పసివాడు

పసివాడు

తన జీవననావకోసం
ఎన్నో కడలిలను దాటవేస్తూ
తన ఆకలి కోసం
బ్రతుకును అంకితం చేస్తూ
ఓ ప్రక్క దారిద్ర్యాన్ని దాటే క్రమంలో
ఎన్నో వ్యయప్రయాసలతో కొనసాగుతూ
తన పొట్టతో పాటు
తన ఇంటిల్లిపాది వారి కడుపును నింపుటకు
తనే ఓ సైనికునిగా పోరాటం చేస్తూ
దారే ఆహారంగా తన జీవనాన్ని మలుచుకున్న
ఓ పసివాడు

– గోగుల నారాయణ

Related Posts