పంజరపు బ్రతుకు

పంజరపు బ్రతుకు

ఇంతకు నుందు కాలంలో..
పక్షులు పంజరంలో.
.మనుషులు సమాజంలో (ఇళ్లల్లో)..
ఇప్పటి కాలంలో..
మనుషులు పంజరాల్లో..
పక్షులు స్వేఛ్చా తరంగాల్లో..
పిల్లలకైతే స్మార్ట్ ఫోన్లు చేతుల్లో..
కళ్లేమెా ఆ ఫోన్లలో..
చెవులకేమెా ఇయర్ ఫోన్స్..
పిలిచినా కాదు కాదు అరిచినా..
వినపడనే పడదు..
మరీ బుజ్జిగాళ్లకు ఫోన్ ఇస్తేనే అన్నం తినడం..
కొంచం పెద్దయ్యాక చదువైనా సరే..
ఫోన్ లోనే..
హోం వర్క్ లైనా వాట్సప్ లోనే ..
తెలుసుకుని రాయడం..
ఆటలైనా ఫోన్ లోనే ఆడడం..
పెద్దలైనా పిల్లలైనా పంజరాల్లోనే..
బ్రతకడం..
ఇరుగు పొరుగు లేదు..
ఎప్పుడు చూసినా ఫోన్ ఫ్రెండ్సే!!
పక్కన ఉండేది ఎవరో తెలియదు కాని..
ఎక్కడో ఉన్న ఫోన్ ఫ్రెండ్స్ కి రోజూ గుడ్ మార్నింగ్ లు చెప్పుకోవడం..
వాల్లేం తిన్నారో కూడా తెలుసుకోవడం…
పక్కన వాడి ప్రాణం పోతున్నా..
పలకరింరులు లేనే లేవు..
ఒకవేళ ఉంటే గింటే ఫోన్ లోనే!!
ఇదండీ ఈ కాలం సంగతి!!
పంజరపు బ్రతుకులాయే!!

– ఉమాదేవి ఎర్రం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *