పాలవెల్లి!!

పాలవెల్లి!!

ప్రాణవాయువుని,
ఎగ, తెగ పీల్చుట వచ్చునే…!
ప్రాణివి అయ్యి కూడా
పాపాల ముల్లె మోస్తువు దేనికి…..?

చెట్టు ప్రాణి యే నీ మాదిరి.
అది నీకు ఇచ్చును
తన ఊపిరిలో భాగము కొంత.

దాన్ని
కొట్టి, నరికి,
నీ కొంప కట్టెదవు.

స్వేదమే
వరదలై నీ కొంప
ముంచును రా….!
గాలి లేక
అల్లాడి పోదువు రా.

అడవులు
భూమాత ఆలయాలు రా….!
అమ్మకి
నీడనిచ్చే పాలవెల్లులు రా…..!

కొందువు గాలిని కోట్లు పెట్టి
ఉందువు ఆసుపత్రిలో
నీ కొంప ను
పక్కకునెట్టి, ఎందుకు రా….?

ఊపిరినిచ్చె చెట్టు నీకు ఊరకనే.
ఊపిరి తీస్తివి దానిది,
ఈ ఉసురు పోదు ఊరకే…..!

– వాసు

Related Posts