పైరు పచ్చలు కదలుతు…!!!
ఆ నింగి నేలను కలవదు
కలిసేరోజు ఏమో తెలియదు…!!
కళ్ళోల మెందుకు కళ్ళెదుట ప్రకృతిలో
క్షణాలు మరిచిన తనువు మనస్సును
ఏకంచేసి… తీసే దోర కునుకుకు ఎంతటి
యోగ్యమో…
పరిచిన తివాచీలుగా పచ్చిక
బయళ్ళపై పయనించే పిల్ల గాలులు
చెవులకు ఇంపుగా వినబడుతు…!!
పైరు పచ్చలు కదలుతు సెలయేటి
అంచులపై సాగేటి గువ్వల గుంపులకు
తలచిన ఆశయం దూరం కాదని…
ఆనందానికి ఆహ్లాదానికి మధ్యనుండే
జీవితానిది ఎంతటి ధన్యమో…
పంచభక్ష పరమాన్నాలతో కడుపు
నిండక పోయినా…కలిపిన పచ్చడి
మెతుకులే పరబ్రహ్మ స్వరూపమని…!!
దిగులును వీడి పంట దిగుబడితో
కాయాలని పంచ భూతాత్మకాలను
వేడుకొంటు…సంధ్యాల కవనానికి
సిద్ధమయ్యే ముసలి తనానికి ఆశలతో
పనేముంటుంది…
కలవరపాటు చెందిన క్షణాలతో
సమయం ముందర మోకరిళ్ళకు
బతుకొక వింత ఆటని పొరబడకు…!!
సముదాయాలతో నియమమై నీలోకి
తొంగి చూడు…ఎన్నో సాధింపులకు
నిలయమైనా నీ దేహం అనుసంధానపు
ఆప్యాయతలను పంచుకొంటు పరులకై
జీవించు…నువ్వే మనిషివి…
– దేరంగుల భైరవ