పదహారేళ్ల వయసు

పదహారేళ్ల వయసు

పట్టుమని పదహారేళ్ల వయస్సు మొదలగును
విచిత్ర భావాల కదలికలు
తెలిసీ తెలియని వయసు
రమణీయత లో ప్రపంచం
అంతా బహు సుందరం
అలంకరణలో మునుగుతూ
అందరికన్నా అందాలచంద్ర
బింబ మనుకుందురు ఆ
వయసులో
నవయవ్వన అంకుర
దశలో ఉయ్యాల లూగును
మది గదిలో మాట వినదు
కదా మంచి ఏదో చెడు ఏదో
బాల్య ప్రాయం ముగిసి
సంఘర్షణల సమరం మొదలు అంతరంగం
ఆ వయసులోనే
సహచరుల తీపి కబుర్లు
సంగతితెలియనిచదువులు
మధుర ఊహల జగతిని
మనసారా ఆస్వాదనకు
స్వేచ్ఛా వాయువుల కోసం
ఆరాటపుఆశలసయ్యాటలు
పదహారేళ్ల వయసులో
పదునైన ఆలోచనలతో
నిండుగా మెండుగా
అను క్షణం…….?

– జి జయ

Related Posts