అన్నారు టీచర్లు.

అప్పటి నుండి నాకు చదువుమీద శ్రద్ధ పుట్టి మంచిగా చదువుకునే దాన్ని. ఎనిమిదవ తరగతి లో అన్నిట్లో మంచి మార్కులు తెచ్చుకున్నాను 80 90 మార్కులు వచ్చేవి కానీ నా దురదృష్టం ఏమిటో గాని ఇంతలో నాకు పెళ్లి చేశారు నేను ఆరు నెలల పరీక్షలు రాసి వచ్చాను ఇంటికి రాగానే నీకు పెళ్లి చేస్తాను అంది అమ్మ అయ్యో నేను ఇప్పుడే మంచిగా చదువుతున్న నాకు పెళ్లి ఎందుకు అయినా నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి ముందు అక్కకు చెయ్ నాకు కాదు అని ఇంట్లో గోల గోల చేశాను కానీ నా మాట ఎవరూ వినలేదు ఇంతలో ఎండాకాలం సెలవులు వచ్చాయి.

పొద్దున్నే అమ్మ వంట చేసేది పప్పుచారు చేసి అందరికీ 10 గంటల వరకు అన్నం పెట్టేది అందరం తిని నేను ఆడుకునేదాన్ని ఇక నుండి నీ ఆటలు సాగవు నీకు పెళ్లి చేస్తారు అంటూ అక్క నన్ను వెక్కిరించేసి నేను ఏడ్చేదాన్ని నాకు పెళ్లి వద్దు ఏమి వద్దు అనేదాన్ని అప్పుడు మా తాతగారు వాళ్ళ ఊరు నుండి వచ్చారు అమ్మమ్మ కూడా వచ్చింది మా తాతగారు నన్ను దగ్గరికి తీసుకుని నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే అక్క కంటే పొడవుగా ఉన్నావు పెద్దగా ఉన్నావు నువ్వు చిన్నదానివైనా పెద్ద దానిలా కనిపిస్తావు అందుకే నీకు పెళ్లి అని అంటుంటే నేను నాకీ పెళ్ళి వద్దు తాతగారు అని ఏడ్చేదాన్ని.

అయినా ఎవరూ వినలేదు ఎందుకో నాకైతే ఏ విషయం తెలియదు అక్క కంటే ముందు నాకెందుకు పెళ్లి చేస్తున్నారు నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి నేను ఇంకా చదువుకుంటాను అని నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నా వినకుండా నాకు పెళ్లి చేశారు.

– రాధ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *