పదాల తోట

పదాల తోట

వేటూరి అక్షరాల్లో
హొయలు పోయిన పాట
తెలుగు భాషకు తేనెల మూట
పలుకుబడుల కోట
చక్కదనాల తోట
పదాల చిక్కని ఉట
ప్రాస అతని వేట
కనిపించును ప్రతి చోట
ప్రతిపూట ఆతని పాట
మనకేమో వీనుల విందట

పండిత పామరులకు ఊరట
ఆ పాట
తెలుగు పాటకు తీపట
ఆతని పదగుంభనల సయ్యాట
మనసుకేమో చిక్కని ఆట
మనకేమో మేలిమి బాట
అలుపు అదుపు లేని ఆతనిపాట
పారే నదిలా తోచునట
వేయి వేణువుల ఊపిరిలా
ఎటుగాంచిన అతనొక్కడేనట

– సి.యస్.రాంబాబు

Related Posts