ఓయ్

ఓయ్

ఓయ్!!!
నువ్వలా నవ్వి
నా గుండెను కవిస్తే
నాలోని అణువణువు
నిను ఆకర్షించే
నా పెదాలు దాటే
పదాలు మొదలు
పాదాలు సైతం
నీ వైపే పయనమాయే
అల్లుకోవా నీ వాడిలా
నీ వెన్నెల కౌగిట్లో !

ఓయ్!!!
ఎప్పుడో రాసిపెట్టుకున్నా
అడగ్గానే నన్ను నీకిద్దామని
హ్మ్మ్! నీకో సంగతి తెలుసా
నాలోని వెలుగు
నువు పంచిన భానుతేజమే
నీకెలా ఉందో గానీ నాకు మాత్రం
నీ ఊపిరి ఊయల్లో ఊగుతున్న
సంబరమే నను మురిపిస్తున్నది

అందుకేనోయ్…
నా పెదాల నీ పెదాలకిచ్చి
నీకై నేనెప్పుడో పయనమయ్యా
నీవే నా లోకమని
నీతో ఏకమవ
హత్తుకో…నీ వెచ్చని కౌగిట్లో

-అమృతరాజ్

Related Posts

1 Comment

Comments are closed.