పక్షుల్లా చెట్టపై ఇళ్ళు
ఈ ఐడియా బాగుంది. చాలా తక్కువ మంది ఈ ప్రయత్నం చేసారు. అసలు హాటల్ వ్యాపారం చేసే వారికి ఇదొక ఐడియా. చెట్లపై చక్కటి గదులు కట్టి రెస్టారెంట్ నడిపితే డబ్బులు బాగా వస్తాయి. పైగా రూములు కట్టి అద్దెకు ఇస్తే వంద శాతం చక్కగా సక్సెస్ అవుతుంది.
టూరిస్టులు ఆ రూములు బుక్ చేసుకోవటానికి తహతహ లాడతారు. ఇదొక అధ్భుతమైన అనుభవంగా వారికి మిగిలిపోతుంది. పురాణ కాలం నుంచి ఇప్పటివరకు ఇలాంటి ఐడియా ఎవరికీ రాలేదు. ప్రకృతి ప్రేమికులు దీన్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తారు.
ఇప్పటి వరకు పక్షులు ఉండే చెట్లు ఇప్పుడు మనుషులకు నివాసం అవుతాయి. ఆ విధంగా అయినా చెట్లు కొట్టడం తగ్గిపోతుంది. ప్రపంచం అంతా పచ్చని చెట్లతో నిండిపోతుంది. ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారు. మన రచనలు చదివిన తరువాత అయినా ప్రజల్లో దీని గురించి చర్చ జరిగితే బావుణ్ణు. ఈ ఐడియాకు పేటెంట్ తీసుకోండి. ఇప్పటి వరకు ఎవరూ పేటెంట్ తీసుకుని ఉండరు. ఏదిఏమైనా మంచి ఆలోచన.
– వెంకట భానుప్రసాద్ చలసాని