పాట

పాట

మూసగా సాగే
నా పాటకి
కొత్త రాగం నేర్పింది
అసలు పాటగా మార్చింది

భావం మార్చి వేసింది
అద్భుతంగా వినిపించింది
నిజాన్ని పలికించింది
అందంగా పాడించింది

నా చూపు మారింది
నా నడక మారింది
నలుగురి కోసం పాడే
నా పాట మారింది

అనతికాలంలోనే
అకస్మాత్తుగా
ఓ దుర్వార్త
ప్రజా విముక్తి
పోరులో ఆమె త్యాగం
దుఃఖమే మిగిల్చింది

ఆమె నాకేమిచ్చింది
చదువంటే సమాజ మార్పుకని
సరికొత్త పాటై గొంతున నిలిచింది

(నాకిష్టమైన రజిత టీచర్ కోసం…)

– అమృతరాజ్

Related Posts

1 Comment

  1. మీ జీవిత పాట ను మార్చిన రజిత టీచర్ గొప్పవారు..🙏🙏🙏🙏

Comments are closed.