పసిడి బాల్యమా…!!??

పసిడి బాల్యమా…!!??

బతుకు పోరులో చితికిన బాల్యమా

ఆకలి చెర లో బంధీలయ్యారా…!?

పిడికెడు మెతుకులు చేతికి రాక

గంజి నీళ్లకు గరీబులయ్యారా…!?
పసిడి బాల్యం పసిమొగ్గల్లా  వాడిపోతూ
మీ చెమట చుక్కలే……
కలిగిన వారికి అత్తరు పన్నీరు అవుతుంటే
బంగరు రంగుల ప్రణాళికలు రాసే
ఏలికల వారు చోద్యం చూస్తుంటే
రెక్కలు విరిగిన సీతాకోకచిలుకల్లా
ఎగరలేక, బ్రతకలేక
బతుకు భారమై…..
నడయాడుతున్నా మీ లేత పాదాలను
నేలతల్లి ముద్దాడుతుండగా
అందమైన బాల్యం అంధకారమౌతుండగా
ఈ పరిస్థితి కి కారణం వ్వవస్థనా…!?
వ్వవస్థలో భాగమైన నేను కూడానా…!!??
– అంకుష్

Related Posts