పత్రికా పర్వదినం

పత్రికా పర్వదినం

అక్షరం ఆయుధంగా మారి ప్రపంచ పరిస్థితులను పరిచయం చేసే నేస్తం పత్రిక…

పదం పవనం లా ప్రయాణించి పరిస్థితులను చక్కబెట్టే నేస్తం పత్రిక…..

నింగి, నేల, నీరు, నిప్పు సైతం పలు విషయాలను పేర్చి చెప్పేది పత్రిక…

మూల మూలాన మానవుడి కదలిక కల్లకు కట్టినట్టు కనిపించి చూపేది పత్రిక…

నిజాన్ని నిప్పులం….
అవసరానికి ఆయుధంలా….
రాజకీయానికి రాజులా…
పాపం ను ప్రశ్నించేది పత్రిక….

దిక్కులేని స్థితిలో పేదవాడి అనాయ్యంలో ఆసరాలా….

న్యాయానికి నాన్నలా…..
పంచభూతాల ప్రపంచానికి పెన్నిదిలా…

కాలాన్ని కదిలించే కవి యుగానికి కళాత్మక నిధి…. పత్రిక పెన్నిది.

– తోగరాపు దేవి

Related Posts