పండు వెన్నెల

పండువెన్నెల

పండువెన్నెల

 

నిండు జాబిలి..
పండు వెన్నెల..
మెండుగా ఉండు వేళ..
పౌర్ణమి…
ఆ వెండి వెన్నెల్లో ..
చందమామ విరబూస్తుంది..
పసి పిల్లలకైతే..
కోసుకోవాలని తపన..
కొంచం పెద్ద వాళ్లకైతే..
ముచ్చటించాలని కోరిక..
మరీ పెద్దవాళ్లకైతే..
వెన్నెల్లో విహరించాలని..
అభిలాష..
కవులకైతే కవితలు..
రాసేయాలని ఉబలాటం..
రచయితలకైతే..
రచనలు చేయాలని ..
ఉత్సాహం..
కానీ..
ఆ వెన్నెలను ఆస్వాదించేది..
ఎంతమంది?
అందరూ ఈ మాయదారి..
ఫోన్లతో బిజీ బిజీ!!

 

-ఉమాదేవి ఎర్రం

 

నిండుజాబిలి Previous post నిండు జాబిలి
సాయిచరితము-183 Next post సాయిచరితము-183

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close