ఊహాలు

ఊహాలు

ఊహాలు విచ్చుకున్న వేళ
మదిలో మెదిలిన ఒక ఊహ.
ఊహా, ఊహేకాని, నిజం అనిపిస్తుంది.
ఊహలో చూడటానికి ఏమిలేదు.
ఎవరూలేరు. ఊహా చాలా బాగుంది.
ఊహని తలిస్తే, మనసంతా ఆనందం.
కళ్ళలో కోటిదీపాల కాంతి.
ముసిముసి నవ్వులతో ఆధారాలు.
విశాలమైన ఊహాలోకంలో,
అనంతమైన అమూల్యమైన భావన,
కంటికి కనిపించకుండా,
శూన్యమంతా పరుచుకుంది.
స్వచ్చమైన,
స్వేచ్ఛ కలిగిన,
ఆ భావనకు ఆకారం,
అలంకారం,
అశ అవసరం లేదని,
ఒక ఊహలో చెప్పలేనంత
అనుభూతి కలుగుతుందని
అందమైన ఊహా,
హృదయానికి చూపిస్తుంది.
నా ఊహానందాన్ని
మరిన్ని ముచ్చట్లతో
పంచుకోవాలని వున్నా,
మాటలు కరువయ్యాయి.
– రాధికా.బడేటి

Related Posts