ఒత్తిడి

ఒత్తిడి

ఒత్తిడి

 

మహిత పదో తరగతి వరకు చదువుకుంది. తర్వాత తన పరిస్థితి బాలేక పై చదువులు చదువుకోలేదు. ఇంట్లోనే ఉండి బాగా టీవీ , పుస్తకాలకు అలవాటు పడిపోయింది.
అలా రోజులు గడిచే కొద్దీ తాను ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకుంది.
ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలకే తన మనసులో పెట్టుకొని బాగా ఆలోచించి ఒత్తిడికి లోనయ్యేది.
ఎప్పుడూ సరదాగా , నవ్వుతూ , తులుతూ ఉండే మహిత. తనలో వచ్చిన ఈ మార్పుని తానే గుర్తించలేకపోయింది.
ఇంతకు ముందులాగా అందరితో సరదాగా ఉండడం మానేసి ఒంటరిగా ఫీల్ అవుతూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండేది.
ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా వాళ్ళని వాళ్లకి కుశల ప్రశ్నలు అడిగి ఊరుకుంటుంది కానీ సరదాగా మాట్లాడడం మానేసింది.
ఒకరోజు ఊరు నుంచి వాళ్ళ అత్తయ్య వచ్చింది. వాళ్ళ బావకి పెళ్లి కుదిరిందని పెళ్లి ఒక నెలలో ఉందని చెప్పింది.
“మీరందరూ తప్పకుండా రావాలని , నేను మాత్రం ఇప్పుడు మహితను తీసుకొని వెళ్ళిపోతాను” అని చెప్పింది దుర్గ.
“అక్క మాట కాదనలేక సరే… అని ఒప్పుకున్నాడు” ఆ మహిత వాళ్ళ నాన్న.
రెండు రోజుల తర్వాత ఊరు బయలుదేరారు. వాళ్ళ అత్తయ్య ఊరు వెళ్లడం ఇదే మొదటిసారి కానీ చిన్నప్పుడు ఎప్పుడో వెళ్లినట్టు కొంచెం గుర్తుంది మహితకి.
వాళ్ళ బావ ఊరు మొత్తం తిప్పి మరి చూపించాడు. మహితకి ఆ ఊరు చూడగానే రెండు రోజుల్లోనే తన మనసు మారిపోయింది.
ఇంతకు ముందులాగా నలుగురితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ తులుతూ ఉండడం చూసి వాళ్ళ అత్తయ్య , బావలు చాలా సంతోషించారు.
అప్పుడే మహితకు నేను ఇలా ఖాళీగా ఉండడం మంచిది కాదు , నాకంటూ ఒక బిజీ పనిని పెట్టుకోవాలి అని అనుకుంది. పదో తరగతిలో ఉన్నప్పుడు స్కూల్ వాళ్ళ తరుపున కంప్యూటర్ నేర్చుకోవాలని శ్రద్ధ ఉంటే డబ్బులు మీరే పెట్టుకొని వెళ్లి రావాలి అని చెప్పారు.
కానీ మహితకు ఆ శ్రద్ధ ఉన్న డబ్బులు లేకపోవడం వల్ల కంప్యూటర్నే ర్చుకోలేకపోయింది.
అయితే వాళ్ళ బావ దగ్గర ఉన్న లాప్టాప్ చూసి , “బావ… లాప్టాప్ ఎలా ఉపయోగించాలో నేర్పించావా?” అని అడిగింది మహిత.
మహిత వాళ్ళ బావ ఖాళీగా ఉన్న సమయంలో మహితకి లాప్టాప్ ఎలా ఉపయోగించాలో నేర్పించాడు.
అలా తన జీవితంలో ఒత్తిడి వదిలేసి ఏదో ఒక పనిలో బిజీ అయిపోతూ రోజులు గడిపేస్తుంది మహిత.
ఈ మధ్యనే పుస్తకాలు ఎక్కువ చదవడం మొదలుపెట్టింది. ఒంటరిగా ఉండాలనే బాధని తరిమికొట్టి ఒంటరిగా ఫీల్ అవ్వకుండా పుస్తకాలు తన నేస్తాలుగా చేసుకొని ఇప్పుడు జీవితాన్ని సంతోషంగా సాగిస్తుంది.
మీరు కూడా ఎక్కువ అతిగా ఆలోచించి ఒత్తిడికి లోనై డిప్రెషన్ లోకి వెళ్ళకండి అదే మనకి హానికరం..

-మాధవి కాళ్ల

దేశం అభివృద్ధి చెందాలి Previous post దేశం అభివృద్ధి చెందాలి
దానిని అధిగమించటం ఎలా?! Next post దానిని అధిగమించటం ఎలా?!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close