పచ్చని కాపురం

పచ్చని కాపురం

ఒక చిన్న ఊరిలో రంగయ్య అనే అతను వుండేవాడు. వారిది మంచి కుటుంబం కాని రంగయ్య వాళ్ళ నాన్న తెలివైన వాడే అయినా మెతకతనం వల్ల ఆయన సొంత ఊరిలో పొలం అది వున్నా వ్యాపార నిమిత్తం దగ్గరలో వున్న పట్టణానికి వెళ్లి వ్యాపారం సాగించసాగాడు. అన్ని కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ  నలుగురి లో మంచి పేరు సంపాదించుకున్నాడు.

కాని కొంత కాలానికి రంగయ్యకు అత్యాశ కలిగింది ఏమిటా అంటే ఇన్నేళ్ల సంసారంలో దాచుకున్న డబ్బును పెంపు చేసుకునే మార్గం ఆలోచించాడు. అప్పుడు సుందరం అనే వ్యక్తి పరిచయమ్యాడు. అతని సలహాలు పాటిస్తూ షేర్ మార్కెట్లో పెట్టుబడులు వెచ్చిస్తూ నమ్మకంగా సాగిపోతున్న రోజుల్లో ఒక్క కుదుపు లాంటి సందర్భం వచ్చింది.

రంగయ్య కాసింత అనుమానానికి గురయ్యాడు దాంతో అనుమానపు రంగయ్యగా మారిపోయి ఎవ్వరు ఏమి మాట్లాడినా అంతరంగo మాత్రం సుందరం మాటలు రంగయ్య అర్దం కావటం లేదు. సుందరం మాత్రం రంగయ్య కు సలహాలు ఇస్తూనే వున్నాడు. ఎంతో కష్టపడి రంగయ్య అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఇల్లు కట్టుకున్నాడు.

వాస్తు దోషం వలన నీకు కలిసి రావడం లేదు అని అన్నాడు సుందరం. రంగయ్య మనసులో ఏదో ఆలోచన మేదిలి ఇంక లాభం లేదు ఏదో ఒకటి చెయ్యాలి అని వాస్తు శాస్త్రం సరిగ్గా తెలియని పండితున్ని తెచ్చి ఇల్లు చూపించాడు. రంగయ్య ఆర్థికంగా కుదుపు లో వున్నాడని పండితుడు బాగా తెలుసుకున్నాడు.

దాంతో ఆయన చెప్పిన మార్పులు చేర్పులు చేయ సాగాడు కాని రంగయ్య అనుమానం ఇంకా ముదిరి పోయింది. ఫీజు మాత్రం బాగా లాగుతున్నాడు వాస్తు నిపుణులు. సమస్యకు మాత్రం పరిష్కారం దొరకలేదు పోగా డబ్బులు వృధా అయ్యాయి.

“పచ్చని కాపురం” లో వాస్తు అనే చిచ్చు పెట్టి సుందరం అనుమానపు రంగయ్య గా పేరు తెచ్చుకున్నాడు. అందుకే మన తెలివి తేటలతో కూడా ఆలోచించి పనులు చెయ్యాలి….

– జి జయ

Related Posts