పచ్చదనం

పచ్చదనం

గాలితో చేసెను సరసాల గారడి
నీటితో దొరికెను సిగ్గుల కౌగిలి
నేల వేసెను పరువాల పారాణి
జాబిల్లి చూపెను సుకుమార సోగసిరి
కంటి కాటుకై కవ్వించెను రాత్రి
చెట్ల పచ్చదనంతో పైట కట్టిన ధరణి

ప్రకృతి తన సోయగాల కు అలంకారమద్ది
మురిపించి… మరిపించి… మధనపెట్టెను కదా..!!

– అక్షిత

Related Posts