పరిచయ భయం

 పరిచయ భయం

కొత్త స్నేహాం

అనుభవాల దెబ్బల
అపురూప అనుభూతులు
మరచు సమయాన,కొత్త
అనుభూతి కోరుట మేలా !

ఏదో తెలియని భీతి
కొత్తొక వింత, కాకూడదు
గుణపాఠం, వద్దనిపించే
భయం,కాని స్నేహంలేనీ

జీవితం ,అంధకార బంధురం
మంచికి మారు రూపాలు దొరకొచ్చు
మంచి ఆశిస్తే మంచే జరుగును
తప్పు చేయనపుడు,భయమేల !

భారం భగవంతుని ‌పై ,వేసి
ముందడుగు వేస్తే
ఏమో ఎవరికెరుక
అదృష్టరేఖ ఆవలి దరి
చేర్చునే మో!!!

-కె.కె.తాయారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *