పల్లకి

పల్లకి

పల్లకి

ఒక్కగానొక్క కూతుర్ని అని నన్ను గారాబంగా పెంచారు అని అనుకుంటారేమో, అది బయట మాత్రమే, లోపల మాత్రం తిట్లు , దీవెనలు, బళ్లో బాగా చదువుతుంది అంటే ఆహా ఏం వెలగబెడతామని వెటకారాలు, ఇవే కాక కొంచం పెద్దయ్యాక అంటే ఐదవ తరగతి నుండే ,ఇల్లు ఉడవడం, కoచలు కడగడం, చిన్నగా బట్టలు ఉతకడం, ఈ పనులు చెప్పడం, నాకు చేయారాకపోతే ,రేపు అత్తారింట్లో నన్ను అంటారే, నీకు “తల్లి ఏమి నేర్పలేదా అని అంటూ, “నేర్చుకో….

ఇప్పటినుండి అంటూ అన్ని పనులు చేయించడం, చేయడం రాకపోతే మొట్టికాయలు వేయడం, ఇంకాస్త పెద్దయ్యాక, అదే పెద్దమనిషి కాగానే , లేనిపోని ఆంక్షలు, ఆర్డర్ లు , పదవ తరగతిలో ఫస్ట్ వస్తే, ఇక చదివింది చాలు అన్నారు. లేదు నేను డాక్టర్ కావాలని అన్నాను, నీ మొఖానికి డాక్టర్ ఎందుకే అని అంటూనే తమ్ముడిని ఇంజనీరింగ్ చేయించాలని నా ముందే మాట్లాడుకున్నారు…

చాలా ప్రయత్నాలు చేసి ఓడిపోయాను, చదవాలని నేను చేసిన ఒక్క ప్రయత్నం ఫలించలేదు, మొండిగా ఉన్నా, నా మొండి తనాన్ని చూసి, ఇలా కాదని మేనత్త కొడుకు తో  పెళ్లి నిర్ణయించారు. వద్దు నాకన్నా చాలా పెద్దవాడు అంటే , నీ మొఖం నీకేం తెలుసు ,నోరు మూసుకో , మాకు తెలీదా ఎం చేయాలో అన్నారు, మళ్ళీ నా నోరు మూశారు. చదువుకునే రోజుల్లో ఆడపిల్లని పెళ్ళప్పుడు పల్లకిలో ఊరేగిస్తారు అని చదివాను. నన్ను కూడా అలాగే ఊరేగిస్తారు అనుకున్నా , కానీ అవేవీ లేకుండానే చాలా తేలికగా నలుగురు పెద్దల మధ్య పెళ్లి అయ్యింది,

15 ఏళ్ళు కూడా లేని నాన్ని  30 ఏళ్లున్న వాడికి ఇచ్చి,చేశారు, బొమ్మలా కూర్చున్న, నా లాంటి అందమైన అమ్మాయి వస్తుందని, సంతోషంగా ఉన్నాడు వాడు , అదే మొగుడు అనే రాక్షసుడు,మొదటి రాత్రి అసలు అది అంటే కూడా తెలియని నన్ను , తెల్ల చీర,మల్లెపూలు పెట్టి, గదిలోకి పంపించారు.ఏమి చేయాలి , అక్కడే ,తలుపు దెగ్గరే నిలబడ్డాను,

“”ఏయి ఏంటి అక్కడే నిలబడ్డావ్, దా , వచ్చి ఇదిగో నా కాళ్ళు నొక్కు , పెళ్లిలో నిలబడి , నిలబడి , కాళ్ళు లాగుతున్నాయి, రా రా, అప్పటినుండి నీ కోసమే ఎదురుచూస్తున్నా, ఏమో మొదటి రాత్రి మొగుడు ఇలాగే అంటాడేమో, సరే వెళ్లి కింద కూర్చుని కాళ్ళు నొక్కుతున్నా, ఏయ్ మంచిగా  కూర్చో, అని అంటూ , కాళ్ళు రెండు తీసి, నా ఒళ్ళో వేసాడు..

