పబ్బాల రేవు
మంచి కోరుకో
ముచ్చటైన దంపతులు ఇద్దరు మనిద్దరం ఎంత హాయి అని మహా ఆనందంగా సంతోషిస్తున్నారు రాజి, రఘు లు. 6 మంది జనాలు ఉన్నారు. ఎప్పుడుచాకిరీ యే కర్మ అనుకుంటూ ఉంటుంది. పెద్ద పండుగ వచ్చింది అదే ఉగాది అండి దానికి అందరూ కలిసి పద్ధతిగా చేసుకుంటూ ఉన్నారు పనులు. అందరూ పనులు పంచుకోవడం వల్ల హాయిగా పిండి వంటలతో సహా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు పురాణ పఠణం అన్ని పద్ధతిగా చక్కగా జరిగేయి పని పూర్తి చేసుకొని రవళి రాజీని తాంబూలం ఇస్తానని చెప్పి పిలిచింది.
అప్పటికి ఇంకా రాజీకి ఏ పని జరగలేదు. భర్త మీద విసుక్కుంటూ ఉంది ఇద్దరే కదా ఎంతో కష్టపడితే కానీ పని అవదు ఇంకా పని అవలేదండి సాయంత్రం వచ్చి తీసుకుంటాను. అలా జరిగింది పండుగ రాజీకీ. ఒకరోజు రాజీ భర్త రఘు పరిగెత్తుకుంటూ వచ్చి రవళి ఇంటికి వచ్చాడు ఆమె భర్తని అడుక్కుంటున్నాడు మా ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది ఏం చేయాలో తెలియడం లేదు అన్నాడు అంటే వెంటనే రవళి భర్త రమణ కొడుకుని పిలిచి డాక్టర్ కి ఫోన్ చేయమని చెప్పి తను వారి ఇంటికి వెళ్లి చేయగలిగిన ప్రాథమిక చికిత్సలన్ని చేశాడు.
ఈ లోపున డాక్టర్ వచ్చి ఏదో ఒక ఇంజక్షన్ ఇచ్చి వెంటనే హాస్పిటలుకీ తీసుకురమ్మని వాళ్ల ఆస్పత్రి వాన్ని తెప్పించి తీసుకెళ్లారు అన్ని పరీక్షలు అయ్యాక ఆమెకి గుండెల్లో చిన్న ట్రబుల్ ఉంది అది ఆపరేషన్ చేసి పేస్ మేకర్ పెడితే ఏం పర్వాలేదు అన్నాడు. తర్వాత ఫేస్ మేకర్ పెట్టి ఆపరేషన్ చేశారు అలా జరిగింది.తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారు దూరం నుంచి.
కానీ పని అయింది ఎవరివల్ల మన వాళ్ళు దూరంగా ఉండటం వల్ల వెంటనే ఉపయోగపడలేదు. అందుచేత మనకంటూ ఒక బలగం ఉంటే మనకు అన్ని విధాల కూడా సహాయ సౌకర్యాలు ఉంటాయి అనేటువంటి భావన రాజీకి రఘు మనసులో పడింది. ఎవరైనా వెనకా ముందు అని పెళ్లి సంబంధాలు చూసి చేస్తారు ఇలాగా నన్ను ముట్టుకోకు నామాల కాకి అని ఉంటే జీవితం ఇలాగే ఉంటుంది .ఏఅందుకే పెద్దలు ఆలోచించి ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూసి బంధు బలగాన్ని చూసి చేయండి అంటారు. అది వాళ్ళ అనుభవం వల్ల తెలుసుకొని చెప్పిన లోక విదితమైనటువంటి మంచి మాట.
– కె.కె.తాయారు