ఓజోన్ పొరను మనమెలా నాశనం చేస్తున్నాం ?

ఓజోన్ పొరను మనమెలా నాశనం చేస్తున్నాం ?

భూగోళానికి రక్షణ
మానవాళిసంరక్షణ
ఓజోన్ పొర కవచం.

మనం చేస్తున్నాము దాన్ని
మరీ పలుచన

జీవరాశి పోషణ
పర్యావరణ పరిరక్షణ
కాపాడే భాద్యత
మానవులుగా మన కర్తవ్యం

వేడెక్కుతున్న భూగోళం
అతినీలలోహిత కిరణాలే
కారణం
ఓజోన్ కప్పివుంటే మనకు
ఉండదు ముప్పు

ప్రకృతి ఆక్షేపిస్తే ప్రతికూలం
కాదా వాతావరణం

కాలుష్యం తగ్గించి కాస్తంత
అయినా మేలు చేద్దాం

ప్రతిఒక్కరి ప్రయత్నం కావాలి
ప్రమాణ పూర్వకంగా

ప్లాస్టిక్ మాయఅంతా ఇంతా కాదు
విచ్చలవిడి వాడకం
దుష్పలితాలకు తావు
మరి వైపరీత్యం.

ఊహించని ఉష్ణము
కరింగించును మంచు
ఖండాలను గుర్తెరిగి

కాపాడే ప్రకృతినే కారుచిచ్చుల వలె కాల్చును
మారుతున్న సమతౌల్యం

ప్రాణికోటికి ఆధారమైన
ఆక్సీజన్ ప్రాధాన్యత
తెలిసే కదా కరోనా రూపంలో

శాస్త్రజ్ఞులు చెబుతున్నా
సామాన్యుడుకూడా
పెడచెవిన పెట్టినచో
కలిగేది మాత్రం
రేడియేషన్ ప్రభావం

విశ్వంలోని అనంత శక్తిని
రక్షణకవచంలా మాత్రమే
ఆలోచించాలిమానవులు

కనువిప్పు కలిగినచో
కాస్తో కూస్తో కలుగును
ప్రయోజనం …….?

– జి జయ

Related Posts