పడవ ప్రయాణం!

పడవ ప్రయాణం!

మనసు దోచిన మనిషి దగ్గర
మమత పెరిగి లోకాన్ని మరిస్తే
చిరుగాలి పలకరించే
సూరీడు తొంగి చూసే సరికి
పరువపు ప్రణయంలో
రెండు మనసుల చెలిమి
చైతన్యపు వెలుగుల మధ్య
పరుగు జీవితంలో కాసేపాగి
ఒంటరిగా కాకుండా జంటగా
ప్రకృతి అందాలనుచూస్తూ
సాగుతున్న కాలాన్ని కాసేపు
ఆపైనా సరే
ఆశల సవ్వడి లో
అనురాగపు జడిలోతడిసి
దూరాలు తగ్గిన హృదయపు
కొలనులో అందాల వంతెన వరకు సాగే పడవ ప్రయాణం!

– జి జయ

Related Posts