ఎప్పుడు నిద్రపోయానో కానీ , ఎవరివో చేతులు ఒంటి మీద తగులుతుంటే మెలకువ వచ్చింది, చేతులు రెండు తోసేసాను, ఏయి నోరు మూసుకో, చెప్పినట్టు వినలేదో, నీకు విడాకులు ఇస్తా, జాగ్రత్త, అంటూ నన్ను అక్రమించుకున్నాడు, అబ్,నా నోట్లోంచి కేక రాకముందే, నోరు నొక్కేసి, కసిగా, ఆబగా, ఆత్రంగా , నా మనసుని, శరీరాన్ని మలినం చేసేసి, రెండు నిమిషాల తర్వాత గురక పెడుతూ పడుకున్నాడు,నేను అలాగే సొమ్మసిల్లి పోయా, ..

********

ఇక అక్కడి నుండి ప్రతి రాత్రి నరకమే, ఓ రోజు కొవ్వొత్తి, ఇంకో రోజు సిగరెట్, ఇంకో రోజు కర్ర ఇలా ఏదీ పడితే దంతోనే నాకు నరకం చూపించేవాడు.పోని తల్లిదండ్రులకి చెప్పాలన్నా, భయమే, చెప్పావో అందరిని చంపేస్తా,బెదిరింపులు, సాధింపుల మధ్య. చిన్న సంతోషం అమ్మని కాబోతున్న అనే వార్త, పోనీ దాంతో అయినా మారతారేమో అని సంతోషoగా చెప్పాను..

ఇక మళ్ళీ సాధింపులు, అడపిల్లని కనోద్దు, మగవాడినే కనాలి, నా బొంద నాకేలా తెలుస్తుంది ఆడో, మొగ అని , అదే అన్నాను, వాళ్ళు ఆలోచనలో పడ్డారు. మంచికే ఆలోచిస్తున్నారు అనుకున్నాను. కానీ ఆ తర్వాత తెలిసింది. కుట్ర చేస్తున్నారు అని, ఒక రోజు నన్ను పెద్ద ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు..

నేను నెల తప్పిన సంగతి  నాకే చాలా రోజుల వరకు తెలియదు, ఇంటి పక్క ఆవిడ నా కడుపు చూసి అంది, దాంతో నిజమేనని అనుకుని అత్తకి చెప్పాను, అప్పటి నుండి మగవాడి నే కనాలి అని అన్నారు. అసలు ఆసుపత్రికి తీసుకు వెళ్ళలేదు. హమ్మయ్య ఇప్పటికైనా తీసుకుని వెళ్తున్నారు, అని అనుకున్నా…….,

చాలా పెద్ద ఆసుపత్రి , లోనికి వెళ్ళాము , డాక్టర్ చూసి రా అమ్మా పడుకో, అంది డాక్టర్ ఆప్యాయంగా, దానికే పొంగి పోయాను, పడుకున్నా, గ్లౌస్ వేసుకుని వచ్చి, ఎన్ని నెలలు ,ఏడో నెల అనుకుంటున్నా కదా అంది,నేను లెక్క పెట్టి అవును అని అన్నాను, లోపల చేయి పెట్టింది. సిగ్గుతో కుచించుకుపోయా, అలా చేయకమ్మా, నీకు బిడ్డ కావాలా , వద్దా అని అంది, కావాలి అన్నాను, అయితే  మంచిగా పడుకో అని అంది. పడుకున్నా నా బిడ్డ కోసం…

*******

తర్వాత చీర కిందకి జరిపి, లంగా లూస్ చేయించి, ఎదో పూసింది, ఆ తర్వాత ఇంకేదో దానితో కడుపు మీద అటూ, ఇటూ కదుపుతూ టీవీ లో చూడసాగింది..కొంచం సేపు తర్వాత నా మొగుడు, అత్తా వచ్చారు,లోపలికి, వాళ్ళు రాగానే నన్ను  ఇంకో రూo లోకి వెళ్లి ,చీర మంచిగా కట్టుకోమ్మని చెప్పింది.

వారికి జాగ్రత్తలు చెప్తుందేమో  అనుకున్నా, ఆ తర్వాత గంట అదే రూమ్ లో కూర్చున్నా, గంట తర్వాత నా మొగుడు , అత్త మొఖాలు మాడ్చుకుని వచ్చారు, నా వద్దకి, ఏమైంది అని అడిగా , పద అ రూమ్ లో  ఉందాం అంటూ నా చేయి పట్టుకుని ,లాక్కువెళ్లాడు నా మొగుడు,ఎందుకు అని అడిగా, ఎదో సమస్య ఉందంటా లోపల , బాబుకి దాన్ని బాగుచేస్తారట అని చెప్పాడు, అవునా అన్నాను సంతోషంగా, వాళ్ళు  మారుతున్నారు అనే ఆనందం లో వెళ్లి ఆ రూమ్ లో బెడ్ మీద పడుకున్నా,

లోనికి ఒక్కదాన్నే వెళ్ళాను, ఒక నర్సు వచ్చి , ఏదో పైపు పెట్టింది లోపల  , కాసేపటికి కడుపులో ఉన్నదంతా బయటకి పొయింది. ఆ తర్వాత చీర విప్పామని అంది, విప్పాను, జాకెట్ ఒక్కటే ఉంది. ఒక పచ్చ బట్ట కప్పారు,నా మీద గొంతు వరకు,ఆ తర్వాత డాక్టర్ వచ్చి, ఏదో ఇంజెక్షన్  నడుముకు ఇచ్చింది..

నడుము అంతా మొద్దు బారింది. కళ్ళతో అన్ని చూస్తున్నా, ఏమమ్మా  నొప్పిగా అనిపిస్తే చెప్పు , అంది, అలాగే  అన్నాను. ఇంతలో చాకులు,ఇంకేవో తెచ్చారు. అవన్నీ చూస్తున్నా, బిడ్డ బాగుంటే చాలు, మంచిగా , అందంగా పుట్టాలి, ఏ అవకారం లేకుండా, ఆ సమస్య ఎదో వాళ్ళు సరిచేస్తారు అని అనుకున్నా, కొంచం సేపు అవ్వగానే నన్ను మాటలలో పెట్టారు. పెళ్లి అయ్యి ఎన్ని రోజులు అవుతుంది, ఇది ఎన్నో కానుపు అని అడిగింది డాక్టర్, మొదటి బిడ్డ అనగానే , ఆశ్చర్యపోయి, అయ్యో అవునా, మరి మొదటి బిడ్డని ఎందుకు తీసేసుకుంటున్నావ్ అని అడిగింది ఆమె..

అదేంటమ్మా అలా అడిగారు ఇది నాకు మొదటి  బిడ్డకి ఎదో సమస్య ఉంది. మీరు సారి చేస్తారు అని అంటేనే కదా దీనికి ఒప్పుకున్నా, నా భర్త అలాగే చెప్పాడు. (అప్పటికే సగం పిండం కరిగిపోయింది. ) అన్నాను. అదేంటమ్మా మీ ఆయన నీకు పిల్లలు ఇష్టం లేదని, ఇంతకు ముందు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఈ పిల్లాడిని వద్దు అని అనుకుంటున్నారు అని చెప్పడే,అంది…

తల మీద పెద్ద బండ రాయి పడిందేమో అని అనుకున్నా, లేదు ,వద్దు వద్దు నా బిడ్డని చంపొద్దు, అంటూ పిచ్చిగా అరవసాగాను, ఆ అరుపులకి ,సగం పిండం లోపలికి వెళ్ళింది. పైకి ,ఇంకా పైకి నా శ్వాస పైకి ఎగిసినకొద్దీ పిండం ఇంకా పైకి రావడం మొదలయ్యింది.అరవకమ్మా, నీకె కష్టం, సగం పిండం వచ్చేసింది , ఇంకా సగం లోన ఉంది, అని గాబరా పడసాగింది డాక్టర్..

**********

వద్దు , వద్దు ,వద్దు నా బిడ్డని నాకు ఇచ్చేయండి,అంటూ ఎడవసాగాను. అలా ..అలా అలా ఏడుస్తూనే , నా బిడ్డని , నాతోనే తీసుకెళ్లిపోయాను., నేను పోయాను అని తెలిసి, నా తల్లిదండ్రులు వచ్చారు,ఏడుస్తూ.. వాళ్ళని చూసి నవ్వుతున్నా నేను , ఏడవండి ,ఇంకా ఏడవండి, అడపిల్లని అని తక్కువ చేసి చూసారు. ఇప్పుడు ఏం జరిగింది, నాకు, మీకు కడుపుకోత తప్పా, హ హో మీకు ఒక కొడుకు వంశోద్ధారకుడు ఉన్నాడు కదా, వాడిని చూసుకుంటూ మురవండి,…

