ఈ రోజు అంశం
పరిచయ భయం
శీర్షిక
భయాన్ని జోకొట్టు.
పాతవారితో కూడా స్నేహాన్ని కొనసాగించి తీరాలి. కొత్త వారిని పరిచయం చేసుకోవాలి.
ఉదాహరణకు ఈ గ్రూపులోకి
రాకముందు నాకు మీరెవరూ
తెలియదు. అప్పుడు మీరంతా
కొత్తవారే. మీతో ఎలాగో పరిచయం అయ్యింది. మాటా-
మంతీ కలిసింది. ఇప్పుడు ఒక
మిత్ర భావన మన మధ్య ఉంది. నాకు సజ్జన సాంగత్యం
కలిగింది. అదే మనం భయపడి
మన చుట్టూ ఒక గిరి గీసుకుని
నన్నంటుకోకు నామాల కాకి
అనుకుని ఉంటే ఇంతమంది
రచయితల పరిచయ భాగ్యం
కలిగేదా. బావిలో కప్పలాగా
ఉండేకంటే మన చుట్టూ ఉండే నలుగురితో, వీలైతే పదుగురితో పరిచయాలు పెంచుకుంటే కొత్త విషయాలు
అనేకం తెలుస్తాయి. సత్కాలక్షేపం జరుగుతుంది.
మీరంతా అక్షరలిపిలో జేరండి.
ఈ రచన నా స్వీయ రచన
అని హామీ ఇస్తున్నాను.
వెంకట భానుప్రసాద్ చలసాని