ఓటు – నీవెటు

ఓటు – నీవెటు

మానవుడు వేసే అతి పవిత్రమైన ఓటు..
అరాచక రాజకీయాలకు వేయాలి వేటు..
నిరంకుశ పాలకులకు అది పేదవాని కాటు..
అప్రజాస్వామ్యానికది సాధారణ మానవుని బల్లెం పోటు..

క్షణికావేశంలో, అస్పస్టతతో వేసే ఓటు..
కుల మత వర్గ స్వార్ధాలతో వేసే ఓటు..
మద్యం మత్తులో, ధన దాహంలో వేసే ఓటు..
వేయునా. మన బ్రతుకు గండికి మాటు..
అది తీర్చునా సమస్యల పరిష్కారాల లోటు..

అందుకే..ఆలోచించు రవ్వంతపాటు..
మంచి నాయకుణ్ణి చేయండీ ఈ సమ సమాజానికి సామ్రాట్టు..
అందుకనే అందరం వేయాలి ఓటు..

మన కలల తీరేట్టు..
భావి భారతం బాగు పడేటట్టు..

– కిరీటి పుత్ర రామకూరి

Related Posts