అయ్యో నా తల్లి నీకు అప్పుడే నూరేళ్లు నిండి పోయాయా, అంటూ ఏడుస్తోంది నా తల్లి, హు ఇప్పుడేంటమ్మా  ఎప్పుడో, ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటి అని భావించినప్పుడు , తమ్మునికి మంచి బట్టలు కొని,నాకు చిరిగిన బట్టలు ఉన్నా,పట్టించుకొనప్పుడు,

నన్ను చదువుకోవద్దు అన్నప్పుడు, ఇంట్లో ఒక పని పిల్లగా చూసినప్పుడు, పదిహేను ఏళ్ళు కూడా నిండని నన్ను , ముప్పై ఏళ్ల వాడికి కట్టబెట్టినప్పుడు, వాడు నన్ను ఎలా చూసుకుంటున్నాడో కూడా మీరు తెలుసుకోలేనప్పుడు, కూతురు తల్లి అవుతుంది అని చెప్పినా రానప్పుడు, వారిని నిలదీయాల్సిన సమయంలో నిలదీయలేనప్పుడు, అప్పుడే, అప్పుడే  నేను మానసికంగా చచ్చిపోయాను అమ్మా…

చి నిన్ను అలా పిలవాలని కూడా నాకు లేదమ్మా , ఏ కూతురు ఇలా అనుకోదు కావచ్చు, నువ్వు నా కన్నతల్లివే అయితే ఇదంతా చూస్తూ కూర్చొవు, నువ్వు కూడా ఒక అడదానివి అయి ఉండి, నన్ను కుంపటిలా భావించావు, అందుకే నిన్ను అమ్మా అని కూడా పిలవాలని అనిపించడం లేదు..

అప్పుడు పెళ్ళిలో పల్లకిలో తీసుకు వెళ్తారు అనుకున్నా, కానీ ఇప్పుడు పల్లకి లాంటి నాలుగు కట్టెలు పరచి, పెళ్లి కూతురిలా ముస్తాబు చేసి పంపుతున్నారు. నిజమే పెళ్లి చావు పల్లకితో సమానం అనుకుంటూ పెద్దగా నవ్వాను. తర్వాత అమ్మను చూస్తూ అమ్మా…

నువ్వు వద్దు అని గట్టిగా మాట్లాడిన, నన్ను చదువుకో అని అన్నా కూడా బాగుండేది ఏమో, కానీ నీ మొగుడి మాటలు విని , నన్ను బలి పశువుని చేశావు, ఏడువు, ఇంకా , ఇంకా ఇంకా ఏడువు, బాగా ఏడువు.. ఓ కన్నా  తల్లిదండ్రులారా మీ అడపిల్లలని అడ పిల్లగా చూడకండి, బలి పశువుని చేయకండి, వారిని మీరు భాద పెడితే, వారిని మీరు చులకన గా చూస్తే, మీకు వారి శాపం తగులుతుంది.

ఆడదాని కంట కన్నీరు పెట్టిస్తే రాజ్యలే కూలిపోయాయి. మీరెంత , వెళ్తున్నా, నేను వెళ్తున్నా, నా బిడ్డను నాలో నేను దాచుకుని , మీకు అందనంత దూరం వెళ్లిపోతున్నా, ఇకనైనా కళ్ళు తెరవండి, పుట్టిన ఆడపిల్లను పురిటీలోనే చంపేస్తే, మీకు మళ్ళీ ఆడపిల్ల కావాలి అంటే దొరకదు, ఎంత వెతికినా దొరకదు. మీరు చేసే పాపాలు, మీ పిల్లలకి అడపిల్లని లేకుండా చేస్తాయి. మేలుకో మనవుడా, మేలుకో.. ఇకనైనా ఈ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ లని కాపాడు…

ఇది నా కథ , నీ కథ, ప్రతి ఒక్క ఆడపిల్ల కథ, ప్రతి ఒక్క ఇల్లాలి కథ,ప్రతి మహిళ కథ, ఇది ఒక భూదేవి కథ, ఇది ఒక శ్రీదేవి కథ ,  అవును ఇది మా నా కథ…….. అడవాళ్ళందరికి వందనాలు వారికి ఈ నా కథ అంకితం…

 

– భవ్య చారు

బంగారం Previous post బంగారం
మోసం చేశారు Next post మోసం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close