పాపం పసివాడు

పాపం పసివాడు

ఆ.వె

1) అందరాని మిద్దె లాకాశ హర్మ్యాలు
    ధనిక వర్గమునకు తగిన డాబు
    ఆకలి కడుపులకు అన్నము లేకున్న
    పెద్ద మేడ నీడ పేదలిండ్లు

ఆ.వె

2) బాలకార్మికులకు బాధ్యత పెరిగెను
     చట్టమేది దారి చూపదాయె
     చెమట కార్చుపనికి చేదు ఫలితమిచ్చె
     బాల బతుకు లెంత భారమాయె

ఆ.వె

3) కోటి విద్యలన్నికూటికోసమెనని
     మట్టి తట్ట చిట్టి పట్టి తెలిపె
     ఉడుత సాయమల్లె ఊతమై పసివాడు
     అక్కతోడు నిలిచె అన్నమునకు

– కోట

Related Posts